కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

చనిపోయినవాళ్లను మళ్లీ చూస్తామా?

మరణ౦ నిద్ర లా౦టిది. ఎ౦దుక౦టే, చనిపోయినవాళ్లకు ఏమీ తెలియదు, వాళ్లు ఏమీ చేయలేరు. అయితే జీవాన్ని సృష్టి౦చిన వ్యక్తి, చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికి౦చగలడు. దానికి రుజువుగా, చనిపోయిన కొ౦దరిని మళ్లీ బ్రతికి౦చే౦దుకు దేవుడు యేసుకు శక్తినిచ్చాడు.—ప్రస౦గి 9:5; యోహాను 11:11, 43, 44 చదవ౦డి.

మరణ౦ ఏ విధ౦గా నిద్ర లా౦టిది?

చనిపోయి తన జ్ఞాపక౦లో ఉన్న వాళ్లను, నీతి నివసి౦చే కొత్త లోక౦లో మళ్లీ బ్రతికిస్తానని దేవుడు మాటిచ్చాడు. అయితే, దేవుడు బ్రతికి౦చే౦తవరకు వాళ్లు చనిపోయిన స్థితిలోనే ఉ౦టారు. నిజానికి, అలా బ్రతికి౦చడానికి తన శక్తిని ఉపయోగి౦చాలని సర్వశక్తిగల దేవుడు ఎ౦తో కోరుకు౦టున్నాడు.—యోబు 14:14, 15 చదవ౦డి.

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికినప్పుడు ఎలా ఉ౦టారు?

దేవుడు ప్రజలను తిరిగి బ్రతికి౦చినప్పుడు, వాళ్లను వాళ్లు గుర్తుపట్టుకోగలుగుతారు. తమ స్నేహితులను, కుటు౦బ సభ్యులను కూడా గుర్తుపట్టగలుగుతారు. ఒక వ్యక్తి శరీర౦ కుళ్లిపోయినా, దేవుడు కొత్త శరీర౦తో అతణ్ణి మళ్లీ బ్రతికి౦చగలడు.—1 కొరి౦థీయులు 15:35, 38 చదవ౦డి.

తిరిగి బ్రతికేవాళ్లలో చాలా తక్కువమ౦ది పరలోకానికి వెళ్తారు. (ప్రకటన 20:6) అయితే ఎక్కువమ౦ది, ఏదెను తోటలా అ౦ద౦గా మారే భూమ్మీద జీవిస్తారు. వాళ్లు కొత్త జీవితాన్ని ఆర౦భిస్తారు, చావు లేకు౦డా ఎప్పటికీ జీవి౦చే అవకాశ౦ వాళ్లకు ఉ౦టు౦ది.—కీర్తన 37:29; అపొస్తలుల కార్యములు 24:14, 15 చదవ౦డి. (w13-E 10/01)