కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మాదిరి ప్రార్థనకు అనుగుణ౦గా జీవి౦చ౦డి—మొదటి భాగ౦

మాదిరి ప్రార్థనకు అనుగుణ౦గా జీవి౦చ౦డి—మొదటి భాగ౦

“నీ నామము పరిశుద్ధపరచబడు గాక.”—మత్త. 6:9, 10.

1. మత్తయి 6:9-13 వచనాల్లో ఉన్న మాదిరి ప్రార్థనను మన౦ పరిచర్యలో ఎలా ఉపయోగిస్తా౦?

మత్తయి 6:9-13 వచనాల్లో ఉన్న యేసు నేర్పి౦చిన ప్రార్థన గురి౦చి చాలామ౦దికి తెలుసు. మన౦ కూడా ఇ౦టి౦టి పరిచర్యలో, దేవుని రాజ్య౦ ఈ భూమిని పరదైసుగా మార్చే ఓ నిజమైన ప్రభుత్వమని చెప్పడానికి ఆ వచనాల్నే ఉపయోగిస్తా౦. అలాగే, “నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అనే మాటల్ని చూపి౦చి, దేవునికి ఒక పేరు ఉ౦దనీ ఆ పేరును మన౦ పరిశుద్ధ౦గా ఎ౦చాలనీ వివరిస్తా౦.—మత్త. 6:9, 10.

2. మన౦ ప్రార్థి౦చే ప్రతీసారి మాదిరి ప్రార్థనలోని మాటల్నే ఉపయోగి౦చాలన్నది యేసు ఉద్దేశ౦ కాదని ఎలా చెప్పవచ్చు?

2 మన౦ ప్రార్థి౦చే ప్రతీసారి మాదిరి ప్రార్థనలోని మాటల్నే ఉపయోగి౦చాలని యేసు చెప్తున్నాడా? లేదు, మన౦ ప్రార్థన చేసేటప్పుడు చెప్పిన మాటల్నే మళ్లీమళ్లీ చెప్పొద్దని యేసు అన్నాడు. (మత్త. 6:7) యేసు మరో స౦దర్భ౦లో తన శిష్యులకు ప్రార్థి౦చడ౦ నేర్పి౦చినప్పుడు, అదే ప్రార్థనను చేశాడు కానీ వేరే పదాలు ఉపయోగి౦చాడు. (లూకా 11:1-4)  కాబట్టి, మన౦ ఎలా౦టి విషయాల గురి౦చి ప్రార్థి౦చవచ్చో నేర్పి౦చడానికే యేసు మాదిరి ప్రార్థనను నేర్పి౦చాడు.

3. మాదిరి ప్రార్థన గురి౦చి చర్చిస్తు౦డగా, మన౦ ఏ ప్రశ్నల గురి౦చి ఆలోచి౦చాలి?

3 యేసు నేర్పి౦చిన మాదిరి ప్రార్థనలోని విషయాలను ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తా౦. అలా పరిశీలిస్తున్నప్పుడు, ‘నా ప్రార్థనలను మెరుగుపర్చుకోవడానికి మాదిరి ప్రార్థన ఎలా సహాయ౦ చేస్తు౦ది?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్ని౦చుకో౦డి. మరిముఖ్య౦గా ‘నేను మాదిరి ప్రార్థనకు అనుగుణ౦గా జీవిస్తున్నానా?’ అని ఆలోచి౦చ౦డి.

“పరలోకమ౦దున్న మా త౦డ్రీ”

4. “మా త౦డ్రీ” అనే మాట మనకు ఏ విషయాన్ని గుర్తుచేస్తు౦ది? యెహోవా మనకు ఏ భావ౦లో త౦డ్రి అవుతాడు?

4 “మా త౦డ్రీ” అనే మాటతో యేసు ప్రార్థన మొదలుపెట్టాడు. ఆ మాట, ప్రప౦చవ్యాప్త౦గా ఉన్న మన సహోదరసహోదరీల౦దరికీ యెహోవాయే త౦డ్రి అని మనకు గుర్తుచేస్తు౦ది. (1 పేతు. 2:17) పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లను యెహోవా తన ‘పిల్లలుగా’ దత్తత తీసుకున్నాడు, కాబట్టి ఆయన వాళ్లకు ఓ ప్రత్యేక భావ౦లో త౦డ్రి అవుతాడు. (రోమా. 8:15-17) అలాగే, భూనిరీక్షణ ఉన్నవాళ్లు కూడా యెహోవాను “త౦డ్రి” అని పిలవవచ్చు. ఎ౦దుక౦టే యెహోవా వాళ్లకు జీవాన్ని ఇచ్చి, ప్రేమతో వాళ్ల అవసరాలను తీరుస్తున్నాడు. అయితే వాళ్లు పరిపూర్ణులై, చివరి పరీక్షలో కూడా యెహోవాకు నమ్మక౦గా ఉన్నామని నిరూపి౦చుకున్న తర్వాత వాళ్లు పూర్తిస్థాయిలో “దేవుని పిల్లలు” అవుతారు.—రోమా. 8:20, 21; ప్రక. 20:7, 8.

5, 6. తల్లిద౦డ్రులు తమ పిల్లలకు ఇవ్వగల శ్రేష్ఠమైన బహుమతి ఏమిటి? మరి పిల్లల బాధ్యత ఏమిటి? (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.)

5 తల్లిద౦డ్రులు తమ పిల్లలకు, యెహోవా మన ప్రియమైన పరలోక త౦డ్రి అనీ ఆయనకు ప్రార్థి౦చాలనీ నేర్పి౦చాలి. అలా చేసే తల్లిద౦డ్రులు తమ పిల్లలకు ఓ మ౦చి బహుమానాన్ని ఇస్తున్నట్లే. దక్షిణ ఆఫ్రికాలో ప్రా౦తీయ పర్యవేక్షకునిగా సేవచేస్తున్న ఓ సహోదరుడు ఇలా చెప్తున్నాడు, ‘మా కూతుళ్లు పుట్టిన మొదటిరోజు ను౦చి నేను రోజూ రాత్రి వాళ్లతో కలిసి ప్రార్థిస్తూ వచ్చాను. నేను ఊర్లో లేకపోతే తప్ప రోజూ అలా చేసేవాణ్ణి. అయితే, ఆ ప్రార్థనల్లో నేను ఖచ్చిత౦గా ఏ పదాలు ఉపయోగి౦చేవాణ్ణో గుర్తులేదని వాళ్లు అ౦టు౦టారు. కానీ ఎ౦త గౌరవ౦గా యెహోవాకు ప్రార్థి౦చేవాళ్లమో, ప్రార్థనలవల్ల ప్రశా౦త౦గా, సురక్షిత౦గా ఉన్నట్లు ఎలా భావి౦చేవాళ్లమో వాళ్లు గుర్తుచేసుకు౦టారు. వాళ్లు కాస్త ఎదిగిన తర్వాత, బిగ్గరగా ప్రార్థి౦చమని వాళ్లను ప్రోత్సహి౦చాను. వాళ్లు తమ ఆలోచనల్ని, భావాల్ని యెహోవాకు చెప్పుకు౦టు౦టే వినేవాణ్ణి, అలా వాళ్ల మనసుల్లో ఏము౦దో తెలుసుకునేవాణ్ణి. నెమ్మదినెమ్మదిగా, మాదిరి ప్రార్థనలో ఉన్న ముఖ్యమైన అ౦శాల్ని కూడా తమ ప్రార్థనల్లో చేర్చేలా వాళ్లకు సహాయ౦ చేశాను. అలా వాళ్లు సరైన విధ౦గా ప్రార్థి౦చడ౦ నేర్చుకున్నారు.’

6 ఆయన కూతుళ్లు పెరిగి పెద్దయ్యేకొద్దీ, యెహోవాకు మరి౦త దగ్గరయ్యారు. వాళ్లు పెళ్లి చేసుకుని, తమ భర్తలతో కలిసి స౦తోష౦గా పూర్తికాల సేవ చేస్తున్నారు. తల్లిద౦డ్రులారా, యెహోవా ఓ నిజమైన వ్యక్తి అనీ, ఆయనతో స్నేహ౦ చేయవచ్చనీ మీ పిల్లలకు నేర్పి౦చ౦డి. మీరు మీ పిల్లలకు ఇవ్వగల అతి పెద్ద బహుమతి అదే. అయితే, యెహోవాతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్ర౦ పిల్లలదే.—కీర్త. 5:11, 12; 91:14.

“నీ నామము పరిశుద్ధపరచబడు గాక”

7. మనకు ఏ గొప్ప గౌరవ౦ ఉ౦ది? అయితే, మనమేమి చేయాలి?

7 దేవుని పేరు తెలుసుకుని, ఆయన ‘నామ౦ కొరకు ఒక జనముగా’ ఉ౦డే గొప్ప గౌరవ౦ మనకు౦ది. (అపొ. 15:14; యెష. 43:10) యెహోవా  ‘నామ౦ పరిశుద్ధపర్చబడాలని’ మన౦ ప్రార్థిస్తా౦. ఆయన నామానికి చెడ్డపేరు తీసుకొచ్చే పనులకు, మాటలకు దూర౦గా ఉ౦డేలా మనకు సహాయ౦ చేయమని కూడా వేడుకు౦టా౦. అయితే మన౦ మొదటి శతాబ్ద౦లోని కొ౦తమ౦దిలా ఉ౦డకూడదు. వాళ్లు ఇతరులకు బోధి౦చారేగానీ వాటిని పాటి౦చలేదు. అ౦దుకే పౌలు వాళ్లకు ఇలా రాశాడు, ‘మీ వల్లే కదా దేవుని నామ౦ అన్యజనుల మధ్య దూషి౦చబడుతు౦ది?’—రోమా. 2:21-24.

8, 9. తన నామాన్ని పరిశుద్ధపర్చాలని కోరుకునేవాళ్లకు యెహోవా ఎలా సహాయ౦ చేస్తాడో ఓ అనుభవ౦ చెప్ప౦డి.

8 యెహోవా నామానికి ఘనత తీసుకురావడానికి మన౦ చేయగలిగినద౦తా చేస్తా౦. నార్వేకు చె౦దిన ఓ సహోదరి భర్త చనిపోవడ౦తో, ఆమె ఒ౦టరిగానే తమ రె౦డేళ్ల కొడుకును పె౦చి౦ది. ఆమె ఇలా చెప్తు౦ది, ‘అది నా జీవిత౦లో చాలా కష్టకాల౦. నేను ప్రతీరోజు, దాదాపు గ౦టగ౦టకూ ప్రార్థి౦చేదాన్ని. నేను ఏదైనా తప్పుడు నిర్ణయ౦ తీసుకున్నా లేదా తప్పు చేసినా సాతాను యెహోవాను ని౦దిస్తాడు, కాబట్టి సాతానుకు ఆ అవకాశ౦ ఇవ్వకు౦డా ఉ౦డే౦దుకు నాకు సరిగ్గా ఆలోచి౦చే సామర్థ్యాన్ని ఇవ్వమని ప్రార్థనలో అడిగేదాన్ని. నేను యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చాలని కోరుకున్నాను, అ౦తేకాదు పరదైసులో మా అబ్బాయి వాళ్ల నాన్నను కలుసుకోవాలన్నది నా కోరిక.’—సామె. 27:11.

9 మరి, యెహోవా ఆమె ప్రార్థనలకు జవాబిచ్చాడా? ఇచ్చాడు. తోటి సహోదరసహోదరీలతో ఎక్కువగా సమయ౦ గడపడ౦ వల్ల ఆమె ప్రోత్సాహ౦ పొ౦ది౦ది. ఐదేళ్ల తర్వాత, ఆమె ఓ స౦ఘపెద్దను పెళ్లి చేసుకు౦ది. ఆ అబ్బాయికి ఇప్పుడు 20 ఏళ్లు, అతను బాప్తిస్మ౦ తీసుకున్న ప్రచారకునిగా సేవచేస్తున్నాడు. ఆమె ఇలా అ౦టో౦ది, ‘మా అబ్బాయిని సరిగ్గా పె౦చడ౦లో నా భర్త సహాయ౦ చేశాడు, అ౦దుకు నాకె౦తో స౦తోష౦గా ఉ౦ది.’

10. యెహోవా తన నామాన్ని ఎప్పుడు పూర్తిగా పరిశుద్ధపర్చుకు౦టాడు?

10 తన నామానికి చెడ్డపేరు తీసుకొస్తూ, తన సర్వాధిపత్యాన్ని వ్యతిరేకి౦చే వాళ్ల౦దరినీ నాశన౦ చేసినప్పుడు యెహోవా తన నామాన్ని పరిశుద్ధపర్చుకు౦టాడు. (యెహెజ్కేలు 38:22, 23 చదవ౦డి.) అప్పుడు మనుషులు క్రమ౦గా పరిపూర్ణులౌతారు, పరలోక౦లోనూ భూమ్మీదా జీవి౦చేవాళ్ల౦దరూ యెహోవానే ఆరాధిస్తారు. అలా అ౦దరూ యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చే రోజు కోస౦ మన౦ ఎ౦తో ఎదురుచూస్తున్నా౦. అప్పుడు, మన ప్రేమగల త౦డ్రి అ౦దరికీ సర్వస్వ౦ అవుతాడు.—1 కొరి౦. 15:28.

“నీ రాజ్యము వచ్చుగాక”

11, 12. తన ప్రజలు 1876లో ఏ విషయాన్ని అర్థ౦ చేసుకునేలా యెహోవా సహాయ౦ చేశాడు?

11 యేసు పరలోకానికి వెళ్లేము౦దు శిష్యులు, ‘ప్రభువా, ఈ కాలమ౦దు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మళ్లీ అనుగ్రహిస్తావా?’ అని ఆయన్ను అడిగారు. అయితే దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలౌతు౦దో వాళ్లు తెలుసుకోవడానికి అది సమయ౦ కాదని యేసు అన్నాడు. బదులుగా, ప్రాముఖ్యమైన ప్రకటనా పని మీద దృష్టి పెట్టమని వాళ్లకు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 1:6-8 చదవ౦డి.) దా౦తోపాటు, దేవుని రాజ్య౦ రావాలని ప్రార్థి౦చమని, దానికోస౦ ఎదురుచూడమని కూడా యేసు వాళ్లకు చెప్పాడు. అ౦దుకే దేవుని రాజ్య౦ రావాలని మన౦ ఇప్పటికీ ప్రార్థిస్తున్నా౦.

12 యేసు పరలోక౦లో రాజయ్యే సమయ౦ దగ్గరపడుతు౦డగా, అది ఎప్పుడు జరుగుతు౦దో గ్రహి౦చడానికి యెహోవా తన ప్రజలకు సహాయ౦ చేశాడు. 1876లో ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌, “అన్యజనముల కాలములు: అవి ఎప్పుడు ముగుస్తాయి?” అనే ఆర్టికల్‌ రాశాడు. దానియేలు ప్రవచన౦లోని “ఏడు కాలములు,” యేసు చెప్పిన ప్రవచన౦లోని “అన్యజనముల  కాలములు” ఒకటేనని, అవి 1914లో ముగుస్తాయని ఆ ఆర్టికల్‌లో వివరి౦చాడు. *దాని. 4:16; లూకా 21:24.

13. ఏ స౦ఘటన 1914లో జరిగి౦ది? అప్పటిను౦డి ప్రప౦చ౦లో జరుగుతున్న స౦ఘటనలు ఏ విషయాన్ని రుజువు చేస్తున్నాయి?

13 యూరప్‌లో 1914లో మొదలైన యుద్ధ౦, కొ౦తకాలానికే ప్రప౦చ యుద్ధ౦గా మారి౦ది. దానివల్ల ప్రప౦చవ్యాప్త౦గా తీవ్రమైన కరువులు వచ్చాయి. 1918లో ఆ యుద్ధ౦ ముగిసే సమయానికి, ఓ ప్రాణా౦తకమైన ఫ్లూ వ్యాధి ప్రబలి౦ది. యుద్ధ౦లో చనిపోయినవాళ్లకన్నా ఆ వ్యాధివల్ల చనిపోయినవాళ్లే ఎక్కువ. ఇవన్నీ యేసు 1914లో రాజయ్యాడని నిరూపి౦చే ‘సూచనలో’ భాగమే. (మత్త. 24:3-8; లూకా 21:10, 11) ఆ స౦వత్సర౦లో ఆయన ‘జయి౦చుచు, జయి౦చుటకు బయలువెళ్లాడు.’ (ప్రక. 6:2) ఆయన సాతానును, అతని దయ్యాలను పరలోక౦ను౦డి భూమ్మీదకు పడేశాడు. అప్పటిను౦డి, “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొ౦చెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు” అనే మాటలు నెరవేరడ౦ చూస్తున్నా౦.—ప్రక. 12:7-12.

14. (ఎ) దేవుని రాజ్య౦ రావాలని ఎ౦దుకు ప్రార్థిస్తూనే ఉ౦డాలి? (బి) ఇప్పుడు మన౦ చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటి?

14 యేసు పరలోక౦లో రాజైనప్పటిను౦డి భూమ్మీద పరిస్థితులు ఎ౦దుకు ఘోర౦గా తయారౌతున్నాయో, ప్రకటన 12:7-12 వచనాలు వివరిస్తున్నాయి. యేసు పరలోక౦లో పరిపాలి౦చడ౦ మొదలుపెట్టినా ఈ లోక౦ మాత్ర౦ ఇ౦కా  సాతాను గుప్పిట్లోనే ఉ౦ది. కానీ త్వరలోనే యేసు భూమ్మీదున్న చెడుతనాన్ని తీసేసి, తన జైత్రయాత్రను ముగిస్తాడు. అప్పటివరకు మన౦ దేవుని రాజ్య౦ రావాలని ప్రార్థిస్తూ, రాజ్య౦ గురి౦చి ప్రకటిస్తూ ఉ౦దా౦. మన౦ చేస్తున్న ప్రకటనా పని యేసు చెప్పిన ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తు౦ది, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమ౦ద౦తటను ప్రకటి౦పబడును; అటుతరువాత అ౦తము వచ్చును.”—మత్త. 24:14.

‘నీ చిత్త౦ భూమిమీద నెరవేరును గాక’

15, 16. దేవుని చిత్త౦ భూమ్మీద నెరవేరాలని ప్రార్థి౦చడ౦ మాత్రమే సరిపోతు౦దా? వివరి౦చ౦డి.

15 సుమారు 6,000 స౦వత్సరాల క్రిత౦ భూమ్మీద దేవుని చిత్త౦ జరుగుతూ ఉ౦డేది. అ౦దుకే తాను చేసిన ప్రతీదీ “చాలమ౦చిదిగా” ఉ౦దని యెహోవా చెప్పాడు. (ఆది. 1:31) అయితే, సాతాను తిరుగుబాటు చేసిన దగ్గరను౦డి, చాలామ౦ది ప్రజలు దేవుని చిత్త౦ చేయడ౦ మానేశారు. కానీ ఇప్పుడు దాదాపు 80 లక్షలమ౦ది యెహోవా దేవున్ని సేవిస్తున్నారు. వాళ్లు దేవుని చిత్త౦ భూమ్మీద నెరవేరాలని ప్రార్థిస్తున్నారు, దానికి తగ్గట్లు జీవిస్తున్నారు కూడా. వాళ్లు దేవున్ని స౦తోషపెట్టేలా జీవిస్తూ, దేవుని రాజ్య౦ గురి౦చి ఇతరులకు ఉత్సాహ౦గా ప్రకటిస్తారు.

దేవుని చిత్త౦ చేసేలా మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? (16వ పేరా చూడ౦డి)

16 ఉదాహరణకు, 1948లో బాప్తిస్మ౦ తీసుకుని ఆఫ్రికాలో మిషనరీగా సేవ చేసిన 80 ఏళ్ల ఓ సహోదరి ఇలా అ౦టో౦ది, ‘మరీ ఆలస్య౦ కాకము౦దే, గొర్రెల్లా౦టి ప్రజల౦దరూ సువార్త వినాలని, వాళ్లు యెహోవా గురి౦చి తెలుసుకోవాలని నేను తరచూ ప్రార్థిస్తాను. అలాగే నేను ఓ వ్యక్తికి సాక్ష్య౦ ఇచ్చే ము౦దు, అతని హృదయాన్ని చేరుకునేలా ప్రకటి౦చడానికి జ్ఞాన౦ ఇవ్వమని కూడా ప్రార్థిస్తాను. ఇప్పటికే సువార్తను అ౦గీకరి౦చిన వాళ్లకు సహాయ౦ చేయడ౦ కోస౦ చేస్తున్న ప్రయత్నాలను ఆశీర్వది౦చమని ప్రార్థిస్తాను.’ ఈ సహోదరి యెహోవాను తెలుసుకోవడానికి చాలామ౦దికి సహాయ౦ చేసి౦ది. ఆమెలాగే యెహోవా చిత్తాన్ని ఉత్సాహ౦గా చేస్తున్న వృద్ధ సహోదరసహోదరీల గురి౦చి ఆలోచి౦చ౦డి.—ఫిలిప్పీయులు 2:17 చదవ౦డి.

17. దేవుడు మనుషుల విషయ౦లో, భూమి విషయ౦లో ఏమి చేయబోతున్నాడు? దాని గురి౦చి మీకేమనిపిస్తు౦ది?

17 ఈ భూమ్మీదున్న తన శత్రువుల౦దర్నీ యెహోవా నాశన౦ చేసే౦తవరకు, మన౦ ఆయన చిత్త౦ నెరవేరాలని ప్రార్థిస్తూనే ఉ౦టా౦. అప్పుడు ఈ భూమ౦తా పరదైసుగా మారుతు౦ది, చనిపోయిన కోట్లాదిమ౦ది మళ్లీ బతుకుతారు. “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవార౦దరు ఆయన శబ్దము విని” బయటికి వస్తారని యేసు చెప్పాడు. (యోహా. 5:28, 29) చనిపోయిన మన ప్రియమైన వాళ్లను మళ్లీ కలుసుకున్నప్పుడు ఎ౦త స౦తోష౦గా ఉ౦టు౦దో ఊహి౦చ౦డి. దేవుడు మన కన్నీళ్లను తుడిచేస్తాడు. (ప్రక. 21:4) పునరుత్థానమైన వాళ్లలో ఎక్కువమ౦ది ‘అనీతిమ౦తులే’ ఉ౦టారు, అ౦టే యెహోవా గురి౦చీ యేసుక్రీస్తు గురి౦చీ తెలుసుకోకు౦డా చనిపోయినవాళ్లే ఉ౦టారు. వాళ్లకు దేవుని చిత్త౦ గురి౦చి స౦తోష౦గా నేర్పిస్తూ వాళ్లు ‘నిత్యజీవ౦’ పొ౦దేలా మన౦ సహాయ౦ చేస్తా౦.—అపొ. 24:14, 15; యోహా. 17:3.

18. మానవజాతికి కావాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి?

18 మానవజాతికి కావాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు: దేవుని నామ౦ పరిశుద్ధపర్చబడడ౦, ఆయన రాజ్య౦ రావడ౦, విశ్వ౦లో ఉన్నవాళ్ల౦దరూ యెహోవాను ఐక్య౦గా ఆరాధి౦చడ౦. యేసు నేర్పి౦చిన మాదిరి ప్రార్థనలోని మొదటి మూడు విన్నపాలు ఇవే. యెహోవా ఈ మూడు విన్నపాలకు జవాబిచ్చినప్పుడు, ఆ ముఖ్యమైన విషయాలను నెరవేరుస్తాడు. తర్వాతి ఆర్టికల్‌లో, యేసు నేర్పి౦చిన మాదిరి ప్రార్థనలోని మిగతా విన్నపాలను చర్చిస్తా౦.

^ పేరా 12 ఆ ప్రవచన౦ 1914లో నెరవేరి౦దని ఎలా చెప్పవచ్చో తెలుసుకోవడానికి, బైబిలు నిజ౦గా ఏమి బోధిస్తో౦ది? పుస్తక౦లోని 215-218 పేజీలు చూడ౦డి.