కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

She Belonged to the Family of Caiaphas

She Belonged to the Family of Caiaphas

కొన్నిసార్లు పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాల్లో కనుగొన్నవి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బైబిల్లోని ఓ వ్యక్తి ఉనికిని నిర్ధారిస్తాయి. శాస్త్రజ్ఞులు కనుగొన్న అలాంటి ఒక వస్తువుకు సంబంధించిన వివరాలను 2011లో ఇజ్రాయేల్‌ విద్వాంసులు ప్రచురించారు. రెండు వేల సంవత్సరాల క్రితం నాటి ఓ సున్నపు రాయి శవపేటిక అది. శవం పూర్తిగా కుళ్లిపోయిన తర్వాత మిగిలిన ఎముకలను అందంగా ముస్తాబు చేసిన ఆ పెట్టెలో పెట్టారు.

అయితే ఆ శవపేటిక మీద “బెత్‌ ఇమ్రీకి చెందిన మయజ్యా యాజక గుంపులోని కయప కుమారుడైన యెషూవ కుమార్తె అయిన మిర్యాము” అని రాసి ఉంది. యేసుక్రీస్తును విచారణ చేసిన వారిలో ప్రధాన యాజకుడైన కయప కూడా ఉన్నాడు. (యోహా. 11:48-50) చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసిఫస్‌ ఆయనను “కయప అని పిలువబడిన యోసేపు” అని సంబోధించాడు. అయితే వెలికి తీసిన ఆ శవపేటిక కయప బంధువుల్లో ఒకరిది అయ్యుండవచ్చని తెలుస్తోంది. అంతకుముందు కనుగొన్న ఓ శవపేటిక మీది రాతలను బట్టి, అది ప్రధాన యాజకుడైన యెహోసెఫ్‌ బార్‌ కెయిఫాది, లేదా కయప కుమారుడైన యోసేపుది * అని శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారు. కాబట్టి మిర్యాము ఏదోవిధంగా కయపకు బంధువు.

ఇజ్రాయేల్‌ యాంటిక్విటీస్‌ అథారిటీ (IAA) వాళ్ల దగ్గరున్న సమాచారం ప్రకారం, పురాతన సమాధులను దోచుకున్న దొంగల వద్ద నుండి మిర్యాము శవపేటికను స్వాధీనపరచుకున్నారు. ఆ శవపేటికను, దానిమీద ఉన్న రాతలను విశ్లేషించి చూస్తే ఆమె కయప వంశస్థురాలని స్పష్టంగా తెలుస్తోంది.

ఆ శవపేటిక మరో కొత్త విషయాన్ని కూడా తెలియజేస్తోంది. యెరూషలేము దేవాలయంలో వంతుల వారీగా సేవచేసే 24 యాజక గుంపుల్లో చివరి గుంపువాడైన “మయజ్యా” పేరును అది పేర్కొంటోంది. (1 దిన. 24:18) “కయప కుటుంబం మయజ్యా గుంపుకు చెందినది” అని ఆ శవపేటిక మీదున్న రాతలు వెల్లడిస్తున్నాయని ఇజ్రాయేల్‌ యాంటిక్విటీస్‌ అథారిటీ (IAA) వాళ్లు తెలిపారు.

శవపేటిక మీద బెత్‌ ఇమ్రీ అని కూడా రాసి ఉంది. ఆ పేరుకు సంబంధించి రెండు రకాలైన వివరణలు ఉన్నాయి. “మొదటిది, బెత్‌ ఇమ్రీ అనే పేరు మయజ్యా యాజకత్వపు గుంపుకు చెందిన ఇమ్మేరు వంశస్థులను (ఎజ్రా 2:36, 37; నెహె. 7:39-42) సూచిస్తుండవచ్చు. రెండవది, [బెత్‌ ఇమ్రీ] అనేది మిర్యాము లేదా ఆమె కుటుంబ సభ్యులందరూ జన్మించిన ఊరు పేరు అయ్యుండాలి” అని ఇజ్రాయేల్‌ యాంటిక్విటీస్‌ అథారిటీ (IAA) వాళ్లు చెప్పారు. ఏ విధంగా చూసినా, ఒకప్పుడు నిజంగా జీవించిన వ్యక్తుల గురించి బైబిలు మాట్లాడుతోందని ఆ శవపేటిక రుజువు చేస్తోంది.

^ పేరా 3 కయప శవపేటిక గురించి కావలికోట జనవరి 15, 2006 సంచికలోని 10-13 పేజీల్లో ఉన్న “యేసు మీద దోషారోపణ చేసిన ప్రధానయాజకుడు” అనే ఆర్టికల్‌ను చూడండి.