కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనుషులకు మేలు చేసిన అత్యంత గొప్ప పుస్తకం

మనుషులకు మేలు చేసిన అత్యంత గొప్ప పుస్తకం

చరిత్రలోనే అన్నిటికన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడిన, ముద్రించబడిన పుస్తకం బైబిలు. దానిలోని తెలివైన సలహాలు కోట్లమంది ప్రజలకు చేరుకున్నాయి, వాళ్లకు సహాయం చేశాయి. ఈ విషయంలో మరే పుస్తకమూ బైబిలుకు సాటిరాదు. ఈ గణాంకాల్ని పరిశీలించండి:

బైబిలు అనువాదం, పంపిణీ

 • 96.5% ప్రపంచ జనాభాకు బైబిలు అందుబాటులో ఉంది

 • 3,350 భాషల్లో ఉంది (పూర్తి బైబిలు లేదా బైబిల్లోని కొన్ని పుస్తకాలు)

 • 500,00,00,000 బైబిళ్లు ముద్రించబడ్డాయని ఒక అంచనా, ఇంకే పుస్తకమూ అంత ఎక్కువగా ముద్రించబడలేదు

ఎక్కువ తెలుసుకోండి

మా JW.ORG వెబ్‌సైట్‌ చూడండి. అందులో మీరు

 • బైబిలు చదవవచ్చు (వందల భాషల్లో ఉంది)

 • బైబిలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

 • బైబిలు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవచ్చు

 • చాలామందికి బైబిలు ఎలా సహాయపడిందో తెలుసుకోవచ్చు

 • ఆన్‌లైన్‌ బైబిలు స్టడీ కోర్సు తీసుకోవచ్చు *

 • బైబిలు స్టడీ కోసం యెహోవాసాక్షుల్ని పంపించమని అడగవచ్చు

యెహోవాసాక్షులు, బైబిలు

బైబిల్ని అనువదించే పనిలో, పంపిణీ చేసే పనిలో యెహోవాసాక్షులు చురుగ్గా పాల్గొంటున్నారు.

గడిచిన సంవత్సరాల్లో మేము పంపిణీ చేసిన కొన్ని బైబిలు అనువాదాలు ఇవి:

 • 1901, అమెరికన్‌ స్టాండర్డ్‌ వర్షన్‌

 • బైయింగ్‌టన్‌ వారి ది బైబిల్‌ ఇన్‌ లివింగ్‌ ఇంగ్లీష్‌

 • ది ఎంఫాటిక్‌ డయాగ్లాట్‌

 • కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌

 • రివైజ్డ్‌ స్టాండర్డ్‌ వర్షన్‌

 • టిషెండార్ఫ్‌ అనువదించిన న్యూ టెస్టమెంట్‌

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ (కొత్త లోక అనువాదం)

 • 180+ భాషల్లో ఉంది (పూర్తి బైబిలు లేదా బైబిల్లోని కొన్ని పుస్తకాలు)

 • 22,70,00,000 1950 నుండి ఇప్పటి వరకు ముద్రించబడిన కొత్త లోక అనువాదం బైబిళ్లు

^ పేరా 13 ప్రస్తుతం ఇంగ్లీషు, పోర్చుగీస్‌ భాషల్లో ఉంది. త్వరలో మరిన్ని భాషల్లో వస్తుంది.