కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?

బాధలో ఉన్నవాళ్లకు ఒక మంచి ఓదార్పు

బాధలో ఉన్నవాళ్లకు ఒక మంచి ఓదార్పు

మనం ప్రేమించేవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధ అనే అంశంపై ఇటీవల కాలాల్లో చాలా పరిశోధన జరుగుతుంది. కానీ, మనం ముందు చూసినట్లుగా, మంచి నిపుణులు చెప్పిన సలహాలు ప్రాచీన పుస్తకమైన బైబిల్లో ఉన్న విషయాలకు చాలావరకు సరిపోతాయి. బైబిలు చెప్పే విషయాలు కాలపరిమితి లేనివని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. మనం ఆధారపడదగిన సలహాలే కాదు, బైబిల్లో ఇంకా ఎక్కువ విషయాలు కూడా ఉన్నాయి. చనిపోయిన వాళ్ల కోసం బాధపడుతున్న వాళ్లకు చెప్పలేనంత ఓదార్పును తీసుకొచ్చే సమాచారం బైబిల్లో ఉంది, ఆ విషయాలు ఇంక ఎక్కడా కనపడవు.

  • చనిపోయిన మన ప్రియమైన వాళ్లు ఏ బాధను అనుభవించడం లేదు అనే నమ్మకంతో ఉండవచ్చు

    “చచ్చినవారు ఏమియు ఎరుగరు” అని బైబిల్లో ప్రసంగి 9:5 చెప్తుంది. వాళ్ల “సంకల్పములు నాడే నశించును.” (కీర్తన 146:4) ఈ మాటలకు అనుగుణంగానే, బైబిలు మరణాన్ని ప్రశాంతమైన నిద్రతో పోలుస్తుంది.—యోహాను 11:11.

  • ప్రేమగల దేవుని మీద ఉన్న బలమైన నమ్మకం ఓదార్పును ఇస్తుంది

    బైబిలు కీర్తన 34:15⁠లో ఇలా చెప్తుంది: “యెహోవా * దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.” మన మనసులో భావాలను ప్రార్థనలో దేవునికి చెప్పడం ఒక మంచి వైద్యం లాంటిది మాత్రమే కాదు లేదా మన ఆలోచనల్ని సరైన విధంగా ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే కాదు. అది అంతకన్నా ఎక్కువే. మన సృష్టికర్తతో మంచి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రార్థన మనకు సహాయం చేస్తుంది, ఆయన తన శక్తిని ఉపయోగించి మనల్ని ఓదార్చగలడు.

  • రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందనే ఆశ

    ఇంక కొంతకాలం తర్వాత సమాధుల్లో ఉన్నవాళ్లందరూ భూమ్మీదే తిరిగి బ్రతికే సమయాన్ని ఒక్కసారి ఊహించుకోండి! బైబిలు అలాంటి కాలం గురించి చాలాసార్లు చెప్పింది. అప్పుడు భూమ్మీద ఉండే పరిస్థితుల గురించి వర్ణిస్తూ బైబిలు ఇలా చెప్తుంది, దేవుడు “వాళ్ల [మన] కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును . . . తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”—ప్రకటన 21:3, 4.

బైబిల్లో దేవుడైన యెహోవా మీద నమ్మకం పెట్టుకున్న చాలామంది వాళ్ల దుఃఖాన్ని ఎదుర్కొనే శక్తిని పొందారు, ఎందుకంటే వాళ్లకు చనిపోయిన తమ ప్రియమైన వాళ్లను తిరిగి చూస్తామనే నిరీక్షణ ఉంది. ఉదాహరణకు, పెళ్లైన 65 సంవత్సరాలకు ఆన్‌ అనే ఆమె తన భర్తను కోల్పోయింది, ఆమె ఇలా చెప్తుంది: “చనిపోయిన మన ప్రియమైన వాళ్లు బాధను అనుభవించడం లేదని మాత్రమే కాదు, బైబిలు దేవుడు తన జ్ఞాపకంలో ఉన్న వాళ్లను తిరిగి బ్రతికిస్తాడనే అభయాన్ని ఇస్తుంది. నాకున్న బాధ గురించి ఆలోచించినప్పుడల్లా ఈ విషయాలు నాకు గుర్తొస్తాయి, దానివల్ల నా జీవితంలో జరిగిన ఎంతో బాధాకరమైన విషయాన్ని నేను తట్టుకోగలుగుతున్నాను!”

ముందు ఆర్టికల్లో చెప్పుకున్న టినా ఇలా అంటుంది: “టిమో చనిపోయిన రోజు నుండి నేను దేవుని సహాయాన్ని చూస్తున్నాను. ఎంతో కృంగిపోయిన సమయంలో యెహోవా చేయి నాకు ఎలా సహాయం చేసిందో నేను ప్రత్యక్షంగా చూశాను. దేవుడు మాటిచ్చిన పునరుత్థానాన్ని నేను నిజంగా నమ్మాను. అది మళ్లీ నేను టిమోను చూసే వరకు ముందుకు సాగిపోవడానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది.”

బైబిలు ఎంత నమ్మదగినదో తెలుసుకున్న లక్షలమంది భావాలకు పైనున్న ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. ఒకవేళ బైబిలు చెప్పే విషయాలు నిజం కాదని లేదా ఊహలు మాత్రమేనని మీకనిపించవచ్చు. అయినప్పటికి మీకున్న బాధను బట్టి అందులో ఉన్న సలహాలు, వాగ్దానాలు సరైనవని చెప్పడానికి ఉన్న ఆధారాలు పరిశీలిస్తే మీకు మంచిదే. తమ ప్రియమైన వాళ్లను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న వాళ్లకు బైబిలు ఎంత ఎక్కువగా సహాయం చేస్తుందో మీరు తెలుసుకోవచ్చు.

చనిపోయినవాళ్ల గురించి ఏ ఆశతో ఉండవచ్చో తెలుసుకోండి

దానికి సంబంధించిన వీడియోలు jw.org వెబ్‌సైట్‌లో ఉన్నాయి చూడండి

చనిపోయిన మన ప్రియమైన వాళ్లను భవిష్యత్తులో తిరిగి ఆహ్వానించవచ్చని బైబిలు వాగ్దానం చేస్తుంది

చనిపోయిన తర్వాత ఏమౌతుంది?

మనం చనిపోయినప్పుడు మనకు ఏమి జరుగుతుంది? బైబిలు ఇచ్చే జవాబు మనకు ఓదార్పును, ధైర్యాన్ని ఇస్తుంది

లైబ్రరీ > వీడియోలు (వీడియో విభాగం: బైబిలు)

ఒక మంచివార్త తెలుసుకోవాలని ఉందా?

ఇన్ని చెడు వార్తల మధ్యలో మనకు మంచివార్త ఎక్కడ దొరుకుతుంది?

బైబిలు బోధలు > శాంతి, సంతోషం చూడండి

^ పేరా 7 బైబిల్లో దేవుని పేరు యెహోవా అని ఉంది.