కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 3 2017 | పనులు ఎక్కువైపోతే ఏమి చేయాలి?

ఈ రోజుల్లో ఎక్కువమంది చాలా బిజీగా ఉంటున్నారు. అంత బిజీగా ఉండడం వల్ల కొన్నిసార్లు వేరేవాళ్లతో ఉన్న సంబంధాలు దెబ్బ తింటున్నాయి, కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది.

సమయాన్ని ఉపయోగించే విషయంలో మనమెలా జాగ్రత్తగా ఉండవచ్చు?

ఒక తెలివైన అతను ఇలా రాశాడు: “రెండు చేతులనిండా కష్టం, గాలికోసం శ్రమించడం కంటే ఒక చేతినిండా శాంతి ఉంటే అది ఎంతో మేలు.”—ప్రసంగి 4:6; పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

ఈ “తేజరిల్లు!” పత్రిక మన సమయాన్ని తెలివిగా ఉపయోగించడానికి అవసరమైన సలహాలను ఇస్తుంది. ముఖ్యమైన విషయాలకు సమయాన్ని ఎలా కేటాయించాలో కూడా ఈ పత్రిక తెలియచేస్తుంది.

 

ముఖపేజీ అంశం

పనులు ఎక్కువైపోతే ఏమి చేయాలి?

అటు ఉద్యోగంలో ఇటు ఇంట్లో పనులను చక్కపెట్టుకోవడం చాలామందికి కష్టంగా ఉంది. ఎందుకలా జరుగుతుంది? ఆ సమస్యను తగ్గించడానికి ఏమి చేయవచ్చు?

అద్భుతమైన ఆర్కిటిక్‌ సముద్రపక్షి

ఆర్కిటిక్‌ సముద్రపక్షి ప్రతీ సంవత్సరం ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ ప్రాంతాల మధ్య వలస వెళ్లి రావడానికి 35,200 కి.మీ కన్నా ఎక్కువ దూరం ఎగురుతుంది అని ఇంతకుముందు అనుకునేవాళ్లు. కానీ ఆ పక్షి ప్రయాణించే దూరంలో ఇది కొంత భాగం మాత్రమే.

గొప్ప ఆస్తి కన్నా మంచి పేరు మేలు

ఇతరుల దగ్గర మంచి పేరు, గౌరవం సంపాదించుకోవడం సాధ్యమే. కాని ఎలా?

కుటుంబం కోసం

పిల్లలు పెద్దవాళ్లై ఇల్లు వదిలి వెళ్లినప్పుడు

పిల్లలు పెద్దవాళ్లై ఇంటినుండి దూరంగా వెళ్లిపోయినప్పుడు కొంతమంది భార్యాభర్తలకు పెద్ద సవాళ్లు ఎదురౌతాయి. పిల్లలు లేకుండా ఒంటరిగా జీవించడానికి వాళ్లెలా అలవాటుపడవచ్చు?

ఇంటర్వ్యూ

బ్రెయిన్‌ పాథాలజిస్ట్‌ తన నమ్మకాల గురించి చెప్పారు

ప్రొఫెసర్‌ రాజేష్‌ కలారియా తన పని గురించి, నమ్మకాల గురించి చెప్పారు. సైన్స్‌ మీద ఆయనకు ఆసక్తి ఎలా కలిగింది? జీవం ఎలా ఆరంభం అయిందనే ప్రశ్నను ఎందుకు పరిశీలించారు?

బైబిలు ఉద్దేశం

తప్పు చేయాలనే ప్రలోభం

భార్యాభర్తలు విడిపోవడం, అనారోగ్యం, మనస్సాక్షి బాధించడం​—⁠ఇలాంటివన్నీ తప్పు చేయాలనే ప్రలోభానికి లొంగిపోవడం వల్ల వచ్చే పర్యవసానాల్లో కొన్ని మాత్రమే. వీటిలో చిక్కుకోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

సృష్టిలో అద్భుతాలు

పొలీయ బెర్రీకున్న మెరిసే బ్లూ కలర్‌

ఈ బెర్రీలో రంగు పుట్టించే పదార్థం లేదు. కానీ ఆ కాయకు ఉండే మంచి బ్లూ కలర్‌ వేరే ఏ చెట్టులో కనపడదు. మరి ఆ కాయ అంత మెరిసే రంగులో ఉండాడానికున్న రహస్యం ఏంటి?

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి బైబిలు నాకు సహాయం చేస్తుందా?

లక్షలమంది స్త్రీపురుషులకు తమ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండడానికి బైబిల్లోని తెలివైన సలహాలు సహాయం చేశాయి.

మోనిక రిచర్డ్‌సన్‌: ఒక డాక్టరు తన నమ్మకాల గురించి వివరిస్తుంది

బిడ్డ పుట్టుక నిజంగా అద్భుతమైనది. ఇంత తెలివైన ప్రక్రియ వెనుక ఎవరైనా ఉన్నారా లేక అది దానంతటదే జరుగుతుందా అని మోనికకు సందేహం కలిగింది. డాక్టరుగా తనకున్న అనుభవాన్ని బట్టి ఆమె ఏ ముగింపుకు వచ్చింది?