కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం

మీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నారా?

మీ అలవాట్లు మార్చుకోవాలనుకుంటున్నారా?
  • అలారమ్‌ మోగుతుంది, ఆస్టిన్‌కు ఇంకా నిద్ర వస్తుంటుంది, కానీ వెంటనే లేస్తాడు. రాత్రి పడుకోబోయే ముందు తీసి పెట్టుకున్న ఎక్సర్‌సైజ్‌ డ్రెస్‌ వేసుకుని కొద్దిసేపు జాగింగ్‌కి వెళ్లి వస్తాడు. అలా ఒక సంవత్సరం నుండి వారంలో మూడు సార్లు చేస్తున్నాడు.

  • మోనాకి ఆమె భర్తతో ఇప్పుడే గొడవైంది. కోపంతో విసుగుతో ఆమె వంటగదిలోకి వెళ్లిపోయి, చాక్లెట్ల కవరు బయటకు తీసి, చాక్లెట్లన్నీ తినేసింది. బాధ కలిగిన ప్రతిసారి ఆమె అలానే చేస్తుంది.

ఆస్టిన్‌, మోనా ఇద్దరిలో ఉన్నది ఒకటే! ఏంటది? వాళ్లు గుర్తించినా గుర్తించకపోయినా వాళ్లిద్దరిలో బలంగా పనిచేసే విషయం ఒకటి ఉంది. దాన్నే అలవాటు (Habit) అంటారు.

మరి మీ సంగతేంటి? మీరు జీవితంలో పెంచుకోవాలని అనుకుంటున్న మంచి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? రోజూ ఎక్సర్‌సైజ్‌ చేయాలి, సరిపడినంత నిద్రపోవాలి, బంధువులు స్నేహితులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి లాంటి కొన్ని అలవాట్లు పెంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తుండవచ్చు.

ఇంకోవైపు మీరు సిగరెట్‌ త్రాగడం, చిరుతిళ్లు విపరీతంగా తినడం, ఎక్కువ టైమ్‌ ఇంటర్నెట్‌కు అతుక్కుపోవడం లాంటి చెడు అలవాట్లు మానుకోవడానికి కూడా ప్రయత్నిస్తుండవచ్చు.

చెడు అలవాట్లు మానుకోవడం కష్టమనే ఒప్పుకోవాలి. ఈ చెడు అలవాట్లు ఎలాంటివంటే చల్లగా ఉన్న రోజు, వెచ్చగా ఉండే బెడ్‌ మీద దుప్పటి కప్పుకుని హాయిగా పడుకోవడం లాంటివి. పడుకోవడం ఎంత సులువో లేవడం అంత కష్టం. చెడు అలవాటు కూడా అంతే.

మరి మన అలవాట్లను ఎలా మార్చుకోవాలి? మన అలవాట్లు మనకు నష్టం కలిగించకుండా మంచి చేసేలా ఎలా మార్చుకోవాలి? బైబిల్‌ సూత్రాల ఆధారంగా ఇచ్చిన మూడు సలహాలను చూడండి. (g16-E No. 4)