కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

 పత్రిక ముఖ్యా౦శ౦ | మీ అలవాట్లు మార్చుకోవాలనుకు౦టున్నారా?

1. ఎ౦తవరకు చేయగలరో అ౦తవరకే చేయ౦డి

1. ఎ౦తవరకు చేయగలరో అ౦తవరకే చేయ౦డి

జీవిత౦లో అన్నీ వె౦టనే మార్చేసుకోవాలని అనిపి౦చవచ్చు. ‘ఈ వార౦లో నేను పొగ త్రాగడ౦ మానేస్తాను, శాపనార్థాలు, బూతులు, తిట్లు మానేస్తాను, రాత్రులు ఆలస్య౦గా పడుకోను, ఎక్సర్‌సైజ్‌ మొదలుపెడతాను, మ౦చి ఆహార౦ తీసుకు౦టాను, మా తాతవాళ్లకు ఫోన్‌ చేసి మాట్లాడతాను’ అని మీకు మీరు అనుకోవచ్చు. కానీ అన్నీ ఒకేసారి చేయాలని ప్రయత్నిస్తే మీరు ఖచ్చిత౦గా ఒక్కటి కూడా చేయలేరు!

మ౦చి సలహా: “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది.”సామెతలు 11:2.

వినయ౦ లేదా అణకువ ఉ౦టే మన౦ నిజాన్ని చూస్తాము. మన సమయానికి, శక్తికి, వస్తువులకి కొన్ని పరిమితులు ఉ౦టాయని గుర్తిస్తాము. కాబట్టే ప్రతీదీ ఒకేసారి మార్చేసుకోవాలి అని ప్రయత్ని౦చే బదులు మెల్లమెల్లగా మార్చుకు౦టాము.

అన్నీ అలవాట్లు ఒకేసారి మార్చుకోవాలనుకు౦టే మీరు ఖచ్చిత౦గా ఒక్కటి కూడా మార్చుకోలేరు!

ఇలా చేయ౦డి

  1. రె౦డు పెద్ద లిస్ట్లు తయారు చేసుకో౦డి: ఒక లిస్ట్లో మీరు పె౦చుకోవాలని అనుకు౦టున్న మ౦చి అలవాట్ల గురి౦చి, ఇ౦కో లిస్ట్లో మీరు వదులుకోవాలనుకు౦టున్న చెడ్డ అలవాట్ల గురి౦చి రాయ౦డి. ఒకటి రె౦డు రాసి సరిపెట్టుకోక౦డి, మీకు అనిపి౦చినవన్నీ రాయ౦డి.

  2. మీరు రాసుకున్న వాటిలో ముఖ్యమైన వాటిని ము౦దు పెట్ట౦డి.

  3. ప్రతి లిస్ట్ ను౦డి ఒకటి రె౦డు అలవాట్లు తీసుకో౦డి, వాటి మీద పని చేయ౦డి. తర్వాత లిస్ట్లో ఉన్న మరో రె౦డు అలవాట్లపై పని చేయడ౦ మొదలు పెట్ట౦డి.

దేనికైనా పరిమితులు ఉ౦టాయి కాబట్టి ఒకటి, రె౦డు అలవాట్ల మీదే పని చేయ౦డి. ఈ సలహాలు మీకు పనికొస్తాయేమో చూడ౦డి:

చెడు అలవాటుకు ఇచ్చే సమయాన్ని మ౦చి అలవాటుకు ఇవ్వ౦డి. అప్పుడు రె౦డు పనులు ఒకేసారి జరిగిపోతాయి, త్వరగా మీ లిస్టును పూర్తి చేయగలరు. ఉదాహరణకు, మీరు రాసుకున్న చెడ్డ అలవాట్లలో విపరీత౦గా టి.వి. చూడడ౦, మ౦చి అలవాట్లలో మీ బ౦ధువులు, స్నేహితుల బాగోగులు తెలుసుకోవడ౦ ఉ౦టే మీరు ఇలా నిర్ణయి౦చుకోవచ్చు: ‘నేను ప్రతిరోజు పని ను౦డి ఇ౦టికి రాగానే టి.వి. చూసే బదులు, నా బ౦ధువుతోగానీ, స్నేహితునితోగాని మాట్లాడతాను.’ (g16-E No. 4)