కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు ఒక బలమైన వ్యక్తిత్వం ఉంటే మీరు ఎలాంటి పెద్ద తుఫాన్లనైనా తట్టుకోగలరు

 ఎదుగుతున్న పిల్లలకు

9: గుర్తింపు

9: గుర్తింపు

అంటే ఏంటి?

మీ గుర్తింపు అంటే మీ పేరు, మీ రూపం మాత్రమే కాదు. మీ విలువలు, మీ నమ్మకాలు, మీ వ్యక్తిత్వం కూడా మీ గుర్తింపులోకే వస్తాయి. నిజానికి మీలో ఉన్న ప్రతీది అంటే మీరు లోపల ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటారు అనేది మొత్తం మీ గుర్తింపు అవుతుంది.

ఎందుకు ముఖ్యం?

మీరు ఇలా ఉండాలి అని మీకు బలమైన ఉద్దేశాలు ఉంటే, మీ తోటివాళ్లు మీ మీద ఆధిపత్యం చేయరు గానీ మీరు నమ్మినవాటికే మీరు కట్టుబడి ఉంటారు.

“షోరూంలలో మనం చూడడం కోసం బొమ్మలకు బట్టలు తొడిగి పెడతారు. చాలామంది ఆ బొమ్మలు లాంటివాళ్లు. ఆ బొమ్మలు ఏ బట్టలు వేసుకోవాలో వేరేవాళ్లు నిర్ణయిస్తారు కానీ అవి కాదు.”—ఎడ్రియన్‌.

“నేను కష్టంగా ఉన్నా కూడా సరైనదాని కోసం నిలబడడం నేర్చుకున్నాను. నా నిజమైన స్నేహితులు ఎవరో నేను చెప్పగలను. వాళ్లు నా ప్రమాణాలను గౌరవిస్తారు కాబట్టి నాకు వాళ్లతో ఏ ఇబ్బంది ఉండదు.”—కోర్ట్‌నీ.

మంచి సూత్రాలు: “ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి. బదులుగా మీ మనసు మార్చుకొని మీ వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోండి.”—రోమీయులు 12:2.

మీరు ఏమి చేయవచ్చు

ఇప్పుడు మీరు ఏంటి, రేపు మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారు అనే జ్ఞానాన్ని పెంచుకోండి. అందుకు మీ బలాలను, బలహీనతలను, నమ్మకాలను పరిశీలించుకుంటూ ఉండండి. దానికి చక్కని ప్రారంభం ఈ కిందున్న ప్రశ్నల్లో ఉంది.

బలాలు: నాకున్న ప్రతిభ, నైపుణ్యాలు ఏంటి? నాలో ఉన్న బలమైన లక్షణాలు ఏంటి? (ఉదాహరణకు: నేను సమయం పాటిస్తానా? నాకు ఆత్మనిగ్రహం ఉందా? నేను కష్టపడి పనిచేస్తానా? ఇతరులకు సహాయం చేస్తానా?) నేను చేసే మంచి పనులు ఏంటి?

ఇలా చేయండి: మీలో మంచి విషయాలను చూడడం మీకు కష్టంగా ఉందా? మీ అమ్మను, నాన్నను లేదా ఒక మంచి ఫ్రెండ్‌ని మీలో అతనికి లేదా ఆమెకు కనిపించే మంచి ఏంటో అడగండి. ఎందుకు అలా అనుకుంటున్నారో కూడా అడగండి.

మంచి సూత్రాలు: “ప్రతీ వ్యక్తి తాను చేసిన పనుల్ని పరిశీలించుకోవాలి, అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు. అప్పుడు, అతను చేసిన పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.”—గలతీయులు 6:4.

బలహీనతలు: నా వ్యక్తిత్వంలో ఏ విషయాలపై నేను ఎక్కువగా పనిచేయాలి? తప్పు చేయాలనే ప్రలోభం నాకు ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? నేను ఏయే విషయాల్లో ఇంకా ఎక్కువ నిగ్రహాన్ని చూపించాలి?

మంచి సూత్రాలు: “మనం ఒకవేళ ‘మాలో ఏ పాపం లేదు’ అని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే.”—1 యోహాను 1:8.

నమ్మకాలు: నేను ఏ నీతి సూత్రాలు పాటిస్తాను, ఎందుకు? నేను దేవున్ని నమ్ముతానా? ఆయన ఉన్నాడని నాకు నమ్మకం కలిగించిన ఆధారాలు ఏంటి? ఏ పనులు అన్యాయమని నాకు అనిపిస్తాయి, ఎందుకు? భవిష్యత్తు గురించి నా నమ్మకాలు ఏంటి?

మంచి సూత్రాలు: “బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును.”—సామెతలు 2:11.