ప్రాంతాలు, ప్రజలు
స్పెయిన్ దేశాన్ని చూసి వద్దాం
స్పెయిన్ దేశంలో ఉండే ప్రకృతిలో, అక్కడి ప్రజల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. స్పెయిన్‌లో గోధుమ పొలాలు, ద్రాక్ష తోటలు, ఆలివ్ చెట్లు ఎక్కువగా ఉంటాయి. దక్షిణాన, స్పెయిన్ నుండి కేవలం 14 కిలోమీటర్లు (9 మైళ్లు) నీళ్లలో ప్రయాణం చేస్తే ఆఫ్రికా ఖండం చేరుకుంటాం.
యూరప్‌కు నైరుతిలో (southwest) ఉన్న ఈ దేశానికి చాలా జాతుల ప్రజలు అంటే ఫినీషియన్‌లు, గ్రీకులు, కార్తాజీనియన్‌లు వలస వచ్చారు. క్రీ.పూ. మూడవ శతాబ్దంలో రోమన్లు ఈ ప్రాంతాన్ని జయించి, హిస్‌పానియా అని పిలిచారు. తర్వాత విసిగోత్ ప్రజలు, మూర్ ప్రజలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఇక్కడ వాళ్లవాళ్ల సంస్కృతిని వదిలివెళ్లారు.
స్పెయిన్‌ను చూడడానికి 2015లో 680 లక్షలమంది వచ్చారు. చాలామంది ఇక్కడి వెచ్చని సూర్యకిరణాల కోసం, అందమైన
సముద్రతీరాల కోసం, ఈ దేశానికి సంబంధించిన కళలను, చరిత్రను, అందమైన భవనాలను చూడడం కోసం వస్తారు. స్పెయిన్ ఆహారం తినడానికి కూడా చాలామంది వస్తుంటారు. ఇక్కడ ఎక్కువ సముద్ర చేపలు, నిల్వ చేసిన పంది మాంసం, పుష్టికరమైన స్టూస్, సలాడ్‌లు, ఆలివ్ నునెతో తయారు చేసిన కూరగాయలు తింటారు. స్పానిష్ ఆమ్‌లెట్, పేలా, టాపాలు ప్రపంచంలో పేరుగాంచిన వంటకాలు.స్పెయిన్ నివాసులు చాలా స్నేహంగా ఉంటారు, త్వరగా కలిసిపోతారు. చాలామంది రోమన్ క్యాథలిక్ మతస్థులు అని చెప్పుకున్నా వాళ్లలో చాలా తక్కువమంది చర్చ్‌కు వెళ్తారు. ఈ మధ్య కాలంలో ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా వాళ్లు స్పెయిన్‌కు వలస వెళ్లారు. వాళ్ల మతనమ్మకాల గురించి ఆచారాల గురించి మాట్లాడడం వాళ్లకు చాలా ఇష్టం. వాళ్లతో యెహోవాసాక్షులు చక్కగా మాట్లాడి ఎన్నో విషయాల గురించి బైబిలు ఏం చెప్తుందో నేర్పించారు.
యెహోవాసాక్షుల్లో 10,500 మంది 2015లో 70 రాజ్యమందిరాలను (మీటింగ్స్ జరిగే స్థలాలు) కట్టడానికి లేదా మరమ్మతు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇలా కట్టడానికి కొన్ని స్థలాలను మునిసిపాలిటీలు ఇచ్చాయి. వలస వచ్చిన వాళ్లకు సహాయం చేయడానికి స్పానిష్ భాషతోపాటు యెహోవాసాక్షులు దాదాపు 30 కంటే ఎక్కువ భాషల్లో మీటింగ్స్ జరుపుకుంటున్నారు. 2016లో యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి యెహోవాసాక్షులు ఏర్పాటు చేసిన ప్రత్యేక మీటింగ్‌కి 1,86,000 కంటే ఎక్కువ మంది వచ్చారు.