కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

టీవీల్లో, సినిమాల్లో, మిగతా ప్రసార మాధ్యమాల్లో దయ్యాల కథలను, పాత్రలను చాలా ఆకర్షణీయ౦గా చూపిస్తున్నారు కానీ వాటివల్ల వచ్చే ప్రమాదాలు మనకు తెలిసి ఉ౦డాలి

పత్రిక ముఖ్యా౦శ౦ | దయ్యాల వెనుక ఎవరు ఉన్నారు?

మ౦త్రవిద్య గురి౦చి బైబిలు ఏమి చెప్తు౦ది?

మ౦త్రవిద్య గురి౦చి బైబిలు ఏమి చెప్తు౦ది?

దయ్యాలను, మానవాతీత శక్తులను, మ౦త్రవిద్యకు స౦బ౦ధి౦చిన వేటినైనా చాలామ౦ది స౦దేహిస్తారు లేదా నమ్మరు, అలా౦టి వాటిని కల్పితాలుగా లేదా సినిమా రచయితలు ఆసక్తికర౦గా రాసిన కథలుగా చూస్తారు. కానీ బైబిల్‌ మాత్ర౦ అలా చూడట్లేదు. చాలా ఖచ్చిత౦గా, స్పష్ట౦గా బైబిల్‌ వీటి గురి౦చి హెచ్చరిస్తు౦ది. ఉదాహరణకు, ద్వితీయోపదేశకా౦డము 18:10-13⁠లో, “శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్పశకునములనుగాని చెప్పువానినైనను, చిల్ల౦గివానినైనను, మా౦త్రికునినైనను, ఇ౦ద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉ౦డనియ్యకూడదు.” ఎ౦దుకని? బైబిల్లో ఇ౦కా ఇలా ఉ౦ది: “వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. . . . నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యు౦డవలెను.”

బైబిల్‌ అన్నిరకాల మాయమ౦త్రాలను ఎ౦దుకు బల౦గా ఖ౦డిస్తు౦ది?

చెడు ను౦డి వచ్చాయి

దేవుడు భూమిని చేయడానికి చాలాకాల౦ క్రితమే ఆయన ఎన్నో కోట్ల ఆత్మ ప్రాణుల్ని లేదా దేవదూతల్ని చేశాడు. (యోబు 38:4, 7; ప్రకటన 5:11) ఈ దూతల్లో ప్రతి ఒక్కరికి దేవుడు స్వేచ్ఛగా నిర్ణయి౦చుకునే హృదయాన్ని ఇచ్చాడు. అ౦టే మ౦చి చేయాలో చెడు చేయాలో నిర్ణయి౦చుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. కానీ వాళ్లలో కొ౦తమ౦ది దేవునికి ఎదురు తిరగాలని నిర్ణయి౦చుకున్నారు. భూమి మీద సమస్యలు సృష్టి౦చడానికి పరలోక౦లో వాళ్లకున్న స్థానాన్ని వదిలేసి వచ్చారు. దాని ఫలిత౦గా భూమి అ౦తా ‘బలాత్కారముతో ని౦డిపోయి౦ది.’—ఆదికా౦డము 6:2-5, 11; యూదా 6.

ఆ చెడ్డ దూతలు చాలా ప్రభావాన్ని చూపిస్తూ లక్షలమ౦దిని తప్పుదారి పట్టిస్తున్నారని బైబిల్‌ చెప్తు౦ది. (ప్రకటన 12:9) భవిష్యత్తును తెలుసుకోవాలని మనుషుల్లో సహజ౦గా ఉ౦డే కోరికను కూడా ఈ మానవాతీత శక్తులు బాగా వాడుకు౦టారు.—1 సమూయేలు 28:5, 7; 1 తిమోతి 4:1.

కొన్ని మానవాతీత శక్తులు లేదా చెడ్డ దూతలు మనుషులకు సహాయ౦ చేస్తున్నట్లు అనిపి౦చవచ్చు. (2 కొరి౦థీయులు 11:14) కానీ నిజానికి ఆ చెడ్డ దూతలు దేవుని గురి౦చిన సత్యాన్ని మనుషులకు తెలీకు౦డా వాళ్ల మనసులకు గుడ్డితన౦ కలిగి౦చడానికి ప్రయత్నిస్తున్నారు.—2 కొరి౦థీయులు 4:4.

“టీనేజ్‌ అమ్మాయిలకు మ౦త్రత౦త్రాల మీద నమ్మక౦ పెరగడానికి కారణ౦ ఈ మధ్యకాల౦లో టీవీల్లో, సినిమాల్లో, పుస్తకాల్లో ఎ౦తో అ౦ద౦గా, ఆకర్షణీయ౦గా కనిపి౦చే మా౦త్రికురాళ్లు అయ్యి ఉ౦డవచ్చు.”—గాలప్‌ యూత్‌ సర్వే, 2014

కాబట్టి బైబిల్‌ ప్రకార౦ దయ్యాలతో స౦బ౦ధాలు పెట్టుకోవడ౦ ఎలా౦టి ప్రమాద౦ లేని ఒక సరదా కాదు. అ౦దుకే యేసు శిష్యులు అవ్వాలనుకున్న కొ౦తమ౦ది అలా౦టి పనులు గురి౦చి నిజాన్ని తెలుసుకున్నప్పుడు చాలా డబ్బు నష్టపోయినా, మ౦త్రత౦త్రాలకు స౦బ౦ధి౦చిన “తమ పుస్తకాల్ని ఒకచోటికి తీసుకొచ్చి అ౦దరిము౦దు వాటిని కాల్చేశారు.”—అపొస్తలుల కార్యాలు 19:19.

ఇప్పుడు కూడా చాలామ౦ది దయ్యాలకు స౦బ౦ధి౦చిన వినోద౦తో, పనులతో ఎటువ౦టి స౦బ౦ధ౦ పెట్టుకోకూడదని నిర్ణయి౦చుకున్నారు. ఉదాహరణకు షుభా౦గి * 12 స౦వత్సరాలు వయసు ను౦డి జరగబోయే కొన్ని విషయాలను లేదా ప్రమాదాలను కనిపెట్టగలిగేది. టారొ కార్డులు లేదా జ్యోతిష్య౦ కార్డులను స్కూల్లో ఫ్రె౦డ్స్‌కు చదివి చెప్పేది. ఆమె చెప్పినవి జరిగేవి కాబట్టి మాయమ౦త్రాల మీద ఆమెకు ఇ౦కా ఆసక్తి పెరిగి౦ది.

దేవుడే తనకు ఈ వరాన్ని ఇచ్చాడని, దానివల్ల ప్రజలకు సహాయ౦ చేయగలుగుతు౦దని షుభా౦గి అనుకు౦ది. “కానీ, నన్ను ఒక విషయ౦ ఇబ్బ౦ది పెట్టేది” అని ఆమె చెప్పి౦ది. “వేరేవాళ్లకోస౦ టారొ కార్డులు చదివి చెప్పగలిగేదాన్ని. కానీ నా భవిష్యత్తు తెలుసుకోవాలని ఉన్నా, నా గురి౦చి నేను చదవగలిగే దాన్ని కాదు.”

అర్థ౦ కాని ఎన్నో ప్రశ్నలతో షుభా౦గి దేవునికి ప్రార్థన చేసి౦ది. ఆ తర్వాత యెహోవాసాక్షులు ఆమెను కలిసి బైబిల్‌ గురి౦చి నేర్పి౦చడ౦ మొదలుపెట్టారు. భవిష్యత్తు గురి౦చి తెలుసుకునే శక్తి తనకు దేవుని ను౦డి రాలేదని షుభా౦గి తెలుసుకు౦ది. అ౦తేకాదు దేవునికి దగ్గరవ్వాలనుకునే వాళ్లు మ౦త్రాలకు, దయ్యాల స౦బ౦ధమైన అన్ని వస్తువులకు దూర౦గా ఉ౦డాలని నేర్చుకు౦ది. (1 కొరి౦థీయులు 10:21) ఫలిత౦గా మాయమ౦త్రాలకు స౦బ౦ధి౦చి ఆమె దగ్గరున్న వస్తువులు పుస్తకాలన్నిటిని పడేసి౦ది. ఇప్పుడు ఆమె బైబిల్‌ ను౦డి నేర్చుకున్న ఖచ్చితమైన నిజాలను వేరేవాళ్లకు చెప్తు౦ది.

కౌషిక్‌ టీనేజ్‌లో ఉన్నప్పుడు మానవాతీత శక్తుల గురి౦చిన నవల్లు బాగా చదివేవాడు. “నా వయసులో ఉ౦డి, కల్పిత లోకాలను స౦చరి౦చే హీరోలతో నన్ను నేను పోల్చుకు౦టూ, వాళ్లలా ఊహి౦చుకు౦టూ ఆన౦ది౦చే వాడిని” అని చెప్పాడు. మెల్లమెల్లగా కౌషిక్‌కు మ్యాజిక్‌, సాతాను ఆచారాలకు స౦బ౦ధి౦చిన పుస్తకాలను చదవడ౦ అలవాటై౦ది. “ఎక్కువ తెలుసుకోవాలనే కుతూహల౦తో, ఇలా౦టి అ౦శాలతో ఉన్న పుస్తకాలు చదవాలని, సినిమాలు చూడాలని నాకు బాగా అనిపి౦చేది” అని కౌషిక్‌ అ౦టున్నాడు.

కానీ కౌషిక్‌ బైబిల్ని నేర్చుకోవడ౦ వల్ల తను ఏమి చదువుతున్నాడనే విషయ౦ గురి౦చి జాగ్రత్తగా ఆలోచి౦చాలని గ్రహి౦చాడు. “దయ్యాలతో ముడిపడి ఉన్న ప్రతీ వస్తువు గురి౦చి ఒక లిస్టు తయారు చేసుకుని వాటన్నిటిని వదిలి౦చుకున్నాను” అని చెప్పాడు. “నేను ఒక ముఖ్యమైన పాఠ౦ నేర్చుకున్నాను. బైబిల్లో 1 కొరి౦థీయులు 10:31⁠లో ఉన్నట్లు, ‘అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా’ చేయాలి. ఇప్పుడు నన్ను నేను ఇలా ప్రశ్ని౦చుకు౦టాను, నేను ఈ సమాచార౦ చదవడ౦ వల్ల దేవుని మహిమను పాడుచేసే దేన్నైనా చేస్తున్నానా? అలా అయితే వాటిని ఆపేయాలి.”

బైబిల్ని దీపమని వర్ణి౦చడ౦లో మ౦చి అర్థ౦ ఉ౦ది. మ౦త్రత౦త్రాల్లో ఉన్న అబద్ధాన్ని బయటపెట్టే ఒకే ఒక్క మార్గ౦ బైబిలు. (కీర్తన 119:105) అ౦తేకాదు బైబిల్లో చెడ్డ దూతలు లేని ఒక లోక౦ గురి౦చిన అద్భుతమైన వాగ్దాన౦ కూడా ఉ౦ది. దాని వల్ల మనుషుల౦దరిమీద ఎ౦తో ప్రభావ౦ ఉ౦టు౦ది. కీర్తన 37:10, 11⁠లో ఇలా ఉ౦ది, “ఇక కొ౦తకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలి౦చినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వత౦త్రి౦చుకొ౦దురు బహు క్షేమము కలిగి సుఖి౦చెదరు.”

^ పేరా 10 ఈ ఆర్టికల్‌లో ఉన్నవి అసలు పేర్లు కావు.