పత్రిక ముఖ్యాంశం
బైబిలు ఒక మంచి పుస్తకం మాత్రమేనా?
బైబిలును రాసి 2000 సంవత్సరాలు పూర్తయింది. ఈలోగా చాలా పుస్తకాలు వచ్చాయి, వెళ్లాయి. కానీ బైబిలు మాత్రం అలాగే ఉంది. కింది విషయాలు పరిశీలించండి.
-
చాలామంది వాళ్లకున్న అధికారంతో బైబిలును లేకుండ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బైబిలు ఈ రోజుకీ ఉంది. ఉదాహరణకు మధ్య యుగంలో “క్రైస్తవ” దేశాల్లో “సొంత భాషల్లో బైబిలు ఉంచుకున్న వాళ్లను, చదివిన వాళ్లను, నేరగాళ్లుగా తిరుగుబాటుదారులుగా పరిగణించేవాళ్లు” అని An Introduction to the Medieval Bible అనే పుస్తకం చెప్తుంది. పండితులు వాళ్ల ప్రాణాలకు తెగించి బైబిలును అనువదించారు, బైబిలు చదవమని ప్రోత్సహించారు. వాళ్లలో కొంతమందిని చంపేశారు కూడా.
-
అంతమంది వ్యతిరేకులున్నా బైబిలు అన్ని కాలాల్లో, దాదాపు అందరి దగ్గర ఉంది. పూర్తిగా లేదా విడివిడిగా 2,800 భాషల్లో 50 కోట్ల బైబిళ్లను ముద్రించారు. తత్వజ్ఞానం, సైన్స్ లాంటి అంశాలకు సంబంధించిన పుస్తకాలను కొంతమందే చదువుతారు, తర్వాత అవి పనికి రావు కూడా. కానీ బైబిలు అలా కాదు.
-
కొన్ని భాషల్లోకి బైబిల్ని అనువదించడం వల్ల ఆ భాషలు ఇప్పటికీ ఉన్నాయి, ఇంకా మెరుగయ్యాయి. జర్మన్ భాషలో మార్టిన్ లూథర్ చేసిన అనువాదం ఆ భాషకు ఎంతో సహాయం చేసింది. ఇంగ్లీషులో ముద్రించిన పుస్తకాలన్నిటిలో కింగ్ జేమ్స్ వర్షన్ మొదటి బైబిలును ప్రత్యేకమైన పుస్తకంగా చెప్తారు.
-
బైబిలు “ప్రభావం పాశ్చాత్య దేశాల మీద చాలా ఎక్కువగా ఉంది. మతపరమైన నమ్మకాలు, ఆచారాలే కాదు, వాళ్ల కళలు, సాహిత్యం, న్యాయవ్యవస్థ, రాజకీయాలు మరితర ఎన్నో విషయాల్లో [బైబిలు ప్రభావం] ఉంది.”—The Oxford Encyclopedia of the Books of the Bible.
బైబిలు ప్రత్యేకమైనదని చెప్పడానికి అవి కొన్ని వాస్తవాలు మాత్రమే. అసలు బైబిలుకు ఎందుకు ఇంత పేరొచ్చింది? ఎందుకు ప్రజలు బైబిలు కోసం ప్రాణాలు పణంగా పెట్టారు? కొన్ని కారణాలు చూద్దాం. మనమెలా జీవించాలో, దైవభక్తితో ఎలా ఉండాలో ఉపయోగపడే సమాచారం బైబిల్లో ఉంది. మనుషుల బాధలకు, గొడవలకు అసలు కారణం ఏమిటో ఉంది. అంతేకాకుండా ఆ సమస్యలు పోతాయని చెప్తూ, ఎలా పోతాయో కూడా బైబిలు వివరిస్తుంది.
బైబిలు నైతిక, ఆధ్యాత్మిక విషయాలను నేర్పిస్తుంది
చదువు ముఖ్యమే. కాని “చదువు . . . కేవలం పేరు చివర డిగ్రీలు రాసుకోవడానికి పనికొచ్చేది అయితే . . . అలాంటి చదువు వల్ల నైతిక విలువలు ఉంటాయని చెప్పలేం,” అని Ottawa Citizen అనే కెనడా వార్తాపత్రిక చెప్తుంది. బాగా చదువుకున్న వాళ్లు కూడా మోసం, అవినీతి, దొంగతనాలకు పాల్పడుతున్నారు. వాళ్లలో నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. అందుకే “ప్రజలకు నాయకుల మీద నమ్మకం పోతుంది” అని Edelman అనే సంస్థ రిపోర్టు చెప్తుంది.
బైబిలు నైతిక, ఆధ్యాత్మిక విషయాల గురించి నేర్పిస్తుంది. అది “నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును” మనకు తెలుపుతుంది. (సామెతలు 2:9) ఉదాహరణకు, పోలండ్‌లో ఉంటున్న ఒక 23 సంవత్సరాల యువకుడికి జైలు శిక్ష పడింది. జైల్లో ఉండగా బైబిలు చదివి అందులో ఎన్నో ఉపయోగపడే విషయాలు ఉన్నాయని ఆయన గ్రహించాడు, ఆయన ఇలా అంటున్నాడు “‘మీ నాన్నను, మీ అమ్మను గౌరవించు’ అనే మాటల అర్థం ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నా కోపాన్ని, ఆగ్రహాన్ని నియంత్రించుకోవడం ఎలాగో నేర్చుకున్నాను.”—ఎఫెసీయులు 4:31; 6:2.
ఆయనకు బాగా నచ్చిన బైబిలు సూత్రం సామెతలు 19:11. అక్కడ ఇలా ఉంది, “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.” బాగా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఆయన ప్రశాంతంగా బైబిల్లో ఉన్న ఏ సూత్రాలను పాటించాలో ఆలోచిస్తాడు. “బైబిలంత మంచి పుస్తకం ఇంకొకటి లేదు,” అని ఆయన చెప్తున్నాడు.
మారీయా ఒక యెహోవాసాక్షి. దురభిమానంతో ఒక స్త్రీ పెద్ద గొడవ చేసి ఆమెను అవమానించింది. మారీయా ఏమీ మాట్లాడకుండా శాంతంగా తన దారిన వెళ్లిపోయింది. మారీయా ఒక్క మాట కూడా అనలేదు కాబట్టి ఆ స్త్రీ తన తప్పును తెలుసుకుంది. అంతేకాదు సాక్షుల కోసం వెదికింది. దాదాపు నెల తర్వాత మారీయా కనిపించడంతో ఆమెను కౌగిలించుకుని క్షమాపణ అడిగింది. మారీయా శాంతంగా ఉండడానికి, ఆశానిగ్రహం యెహోవాసాక్షులతో బైబిలు స్టడీ చేయాలని నిర్ణయించుకున్నారు.
చూపడానికి ఆమె మతనమ్మకాలే కారణమని ఆ స్త్రీ గ్రహించింది. ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యుల్లో ఐదుగురు,జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి రుజువౌతుందని యేసుక్రీస్తు చెప్పాడు. (మత్తయి 11:19) బైబిలు జ్ఞానాన్ని పాటించిన వాళ్లు దాని విలువను తప్పకుండా తెలుసుకుంటారు. బైబిలు ప్రమాణాలు ఉపయోగకరమైనవి అనడానికి చాలా రుజువులు ఉన్నాయి. బైబిలు ప్రమాణాలు మనలో ఉన్న మంచిని బయటకు తెస్తాయి. అవి ‘బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును,’ ‘హృదయమును సంతోషపరచును,’ నైతిక ఆధ్యాత్మిక విషయాల్లో ‘కన్నులకు వెలుగిచ్చును.’—కీర్తన 19:7, 8.
బాధలకు, గొడవలకు కారణాలను బైబిలు వివరిస్తుంది
ఒక పెద్ద అంటువ్యాధి వచ్చినప్పుడు పరిశోధకులు దానికి అసలు కారణమేంటో అది ఎలా మొదలైందో తెలుసుకుంటారు. అలాగే మనుషులకు “అంటువ్యాధిలా” ఉన్న బాధలు, గొడవలు కూడా ఎలా మొదలయ్యాయో తెలుసుకోవాలి. ఈ విషయంలో బైబిలు మనకు సహాయం చేస్తుంది. కష్టాలు అసలు ఎలా మొదలయ్యాయో వివరిస్తుంది.
దేవునికి వ్యతిరేకంగా తప్పు చేయడం వల్ల మనుషులకు బాధలు వచ్చాయని బైబిల్లోని ఆదికాండము అనే పుస్తకం వివరిస్తుంది. సృష్టికర్తకు మాత్రమే మంచేదో చెడేదో నిర్ణయించే హక్కు ఉంది. కానీ మొదటి మనుషులు ఆ హక్కును వాళ్ల చేతుల్లోకి తీసుకున్నారు. (ఆదికాండము 3:1-7) అప్పటినుండి ప్రజలందరూ సృష్టికర్తను పక్కనపెట్టి వాళ్లకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా, చరిత్ర మొత్తంలో స్వేచ్ఛా సంతోషాలకు బదులు ఘర్షణలు, అణచివేత, నైతిక, ఆధ్యాత్మిక విలువలు తగ్గిపోవడం లాంటివే కనిపిస్తున్నాయి. (ప్రసంగి 8:9) అందుకే బైబిలు ఇలా చెబుతుంది: “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు.” (యిర్మీయా 10:23) మంచి విషయం ఏమిటంటే, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను మనుషులు దుర్వినియోగం చేసుకునే సమయం దాదాపు అయిపోయింది.
బైబిలు ఇచ్చే నిరీక్షణ
దేవునికి, ఆయన ప్రమాణాలకు అనుగుణంగా జీవించే వాళ్ల కోసం ఆయన ఈ చెడును, బాధను ఇలాగే ఉండనివ్వడని బైబిలు చెప్తుంది. మనమీద ప్రేమతో దేవుడు వీటన్నిటిని తీసేస్తాడు. చెడ్డవాళ్లు “తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు.” (సామెతలు 1:30, 31) కానీ “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.
“మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని [దేవుడు] యిచ్ఛయించుచున్నాడు.”—1 తిమోతి 2:3, 4
దేవుడు తాను అనుకున్న శాంతిని “దేవుని రాజ్యం” ద్వారా తీసుకొస్తాడు. (లూకా 4:43) ఆ రాజ్యం ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తుంది. దాని ద్వారా మనుషులను పరిపాలించే హక్కు న్యాయంగా తనదేనని దేవుడు చూపిస్తాడు. యేసు ఆ రాజ్యానికి భూమితో ఉన్న సంబంధాన్ని మాదిరి ప్రార్థనలో చెప్పాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము . . . భూమియందును నెరవేరును గాక.”—మత్తయి 6:10.
అవును, ఆ రాజ్య పౌరులందరూ ఆయన చిత్తాన్ని చేస్తారు, ఏ మనిషిని కాదు తమ సృష్టికర్త అయిన దేవుడినే సరైన పరిపాలకునిగా చూస్తారు. అవినీతి, స్వార్థం, బీద-గొప్ప తేడాలు, జాతి విభేదాలు, యుద్ధం ఇక ఉండవు. ఒకే ప్రభుత్వంతో, ఒకే విధమైన నైతిక, ఆధ్యాత్మిక ప్రమాణాలతో ప్రపంచమంతా ఒకటిగా ఉంటుంది.—ప్రకటన 11:15.
ఆ కొత్త లోకాన్ని చూడాలంటే విద్య చాలా ముఖ్యం. ఆ విద్య గురించి 1 తిమోతి 2:3, 4 చెప్తుంది. అక్కడ ఇలా ఉంది: “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని [దేవుడు] యిచ్ఛయించుచున్నాడు.” ఆ సత్యంలో బైబిలు బోధలు ఉంటాయి. అవే ఆ రాజ్యానికి రాజ్యాంగం అని చెప్పవచ్చు. ఎందుకంటే అందులో నియమాలు, ప్రమాణాలు ఉంటాయి. వాటిని బట్టే పరిపాలన జరుగుతుంది. వీటిలో కొన్నిటిని మనం యేసుక్రీస్తు కొండమీద ఇచ్చిన ప్రసంగంలో చూడొచ్చు. (మత్తయి 5-7 అధ్యాయాలు) ఈ మూడు అధ్యాయాల్లో యేసు జ్ఞానం కనబడుతుంది. వీటిని ప్రతీ ఒక్కరు పాటిస్తే జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి.
బైబిలు దాదాపు అందరి దగ్గర ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు! ఎందుకంటే, అందులో బోధలకు మూలం దేవుడే, అదే దాని ప్రత్యేకత. బైబిలు అందరి దగ్గర ఉందన్న విషయాన్ని బట్టి అన్ని జాతుల, భాషల వాళ్లు దేవుని గురించి తెలుసుకుని, ఆయన రాజ్యం తీసుకువచ్చే ఆశీర్వాదాల నుండి ప్రయోజనం పొందాలనేది దేవుని కోరికని తెలుస్తుంది.—అపొస్తలుల కార్యములు 10:34, 35. ◼ (g16-E No. 2)