తెలుగు
ఇతరుల మీద గౌరవం ఏమైపోయింది?
https://cms-imgp.jw-cdn.org/img/p/102024003/univ/art/102024003_univ_sqr_xl.jpg
g24 No. 1 పేజీలు 4-6

ఇతరుల మీద గౌరవం ఏమైపోయింది?

ఇతరుల మీద గౌరవం ఏమైపోయింది?

ఇతరుల మీద గౌరవం ఎందుకు చూపించాలి?

ఇతరుల మీద గౌరవం చూపిస్తే అనవసరమైన టెన్షన్లు ఉండవు అలాగే పరిస్థితులు మరింత ఘోరంగా మారవు.

  • బైబిల్లో ఉన్న ఒక సామెత ఇలా చెప్తుంది: “సౌమ్యంగా ఇచ్చే జవాబు కోపాన్ని చల్లారుస్తుంది, నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది.” (సామెతలు 15:1) కొన్నిసార్లయితే గౌరవంలేని మాటలు, పనులు నిప్పు మీద పెట్రోల్‌ పోసినట్టు, పరిస్థితుల్ని పూర్తిగా తగలబెట్టేస్తాయి.

  • యేసు ఇలా అన్నాడు: “హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది.” (మత్తయి 12:34) గౌరవం లేకుండా మాట్లాడడం మన గురించి చాలా విషయాలు చెప్పకనే చెప్తుంది. అంటే ప్రజల జాతి, దేశం, తెగ, పెరిగిన విధానం గురించి మన హృదయంలో ఏం అనుకుంటున్నామో ఆ మాటలు బయటపెడతాయి.

    ఈ మధ్య 28 దేశాల్లో 32,000 కంటే ఎక్కువ మందితో ఒక సర్వే జరిగింది. దానిలో సగం కంటే ఎక్కువమంది, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు గౌరవం, మంచి-మర్యాదలు అడుగంటిపోయాయి అని చెప్పారు.

మీరు ఏం చేస్తే బాగుంటుంది

ఇతరులు చెప్పేది మీకు నచ్చకపోయినా సరే, అందరినీ గౌరవించండి. ఎదుటివాళ్లూ, మీరూ ఒప్పుకునే విషయాలు ఏంటో గుర్తించండి. అలా చేస్తే చీటికిమాటికి తప్పులు వెతుకుతూ, కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లుగా ఉండరు. అలాగే ప్రతీదాన్ని వేలెత్తి చూపించేవాళ్లుగా ఉండరు.

“తీర్పు తీర్చడం ఆపేయండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు.”—మత్తయి 7:1.

ఇతరులు మీతో ఎలా ఉండాలనుకుంటున్నారో మీరూ వాళ్లతో అలాగే ఉండండి. ఎదుటివాళ్లను అర్థం చేసుకుంటూ, వాళ్లతో మంచిగా ఉంటే వాళ్లు కూడా మీతో అలాగే ఉండొచ్చు.

“ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.”—లూకా 6:31.

క్షమించండి. ఇతరులు మిమ్మల్ని వాళ్ల మాటలతో, పనులతో బాధపెట్టినప్పుడు చూసీచూడనట్లు వదిలేయండి. వాళ్లు కావాలని అలా చేసుండరని అర్థం చేసుకోండి.

“మనిషి లోతైన అవగాహన అతని కోపాన్ని చల్లారుస్తుంది, తప్పును పట్టించుకోకుండా ఉండడం అతనికి ఘనతను తెస్తుంది.”—సామెతలు 19:11.

యెహోవాసాక్షులమైన మేము ఏం చేస్తామంటే . . .

యెహోవాసాక్షులు తమ చుట్టూ ఉండే వాళ్ల మీద గౌరవం చూపిస్తారు.

బైబిలు గురించి అందరికి ఉచితంగా చెప్తాం. మా నమ్మకాల్ని, అభిప్రాయాల్ని ఇతరుల మీద బలవంతంగా రుద్దం. బైబిలు గురించి అందరికీ “సౌమ్యంగా, ప్రగాఢ గౌరవంతో” చెప్తూ వాటిని మేము కూడా పాటిస్తాం.—1 పేతురు 3:15; 2 తిమోతి 2:24.

అందర్నీ ఒకేలా చూస్తాం. బైబిలు గురించి ఎవరైతే తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్లని మా మీటింగ్స్‌కి రమ్మని పిలుస్తాం. ఎలాంటి తేడాలు లేకుండా అందర్నీ పట్టించుకుంటాం, గౌరవిస్తాం.—1 పేతురు 2:17.

ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. మేము ప్రభుత్వానికి-చట్టానికి లోబడతాం, టాక్స్‌లు కడతాం. (రోమీయులు 13:1) రాజకీయ విషయాల్లో తలదూర్చం, అలాగని వ్యతిరేకించం. అంతేకాదు ఇలాంటి విషయాల్లో ఎదుటివాళ్ల నిర్ణయాల్ని మేము గౌరవిస్తాం.