కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచమంతా గందరగోళం

2 | పొదుపుగా జీవించండి

2 | పొదుపుగా జీవించండి

ఎందుకో తెలుసా?

చాలామందిది, రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. విపత్తులు జరిగినప్పుడు, అంటువ్యాధులు వ్యాపించినప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా తయారౌతుంది. ఎందుకు?

  • ఏ ప్రాంతాల్లోనైతే పరిస్థితులు బాలేవో అక్కడ నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు అమాంతం పెరిగిపోతాయి.

  • మారిన పరిస్థితులవల్ల కొంతమంది ఉద్యోగాలు పోవచ్చు, లేదా జీతాలు తగ్గిపోవచ్చు.

  • తుఫాన్లు, భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు షాపులు, ఇళ్లు కూలిపోతాయి, భారీగా ఆస్తి నష్టం జరుగుతుంది. చాలామంది ఉన్నదంతా పోగొట్టుకుని వట్టిచేతులతో మిగిలిపోతారు.

మీకు తెలుసా?

  • ఇప్పుడు డబ్బును పొదుపు చేస్తే, పరిస్థితులు తారుమారైనప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది.

  • మీరు సంపాదించిన డబ్బుకు, ఆస్తులకు ఈరోజు ఉన్న విలువ రేపు ఉండకపోవచ్చు.

  • డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉంటాయి. సంతోషాన్ని, కుటుంబ బంధాల్ని ఎంత డబ్బు పెట్టినా కొనలేం.

ఇప్పుడు ఏం చేయాలి?

బైబిలు ఇలా చెప్తుంది: “మనకు ఆహారం, బట్టలు ఉంటే చాలు, వాటితో తృప్తిపడదాం.”—1 తిమోతి 6:8.

తృప్తిగా జీవించడమంటే కోరికలు తగ్గించుకుని, రోజువారీ అవసరాలు తీరితే చాలు అనుకోవడం. ముఖ్యంగా, మన ప్రాంతంలో పరిస్థితులు బాలేనప్పుడు ఇలా జీవించడం చాలా అవసరం.

తృప్తిగా జీవించాలంటే తక్కువ డబ్బుతోనే సర్దుకొని బ్రతకాల్సి రావచ్చు. ఒకవేళ సంపాదన కన్నా ఖర్చు ఎక్కువైతే, సమస్యలు ఎక్కువౌతాయే గానీ తగ్గవు.