కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒత్తిడి నుండి బయటపడండి

ఒత్తిడిలేని జీవితం సాధ్యమే

ఒత్తిడిలేని జీవితం సాధ్యమే

అనవసరమైన ఒత్తిడిని చాలావరకు తగ్గించుకోవడానికి బైబిల్లో ఉన్న తెలివి సహాయం చేస్తుంది. ఒత్తిడి కలిగించే వాటన్నిటిని తీసేయడం మనకు అసాధ్యం, కానీ సృష్టికర్తకు సాధ్యమే. ఈ విషయంలో మనకు సహాయం చేయడానికి ఆయన ఒక వ్యక్తిని నియమించాడు. ఆయనే యేసుక్రీస్తు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసినవాటి కన్నా మరెన్నో గొప్ప సంగతుల్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా చేస్తాడు. ఉదాహరణకు:

యేసు ఒకప్పుడు చేసినట్టే, రోగుల్ని బాగుచేస్తాడు.

‘ప్రజలు రకరకాల జబ్బులతో బాధపడుతున్నవాళ్లను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లను బాగుచేశాడు.’—మత్తయి 4:24.

యేసు అందరికీ ఇళ్లు, ఆహారం ఇస్తాడు.

“వాళ్లు [క్రీస్తు పరిపాలనలో ఉండే ప్రజలు] ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తారు, ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటారు. వాళ్లు కట్టుకున్న ఇళ్లలో వేరేవాళ్లు నివసించరు, వాళ్లు నాటుకున్న వాటిని వేరేవాళ్లు తినరు.”—యెషయా 65:21, 22.

యేసు పరిపాలనలో భూమంతటా శాంతి, భద్రతలు ఉంటాయి.

‘ఆయన రోజుల్లో నీతిమంతులు వర్ధిల్లుతారు, చంద్రుడు లేకుండా పోయేవరకు శాంతి విస్తరిస్తుంది. సముద్రం నుండి సముద్రం వరకు, నది నుండి భూమి అంచుల వరకు ఆయన పరిపాలిస్తాడు. ఆయన శత్రువులు మట్టి నాకుతారు.’—కీర్తన 72:7-9.

యేసు అన్యాయాన్ని అంతం చేస్తాడు.

“దీనుల మీద, పేదవాళ్ల మీద ఆయన జాలి చూపిస్తాడు, పేదవాళ్ల ప్రాణాల్ని కాపాడతాడు. అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్తన 72:13, 14.

యేసు బాధల్ని, మరణాన్ని కూడా తీసేస్తాడు.

“మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”—ప్రకటన 21:4.