కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషంగా జీవించడం ఇప్పుడు కూడా సాధ్యమే!

సంతోషంగా జీవించడం ఇప్పుడు కూడా సాధ్యమే!

“ప్రపంచంలో పరిస్థితి అస్సలు బాలేదు. కొంతమంది పేదరికంతో కష్టాలు పడుతుంటే, ఇంకొంతమంది జబ్బులతో బాధలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల పిల్లలు వేధింపులకు గురౌతున్నారు. ఇలాంటివి చూసినప్పుడు గుండె పిండేసినట్టు అవుతుంది. కానీ, త్వరలో మంచి రోజులు వస్తాయని నాకు తెలుసు.”—రాణి  *

మన సృష్టికర్త ప్రపంచంలోని పరిస్థితుల్ని భవిష్యత్తులో బాగుచేస్తాడని రాణి గ్రహించింది. మనం సంతోషంగా జీవించడానికి ఆయన ఎన్నో తెలివైన సలహాలు ఇచ్చాడని కూడా తెలుసుకుంది. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు రాణి నిజమైన సంతోషాన్ని పొందింది. సృష్టికర్త ఇచ్చే తెలివైన సలహాల్ని పాటిస్తే, మీరు కూడా సంతోషంగా ఉంటారు. తర్వాతి పేజీల్లో, మీరు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటారు:

  • కుటుంబంలో సుఖసంతోషాలు ఉండాలంటే ఏం చేయాలి?

  • అందరితో మంచి సంబంధం కలిగివుండాలంటే ఏం చేయాలి?

  • సంతృప్తితో జీవించాలంటే ఏం చేయాలి?

  • మనం ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాం? మనుషులు ఎందుకు చనిపోతున్నారు?

  • త్వరలో మంచి రోజులు వస్తాయనే ఆశతో ఎందుకు జీవించవచ్చు?

  • సృష్టికర్త గురించి ఎలా తెలుసుకోవచ్చు? ఆయనతో ఎలా స్నేహం చేయవచ్చు?

వీటి గురించి తాను చెప్తున్న విషయాలు కేవలం కొంతమందే కాదు, అందరూ తెలుసుకోవాలని మన సృష్టికర్త కోరుకుంటున్నాడు.

^ పేరా 2 పేర్లు మార్చాం.