కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ రాజ్యము వచ్చుగాక”—లక్షలమంది ప్రజలు చేసే ప్రార్థన

“నీ రాజ్యము వచ్చుగాక”—లక్షలమంది ప్రజలు చేసే ప్రార్థన

మీరెప్పుడైనా దేవుని రాజ్యం రావాలని ప్రార్థించారా? గత కొన్ని శతాబ్దాలుగా లక్షలమంది ప్రజలు “నీ రాజ్యము వచ్చుగాక” అని ఎన్నోసార్లు ప్రార్థించారు. వాళ్లు ఎందుకలా ప్రార్థిస్తున్నారు? ఎందుకంటే, దేవుని రాజ్యం కోసం ప్రార్థించమని యేసు తన అనుచరులకు చెప్పాడు.

రాజ్యం గురించి ఆయన చెప్పిన ప్రతీ విషయాన్ని యేసు అనుచరులు మొదట్లో అర్థం చేసుకోలేదు. ఒకసారి వాళ్లు ఆయన్ని ఇలా అడిగారు: “ప్రభువా, ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మళ్లీ ఇస్తావా?” యేసు సూటిగా సమాధానం ఇవ్వకపోవడం చూసి బహుశా వాళ్లు ఆశ్చర్యపోయివుంటారు. (అపొస్తలుల కార్యాలు 1:6, 7) అయితే, దేవుని రాజ్యమంటే ఏమిటో, అదెప్పుడు వస్తుందో మనం తెలుసుకోలేమని దానర్థమా? అస్సలు కాదు!

కావలికోట సంచిక మీకు ఈ ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది:

  • దేవుని రాజ్యం మనకు ఎందుకు అవసరం?

  • దేవుని రాజ్యానికి రాజు ఎవరు?

  • దేవుని రాజ్యం భూమ్మీద ఎప్పుడు పరిపాలిస్తుంది?

  • దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

  • దేవుని రాజ్యానికి మనం మద్దతివ్వాలని ఇప్పుడే ఎందుకు నిర్ణయించుకోవాలి?

  • దేవుని రాజ్యం అంటే ఏంటి?