కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం అంటే ఏంటి?

దేవుని రాజ్యం అంటే ఏంటి?

దేవుని రాజ్యం రావాలని చాలామంది ప్రార్థిస్తారు. కానీ మీరెప్పుడైనా దేవుని రాజ్యం అంటే ఏంటో, అదేం చేస్తుందో అని ఆలోచించారా?

బైబిలు ఏం చెబుతుందో పరిశీలించండి:

  • దేవుని రాజ్యం అంటే ఏంటి?

    అది ఒక పరలోక ప్రభుత్వం. దానికి రాజు యేసుక్రీస్తు.—యెషయా 9:6, 7; మత్తయి 5:3; లూకా 1:31-33.

  • దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

    అది చెడునంతా తీసేస్తుంది, భూమ్మీద ఉన్న ప్రజలకు శాశ్వత శాంతిని తీసుకొస్తుంది.—దానియేలు 2:44; మత్తయి 6:10.

  • దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడం అంటే ఏంటి?

    అంటే దేవుని రాజ్యానికి మద్దతివ్వడం; అలాగే ఆ రాజ్యం మాత్రమే భూమ్మీద పరిస్థితుల్ని దేవుడు అనుకున్నట్టుగా మారుస్తుందని నమ్మడం.—మత్తయి 6:33; 13:44.