కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రార్థించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

ప్రార్థించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

పామెలా, తనకు క్యాన్సర్‌ ఉందని తెలిసినప్పుడు చికిత్స తీసుకోవడానికి హాస్పిటల్‌కు వెళ్లింది. అంతేకాదు, తన కష్టమైన పరిస్థితిని సహించడానికి కావాల్సిన బలం కోసం దేవునికి ప్రార్థించింది. మరి ప్రార్థన ఆమెకు సహాయం చేసిందా?

పామెలా ఇలా అంటుంది, “క్యాన్సర్‌కి చికిత్స తీసుకునేటప్పుడు నాకు చాలా భయం వేసేది. కానీ నేను యెహోవా దేవునికి ప్రార్థించినప్పుడు నెమ్మది పొందాను. అలాగే నా భయం తగ్గి, పరిస్థితిని సహించగలిగాను. అనారోగ్యం వల్ల నేను ఇప్పటికీ ఎంతో నొప్పితో బాధపడుతున్నాను. కానీ నిరాశపడకుండా, సానుకూలంగా ఆలోచించేలా ప్రార్థన నాకు సహాయం చేస్తుంది. ఎవరైనా నన్ను ‘ఎలా ఉన్నావు?’ అని అడిగినప్పుడు ‘నాకు ఆరోగ్యం బాలేదు. కానీ సంతోషంగా ఉన్నాను,’ అని అంటాను.”

అలాంటి పెద్దపెద్ద సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, మనం వేరే సమయాల్లో కూడా ప్రార్థించవచ్చు. అవును, మనందరికీ సమస్యలు వస్తాయి; అవి చిన్నవైనా, పెద్దవైనా వాటిని ఎదుర్కోవడానికి సహాయం కావాలని అనిపిస్తుంది. మరి ప్రార్థన సహాయం చేయగలదా?

“నీ భారం యెహోవా మీద వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడిపోనివ్వడు,” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 55:22) ఆ మాటలు ఎంత ఓదార్పును ఇస్తున్నాయో కదా! కాబట్టి ప్రార్థన మీకెలా సహాయం చేయగలదు? మీరు సరైన విధంగా దేవునికి ప్రార్థించినప్పుడు, మీ సమస్యల్ని ఎదుర్కోవడానికి ఆయన మీకు కావాల్సిన సహాయాన్ని ఇస్తాడు.—“ ప్రార్థన చేయడం వల్ల ఏం పొందుతాం?” అనే బాక్సు చూడండి.