కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు మీ ప్రార్థనలు వింటున్నాడా?

దేవుడు మీ ప్రార్థనలు వింటున్నాడా?

మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నిజంగా వింటున్నాడని మీకు అనిపిస్తుందా?

బైబిలు ఏం చెప్తుంది?

  • దేవుడు వింటున్నాడు. బైబిలు ఇలా హామీ ఇస్తుంది: ‘తనకు మొరపెట్టే వాళ్లందరికీ, నిజాయితీతో తనకు మొరపెట్టే వాళ్లందరికీ యెహోవా దగ్గరగా ఉన్నాడు. సహాయం కోసం వాళ్లు పెట్టే మొరలు వింటాడు.’—కీర్తన 145:18, 19.

  • మీరు తనకు ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. “ప్రతీ విషయంలో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అలాగే కృతజ్ఞతలు చెప్పండి,” అని బైబిలు మనల్ని ఆహ్వానిస్తుంది.—ఫిలిప్పీయులు 4:6.

  • దేవుడు నిజంగా మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు. దేవునికి మన బాధలు, ఆందోళనలు అన్నీ తెలుసు. అంతేకాదు, ఆయన మనకు సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాడు. “మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి” అని బైబిలు చెప్తుంది, ఎందుకంటే “ఆయనకు మీమీద శ్రద్ధ ఉంది.”—1 పేతురు 5:7.