కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాయి మీద చెక్కివున్న మాటలు: “కేగావ్‌ కుమారుడైన కేగాఫ్‌ను యావే చ్వియోట్‌ శపించాలి”

మీకు తెలుసా?

మీకు తెలుసా?

ప్రాచీనకాలం నాటి రాయి మీద చెక్కివున్న మాటలు బైబిల్ని ఎలా సమర్థిస్తున్నాయి?

యెరూషలేములోని బైబిల్‌ లాండ్స్‌ మ్యూజియంలో, క్రీ.పూ. 700-600 కాలం నాటి ఒక రాయి ఉంది. అది ఇశ్రాయేలులోని హెబ్రోనులో ఒక సమాధుల గుహలో దొరికింది. దానిమీద ఈ మాటలు చెక్కివున్నాయి: “కేగావ్‌ కుమారుడైన కేగాఫ్‌ను యావే చ్వియోట్‌ శపించాలి.” ఆ మాటలు బైబిల్ని ఎలా సమర్థిస్తున్నాయి? నాలుగు హీబ్రూ అక్షరాల్ని ఉపయోగించి రాసే “యెహోవా” అనే పేరు ఆ కాలంలో అందరికీ తెలుసని, దాన్ని రోజువారీ జీవితంలో ఉపయోగించే వాళ్లని ఆ మాటలు రుజువు చేస్తున్నాయి. సమాధుల గుహల్లో చెక్కివున్న వేరే మాటలు కూడా దేవుని పేరును ఆ కాలాల్లో ఉపయోగించే వాళ్లని రుజువు చేస్తున్నాయి. గుహల్లో కలుసుకునేవాళ్లు లేదా దాక్కునేవాళ్లు తరచూ దేవుని పేరును, దేవుని పేరున్న తమ సొంత పేర్లను గోడల మీద రాసేవాళ్లు.

వాటి గురించి జార్జియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ రేచల్‌ నబుల్సీ ఇలా చెప్పింది: “రాతి మీద చెక్కివున్న మాటల్లో ‘యెహోవా’ [YHWH] అనే పేరు పదేపదే కనిపించడం చాలా ప్రత్యేకమైన విషయం. . . . ఆ మాటలు ఇశ్రాయేలు, యూదా ప్రజల జీవితాల్లో ‘యెహోవా’ ఎంత ముఖ్యమైనవాడో చూపిస్తున్నాయి.” అవి బైబిల్ని ఎలా సమర్థిస్తున్నాయి? నాలుగు హీబ్రూ అక్షరాలతో కూడిన దేవుని పేరు బైబిల్లో వేలసార్లు కనిపిస్తుంది. తరచూ వ్యక్తుల పేర్లలో కూడా దేవుని పేరు ఉండేది.

ఆ రాయి మీద చెక్కివున్న “యావే చ్వియోట్‌” అనే మాటకు, “సైన్యాలకు అధిపతైన యెహోవా” అని అర్థం. కాబట్టి బైబిలు కాలాల్లో దేవుని పేరే కాదు, “సైన్యాలకు అధిపతైన యెహోవా” అనే మాట కూడా తరచూ వాడేవాళ్లని తెలుస్తోంది. “యావే చ్వియోట్‌” అనే మాట కూడా బైబిల్ని సమర్థిస్తుంది. ఎందుకంటే బైబిల్లో “సైన్యాలకు అధిపతైన యెహోవా” అనే మాట హీబ్రూ లేఖనాల్లో 283 సార్లు కనిపిస్తుంది; ఎక్కువగా యెషయా, యిర్మీయా, జెకర్యా పుస్తకాల్లో కనిపిస్తుంది.