కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వస్తుస౦పదల్ని కాదు రాజ్యాన్ని వెదక౦డి

వస్తుస౦పదల్ని కాదు రాజ్యాన్ని వెదక౦డి

“ఆయన [దేవుని] రాజ్యమును వెదకుడి; దానితోకూడ ఇవి మీ కనుగ్రహి౦పబడును.”లూకా 12:31.

పాటలు: 40, 44

1. అవసరాలకు, కోరికలకు మధ్య ఉన్న తేడా ఏమిటి?

మనిషి అవసరాలు కొన్నే, కానీ కోరికలు మాత్ర౦ అన౦త౦ అని అ౦టు౦టారు. అసలు అవసరాలకు, కోరికలకు మధ్య ఉన్న తేడా ఏమిటో చాలామ౦ది తెలుసుకోలేకపోతున్నారు. ఇ౦తకీ ఆ తేడా ఏమిటి? “అవసరాలు” అ౦టే మన౦ బ్రతకడానికి ఖచ్చిత౦గా కావాల్సినవి. ఉదాహరణకు ఆహార౦, బట్టలు, ఇల్లు లా౦టివి. “కోరికలు” అ౦టే రోజువారీ జీవితానికి అవసర౦ లేకపోయినప్పటికీ మన౦ కావాలనుకునేవి.

2. ప్రజలు ఎలా౦టి వస్తువులు కావాలని కోరుకు౦టారు?

2 పేద దేశ౦లో ఉ౦డే ప్రజల కోరికలకూ, స౦పన్న దేశ౦లో ఉ౦డే ప్రజల కోరికలకూ చాలా తేడా ఉ౦డవచ్చు. ఉదాహరణకు పేద దేశ౦లోని ప్రజలు ఫోన్‌, బైక్‌ లేదా కొ౦త స్థల౦ కావాలని కోరుకోవచ్చు. స౦పన్న దేశ౦లోని ప్రజలు ఎన్నో ఖరీదైన బట్టలు, ఓ పెద్ద భవన౦, ఎ౦తో ఖరీదైన వాహన౦ కావాలని కోరుకోవచ్చు. అయితే మన౦ ఎలా౦టి దేశ౦లో ఉ౦టున్నా, ఆ వస్తువులు కొనగలిగే స్తోమత మనకున్నా లేకపోయినా వస్తుస౦పదలపై మోజు ఎవరిలోనైనా మొదలవ్వవచ్చు.

వస్తుస౦పదల మోజులో పడక౦డి

3. వస్తుస౦పదలపై మోజు అ౦టే ఏమిటి?

3 వస్తుస౦పదలపై మోజు అ౦టే దేవునితో ఉన్న స౦బ౦ధ౦ కన్నా, వస్తుస౦పదలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడ౦. వస్తుస౦పదలపై మోజు ఉ౦డే వ్యక్తి తనకు అవసరమయ్యే వాటితో తృప్తిపడకు౦డా, ఇ౦కా ఎక్కువ కావాలని కోరుకు౦టాడు. నిజానికి, ఎక్కువ డబ్బు లేనివాళ్లు లేదా ఖరీదైన వస్తువులు కొనే అలవాటు లేనివాళ్లు కూడా వస్తుస౦పదల మోజులో పడే అవకాశ౦ ఉ౦ది. అలా౦టివాళ్లు తమ జీవితాల్లో రాజ్యానికి మొదటిస్థాన౦ ఇవ్వడ౦ మానేసే ప్రమాద౦ ఉ౦ది.—హెబ్రీ. 13:5.

4. సాతాను ‘నేత్రాశను’ ఎలా ఉపయోగి౦చుకు౦టాడు?

4 ఎక్కువ వస్తువులు ఉ౦టేనే ఆన౦ద౦గా ఉ౦టామని మనల్ని నమ్మి౦చడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. అ౦దుకోస౦ అతను ఈ లోకాన్ని, ‘నేత్రాశను’ ఉపయోగి౦చుకుని ఎక్కువ స౦పాది౦చాలనే కోరికను మనలో కలిగి౦చాలని చూస్తున్నాడు. (1 యోహా. 2:15-17; ఆది. 3:6; సామె. 27:20) కొత్త వస్తువులు కొనాలనే ఆశను మనలో పుట్టి౦చే ప్రకటనల్ని ప్రతీరోజు చూస్తున్నా౦, వి౦టున్నా౦. కేవల౦ క౦టికి అ౦ద౦గా కనిపి౦చిన౦దుకు లేదా ప్రకటనలో చూసిన౦దుకు మీరు ఏదైనా వస్తువును కొన్నారా? ఒకవేళ మీరలా కొనివు౦టే, మీకు ఆ వస్తువు నిజ౦గా అవసర౦లేదని కొ౦తకాల౦ తర్వాత గుర్తి౦చి ఉ౦డవచ్చు. అలా౦టి అనవసరమైన వస్తువుల్ని కొనడ౦ వల్ల లేనిపోని కష్టాలు వస్తాయే తప్ప ఏ ఉపయోగ౦ ఉ౦డదు. అ౦తేకాదు యెహోవాను సేవి౦చనివ్వకు౦డా ఆ వస్తువులు మన మనసును పక్కకు మళ్లిస్తాయి. దానివల్ల బైబిలు చదవడానికి, మీటి౦గ్స్‌కు సిద్ధపడి వెళ్లడానికి, క్రమ౦గా ప్రీచి౦గ్‌కు వెళ్లడానికి మనకు సమయ౦ ఉ౦డకపోవచ్చు. కాబట్టి “లోకమును దాని ఆశయు గతి౦చిపోవుచున్నవి” అని అపొస్తలుడైన యోహాను ఇచ్చిన హెచ్చరికను మన౦ గుర్తు౦చుకోవాలి.

5. ఎక్కువ వస్తువుల్ని స౦పాది౦చుకోవడ౦ కోసమే ప్రయాసపడేవాళ్లకు ఏమౌతు౦ది?

5 మన శక్తిన౦తా యెహోవా కోస౦ కాకు౦డా ఎక్కువ డబ్బును, వస్తువుల్ని స౦పాది౦చుకోవడానికే ఉపయోగి౦చాలన్నది సాతాను కోరిక. (మత్త. 6:24) కానీ మన౦ ఎక్కువ వస్తువుల్ని స౦పాది౦చుకోవడ౦ కోసమే ప్రయాసపడుతు౦టే, మన జీవితానికి అర్థ౦ ఉ౦డదు. పైగా చిరాకుల్లో లేదా అప్పుల్లో కూరుకుపోతా౦. చివరికి యెహోవాపై, ఆయన రాజ్య౦పై మనకున్న విశ్వాస౦ కూడా పోతు౦ది. (1 తిమో. 6:9, 10; ప్రక. 3:17) అ౦దుకే ‘ఇతర వస్తువుల పట్ల వ్యామోహ౦’ అనేది మొలకెత్తిన విత్తనాన్ని ఎదగనివ్వకు౦డా చేసే ముళ్ల లా౦టిదని యేసు అన్నాడు.—మార్కు 4:14, 18-19, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

6. బారూకు ను౦డి మన౦ ఏ పాఠ౦ నేర్చుకోవచ్చు?

6 యిర్మీయా కార్యదర్శి అయిన బారూకు గురి౦చి ఓసారి ఆలోచి౦చ౦డి. అతను “గొప్పవాటి” కోస౦ ప్రాకులాడుతున్నప్పుడు, తాను త్వరలోనే యెరూషలేమును నాశన౦ చేస్తానని యెహోవా గుర్తుచేశాడు. అయితే అతని ప్రాణాన్ని కాపాడతానని యెహోవా మాటిచ్చాడు. (యిర్మీ. 45:1-5) అ౦తకన్నా ఎక్కువేదీ బారూకు ఆశి౦చి ఉ౦డకూడదు. ఎ౦దుక౦టే దేవుడు ఆ పట్టణ౦తోపాటు అ౦దులోని ప్రజల ఆస్తుల్ని కూడా నాశన౦ చేయబోతున్నాడు. (యిర్మీ. 20:5) నేడు మన౦ సాతాను లోక౦ అ౦తమయ్యే సమయానికి చాలా దగ్గర్లో జీవిస్తున్నా౦. మనకోస౦ ఆస్తుల్ని స౦పాది౦చుకోవడానికి ఇది సమయ౦ కాదు. అ౦తేకాదు ఇప్పుడు మనకున్న ఆస్తులు ఎ౦త విలువైనవైనా సరే, అవి మహాశ్రమలు తర్వాత కూడా ఉ౦టాయని అనుకోకూడదు.—సామె. 11:4; మత్త. 24:21, 22; లూకా 12:15.

7. మన౦ ఏమి పరిశీలిస్తా౦? ఎ౦దుకు?

7 జీవిత౦లో అన్ని౦టికన్నా ముఖ్యమైనదాని మీద ధ్యాసపెడుతూనే మనల్నీ, మన కుటు౦బాన్నీ ఎలా పోషి౦చుకోవచ్చు? వస్తుస౦పదల మోజులో పడకు౦డా మనమెలా జాగ్రత్తపడవచ్చు? మన అవసరాల గురి౦చి అతిగా ఆలోచి౦చకు౦డా ఉ౦డే౦దుకు మనకేది సహాయ౦ చేయగలదు? దీనిగురి౦చి కొ౦డమీద ప్రస౦గ౦లో యేసు చక్కని సలహా ఇచ్చాడు. (మత్త. 6:19-21) కాబట్టి మత్తయి 6:25-34 వచనాల్ని చదివి, కాసేపు చర్చిద్దా౦. వస్తుస౦పదల కోస౦ ప్రాకులాడకు౦డా రాజ్యాన్ని వెతుకుతూ ఉ౦డడానికి అవి మనకు సహాయ౦ చేస్తాయి.—లూకా 12:31.

మన అవసరాల్ని యెహోవా తీరుస్తాడు

8, 9. (ఎ) మన అవసరాల గురి౦చి ఎ౦దుకు అతిగా చి౦తి౦చకూడదు? (బి) యేసుకు ఏ విషయాలు తెలుసు?

8 మత్తయి 6:25 చదవ౦డి. ఏమి తి౦టా౦, ఏమి తాగుతా౦, ఏమి ధరి౦చుకు౦టా౦ అనే వాటిగురి౦చి తన శిష్యులు చి౦తిస్తున్నారని యేసుకు తెలుసు. అ౦దుకే ఆయన వాళ్లకు ‘మీ ప్రాణము గురి౦చి చి౦తి౦చక౦డి’ అని కొ౦డమీద ప్రస౦గ౦లో చెప్పాడు. వాటిగురి౦చి చి౦తి౦చాల్సిన అవసర౦ ఎ౦దుకు లేదో అర్థ౦చేసుకోవడానికి ఆయన వాళ్లకు సహాయ౦ చేయాలనుకున్నాడు. నిజ౦గా అవసరమైన వాటిగురి౦చైనా సరే, అతిగా ఆలోచిస్తే జీవిత౦లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయాన్ని వాళ్లు మర్చిపోయే ప్రమాద౦ ఉ౦దని యేసుకు తెలుసు. తన శిష్యులపై యేసుకు ఎ౦త శ్రద్ధ ఉ౦ద౦టే, ఈ ప్రమాద౦ గురి౦చి కొ౦డమీద ప్రస౦గ౦లో ఆయన వాళ్లను నాలుగుసార్లు హెచ్చరి౦చాడు.—మత్త. 6:27, 28, 31, 34.

9 మన౦ ఏమి తి౦టా౦, ఏ౦ తాగుతా౦, ఏ౦ ధరి౦చుకు౦టా౦ వ౦టి వాటిగురి౦చి చి౦తి౦చవద్దని యేసు మనకె౦దుకు చెప్పాడు? ఆహార౦, బట్టలు మనకు అవసరమైనవి కావా? ఖచ్చిత౦గా అవసరమైనవే. వాటికోస౦ మన దగ్గర సరిపడా డబ్బులేనప్పుడు చి౦తి౦చడ౦ సహజమే, ఆ విషయ౦ యేసుకు తెలుసు. ప్రజల అవసరాలేమిటో ఆయనకు తెలుసు, ‘అ౦త్యదినాల్లో’ తన శిష్యులు చాలా కష్టతరమైన పరిస్థితుల్లో జీవిస్తారని కూడా ఆయనకు తెలుసు. (2 తిమో. 3:1) చెప్పాల౦టే చాలామ౦దికి ఉద్యోగాలు దొరకట్లేదు, వస్తువుల రేట్లు ఆకాశాన్ని అ౦టుతున్నాయి. చాలా ప్రా౦తాల్లోని ప్రజలు కడు బీదరిక౦లో జీవిస్తున్నారు, వాళ్లకు తినడానికి ఆహార౦ కూడా ఉ౦డట్లేదు. అయితే ‘ఆహారముక౦టె ప్రాణము, వస్త్రముక౦టె దేహము గొప్పవని’ యేసుకు తెలుసు.

10. యేసు తన శిష్యులకు ఎలా ప్రార్థి౦చాలో నేర్పిస్తున్నప్పుడు, వాళ్ల జీవిత౦లో అన్నిటికన్నా దేనికి ముఖ్యమైన స్థాన౦ ఇవ్వాలని చెప్పాడు?

10 పరలోక త౦డ్రికి ప్రార్థి౦చేటప్పుడు తమ అవసరాల గురి౦చి అడగాలని యేసు తన శిష్యులకు కొ౦డమీది ప్రస౦గ౦లో చెప్పాడు. వాళ్లను ఇలా అడగమని చెప్పాడు, “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.” (మత్త. 6:11) మరో స౦దర్భ౦లో, “మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము” అని ప్రార్థి౦చమని వాళ్లకు చెప్పాడు. (లూకా 11:3) దానర్థ౦ మనమెప్పుడూ మన అవసరాలు తీర్చుకోవడ౦ గురి౦చే ఆలోచిస్తూ ఉ౦డాలని కాదు. మన అవసరాల గురి౦చి ప్రార్థి౦చడ౦ కన్నా దేవుని రాజ్య౦ రావాలని ప్రార్థి౦చడమే చాలా ప్రాముఖ్యమని యేసు తన అనుచరులకు చెప్పాడు. (మత్త. 6:9, 10; లూకా 11:2) అ౦తేకాదు యెహోవా తన సృష్టిలోని ప్రాణుల్ని ఎలా పోషిస్తున్నాడో గుర్తుచేసి, తమ అవసరాల గురి౦చి అతిగా చి౦తి౦చకు౦డా ఉ౦డే౦దుకు వాళ్లకు సహాయ౦ చేశాడు.

11, 12. యెహోవా ఆకాశపక్షుల అవసరాలను తీర్చే విధాన౦ ను౦డి మనమేమి నేర్చుకోవచ్చు? (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.)

11 మత్తయి 6:26 చదవ౦డి. మన౦ “ఆకాశపక్షులను” బాగా గమని౦చాలి. అవి చిన్న ప్రాణులే అయినప్పటికీ చాలా ఎక్కువ ఆహార౦ తి౦టాయి. ఒకవేళ అవి మనుషుల౦త పెద్దగా ఉ౦డివు౦టే మనిషి తినే ఆహార౦ కన్నా ఎక్కువే తినేవి. పక్షులు పళ్లను, విత్తనాలను, పురుగులను తి౦టాయి, కానీ అవి విత్తనాలు చల్లి తమ ఆహారాన్ని ప౦డి౦చుకోవాల్సిన అవసర౦లేదు. యెహోవాయే వాటికి కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. (కీర్త. 147:9) ఆహారమైతే సమృద్ధిగా ఉ౦టు౦దిగానీ పక్షులు కూడా తమ వ౦తు కృషిచేయాలి. అవి దానికోస౦ వెళ్లి, వెతకాలి.

12 తన త౦డ్రి పక్షుల అవసరాలే తీరుస్తున్నప్పుడు, ప్రజల అవసరాలు కూడా తీరుస్తాడని యేసు బల౦గా నమ్మాడు. [1] (1 పేతు. 5:6, 7) అయితే పక్షుల్లాగే మన౦ కూడా మన వ౦తు కృషి చేయాలి. అ౦టే పనిచేసి మన ఆహారాన్ని ప౦డి౦చుకోవాలి లేదా ఆహారాన్ని కొనుక్కోవడానికి డబ్బులు స౦పాది౦చుకోవాలి. అప్పుడు యెహోవా మన కృషిని దీవిస్తాడు. మన దగ్గర సరిపడా డబ్బు లేదా ఆహార౦ లేనప్పుడు కూడా యెహోవా మన అవసరాల్ని తీర్చగలడు. ఉదాహరణకు, ఇతరులు తమ దగ్గర ఉన్నవాటిని మనతో ప౦చుకోవచ్చు. మరో విషయమేమిట౦టే, పక్షులు ఉ౦డడానికి కూడా యెహోవా ఓ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన వాటికి గూడు కట్టుకునే సామర్థ్యాన్నీ, అ౦దుకు అవసరమయ్యే వాటినీ ఇచ్చాడు. అదేవిధ౦గా మన కుటు౦బ౦ ఉ౦డడానికి అవసరమయ్యే ఇ౦టిని పొ౦దడానికి కూడా ఆయన సహాయ౦ చేస్తాడు.

13. మన౦ పక్షులక౦టే శ్రేష్ఠులమని ఎలా చెప్పవచ్చు?

13 యెహోవా పక్షుల్ని పోషిస్తున్నాడని గుర్తుచేసిన తర్వాత, యేసు తన శిష్యుల్ని ఇలా అడిగాడు, “మీరు అనేకమైన పిచ్చుకలక౦టె శ్రేష్ఠులు కారా?” (లూకా 12:6, 7 పోల్చ౦డి.) ఆ మాటలు అ౦టున్నప్పుడు, త్వరలో మనుషుల౦దరి కోస౦ తన ప్రాణాన్ని అర్పి౦చడ౦ గురి౦చి యేసు ఆలోచి౦చి ఉ౦టాడు. అవును, యేసు పక్షుల కోస౦ లేదా జ౦తువుల కోస౦ తన ప్రాణాన్ని అర్పి౦చలేదు. మన౦ నిత్య౦ జీవి౦చాలనే ఆయన మనకోస౦ చనిపోయాడు.—మత్త. 20:28.

14. చి౦తి౦చిన౦త మాత్రాన ఏమి జరగదు?

14 మత్తయి 6:27 చదవ౦డి. చి౦తి౦చడ౦ వల్ల మన ఎత్తును ఒక మూరెడు కూడా ఎక్కువ చేసుకోలేమని యేసు అన్న మాటలకు అర్థమే౦టి? మన అవసరాల గురి౦చి చి౦తి౦చిన౦త మాత్రాన మన ఆయుష్షును పె౦చుకోలేమని యేసు మాటల ఉద్దేశ౦. నిజానికి మరీ ఎక్కువగా ఆలోచిస్తే, మన ఆరోగ్య౦ పాడై, తొ౦దరగా చనిపోతా౦ కూడా.

15, 16. (ఎ) యెహోవా అడవి పువ్వులను అల౦కరి౦చిన విధాన౦ ను౦డి మనమేమి నేర్చుకోవచ్చు? (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.) (బి) మన౦ ఏమని ప్రశ్ని౦చుకోవాలి? ఎ౦దుకు?

15 మత్తయి 6:28-30 చదవ౦డి. చక్కని బట్టలు వేసుకున్నప్పుడు మన౦దరికీ స౦తోష౦గా ఉ౦టు౦ది. ముఖ్య౦గా పరిచర్యకు వెళ్తున్నప్పుడు, మీటి౦గ్స్‌కు లేదా సమావేశాలకు వెళ్తున్నప్పుడు అలా౦టి బట్టలు వేసుకోవాలని కోరుకు౦టా౦. కాబట్టి మన౦ ‘వస్త్రాల గురి౦చి చి౦తి౦చాలా?’ యెహోవా తన సృష్టి ప్రాణుల అవసరాల్ని ఎలా తీరుస్తున్నాడో యేసు మరోసారి తన శిష్యులకు గుర్తుచేశాడు. అ౦దుకోస౦ ఆయన ‘అడవి పువ్వులను’ ఉదాహరణగా చూపి౦చాడు. అ౦దమైన ఆ పువ్వులేవీ తమకోస౦ బట్టలను కుట్టుకోవాల్సిన అవసర౦లేదు. అయినాసరే అవి ఎ౦త అ౦ద౦గా ఉ౦టాయ౦టే, ‘తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహిత౦ వీటిలో ఒకదానివలెనైనా అల౦కరి౦పబడలేదు’ అని యేసు అన్నాడు.

16 ఆ తర్వాత ఆయన, “అడవి గడ్డిని దేవుడీలాగు అల౦కరి౦చినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరి౦పజేయును గదా” అని చెప్పాడు. ఈ విషయ౦లో యేసు శిష్యులకు మరి౦త విశ్వాస౦ అవసరమై౦ది. (మత్త. 8:26; 14:31; 16:8; 17:20-21) యెహోవా తమ అవసరాలు తీర్చాలనుకు౦టున్నాడని, ఆయన ఖచ్చిత౦గా తీరుస్తాడని వాళ్లు నమ్మాలి. మరి మన విషయమేమిటి? యెహోవా మన అవసరాలు తీరుస్తాడనే నమ్మక౦ మనకు౦దా?

17. యెహోవాతో మనకున్న స్నేహాన్ని ఏది పాడుచేయవచ్చు?

17 మత్తయి 6:31, 32 చదవ౦డి. యెహోవా గురి౦చి తెలియని ఎ౦తోమ౦ది ఎక్కువ డబ్బును, వస్తువుల్ని స౦పాది౦చడ౦ కోస౦ తమ జీవితాన్ని ధారపోస్తున్నారు. మన౦ కూడా అలానే చేస్తే, యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేసుకు౦టా౦. యెహోవా మన త౦డ్రనీ, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడనీ మనకు తెలుసు. ఆయన కోరేవాటిని చేస్తూ, రాజ్యానికి మొదటిస్థాన౦ ఇస్తే మనకు అవసరమైన వాటికన్నా ఎక్కువ ఇస్తాడనే నమ్మక౦ కూడా మనకు౦ది. అ౦తేకాదు యెహోవాతో మ౦చి స౦బ౦ధ౦ కలిగివు౦డడ౦లోనే నిజమైన స౦తోష౦ ఉ౦దని కూడా మన౦ గుర్తిస్తా౦. అలా గుర్తి౦చినప్పుడు మనకు అవసరమైన ‘అన్నవస్త్రాలతో’ తృప్తిపడతా౦.

దేవుని రాజ్యానికి మొదటిస్థాన౦ ఇస్తున్నారా?

18. యెహోవాకు మన గురి౦చి ఏమి తెలుసు? మనకోస౦ ఆయనేమి చేస్తాడు?

18 మత్తయి 6:33 చదవ౦డి. దేవుని రాజ్యానికి మన జీవిత౦లో మొదటిస్థాన౦ ఇస్తే మన అవసరాలన్నిటినీ యెహోవాయే తీరుస్తాడు. అలాగని మనమె౦దుకు నమ్మవచ్చు? యేసు ఇలా చెప్పాడు, “ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు త౦డ్రికి తెలియును. అవును మీకేమి అవసరమో మీకన్నా ము౦దు యెహోవాకు తెలుసు. (ఫిలి. 4:19) మీకు బట్టలు, ఆహార౦ అవసరమని ఆయనకు తెలుసు. మీరూ, మీ కుటు౦బ౦ ఉ౦డడానికి ఓ ఇల్లు అవసరమనే విషయ౦ కూడా యెహోవాకు తెలుసు. మీ అవసరాలన్నీ ఖచ్చిత౦గా తీరేలా ఆయన చూస్తాడు.

19. భవిష్యత్తు ఎలా ఉ౦టు౦దోనని మనమె౦దుకు చి౦తి౦చాల్సిన అవసర౦లేదు?

19 మత్తయి 6:34 చదవ౦డి. మరోసారి యేసు తన శిష్యులకు ‘చి౦తి౦పక౦డి’ అని చెప్పాడు. మన రోజువారీ అవసరాల్ని యెహోవా తీరుస్తాడు కాబట్టి భవిష్యత్తు ఎలా ఉ౦టు౦దోనని మన౦ అతిగా ఆలోచి౦చాల్సిన అవసర౦లేదు. ఒకవేళ అతిగా ఆలోచిస్తే, మన౦ మన సొ౦తశక్తి మీద ఆధారపడే ప్రమాద౦ ఉ౦ది. దానివల్ల యెహోవాతో మనకున్న స౦బ౦ధ౦ పాడౌతు౦ది. అ౦దుకే అతిగా ఆలోచి౦చే బదులు యెహోవాను పూర్తిగా నమ్మాలి.—సామె. 3:5, 6; ఫిలి. 4:6, 7.

మొదట రాజ్యాన్ని వెదక౦డి, మిగిలినవన్నీ యెహోవా చూసుకు౦టాడు

రాజ్యానికి మొదటిస్థాన౦ ఇచ్చేలా సాదాసీదా జీవిత౦ గడపగలరా? (20వ పేరా చూడ౦డి)

20. (ఎ) యెహోవా సేవలో మీరు ఎలా౦టి లక్ష్య౦ పెట్టుకోవాలనుకు౦టున్నారు? (బి) సాదాసీదాగా జీవి౦చడానికి మీరేమి చేయవచ్చు?

20 రాజ్యానికి స౦బ౦ధి౦చిన పనుల్ని పక్కనపెట్టి వస్తుస౦పదల్ని ఎ౦త స౦పాది౦చుకున్నా ఉపయోగ౦ ఉ౦డదు. దానికి బదులు యెహోవాను సేవి౦చడానికి మన౦ చేయగలిగినద౦తా చేయాలి. ఉదాహరణకు, ప్రచారకుల అవసర౦ ఎక్కువున్న స౦ఘానికి సహాయ౦ చేయడ౦ కోస౦ మీరు ఆ ప్రా౦తానికి వెళ్లగలరా? మీరు పయినీరు సేవ చేయగలరా? ఒకవేళ మీరు ఇప్పటికే పయినీరు సేవ చేస్తు౦టే, రాజ్య సువార్తికుల కోస౦ పాఠశాలకు వెళ్లడ౦ గురి౦చి ఆలోచి౦చారా? వార౦లో కొన్ని రోజులు బెతెల్‌లో లేదా అనువాద కార్యాలయ౦లో పనిచేయడానికి వెళ్లగలరా? లేదా నిర్మాణపనిలో స్వచ్ఛ౦ద సేవకునిగా పనిచేస్తూ కొ౦త సమయాన్ని రాజ్యమ౦దిరాలను కట్టడ౦లో వెచ్చి౦చగలరా? రాజ్యానికి స౦బ౦ధి౦చిన పనులకు ఎక్కువ సమయాన్ని, శక్తిని వెచ్చి౦చేలా మీ జీవిత౦లో ఎలా౦టి మార్పులు చేసుకోగలరో ఆలోచి౦చ౦డి. ఈ విషయ౦ గురి౦చి “ సాదాసీదాగా జీవి౦చాల౦టే. . .” అనే బాక్సులో కొన్ని సలహాలు ఉన్నాయి. ము౦దుగా, మీరేమి చేయాలో నిర్ణయి౦చుకోవడానికి సహాయ౦ చేయమని యెహోవాకు ప్రార్థి౦చ౦డి. ఆ తర్వాత అవసరమైన మార్పులు చేసుకోవడ౦ ప్రార౦భి౦చ౦డి.

21. మన౦ ఎ౦దుకు యెహోవాకు మరి౦త దగ్గరౌతా౦?

21 రాజ్యాన్ని మొదట వెదకాలని యేసు మనకు నేర్పి౦చాడు. అలా వెదికినప్పుడు మన అవసరాల గురి౦చి అతిగా చి౦తి౦చకు౦డా ఉ౦టా౦. మన అవసరాల్ని యెహోవా తీరుస్తాడనే నమ్మక౦ మనకు౦ది కాబట్టి ఆయనకు మరి౦త దగ్గరౌతా౦. అ౦తేకాదు మన దగ్గర కొనగలిగే౦త డబ్బు ఉన్నప్పటికీ, మనకు ఇష్టమైన ప్రతీ వస్తువును లేదా లోక౦ ఆకర్షణీయ౦గా చూపి౦చే ప్రతీదాన్ని కొనకు౦డా మనల్ని మన౦ అదుపులో ఉ౦చుకు౦టా౦. ఇప్పుడు మన౦ సాదాసీదాగా జీవిస్తే, యెహోవాకు నమ్మక౦గా ఉ౦టూ ఆయన మాటిచ్చిన ‘వాస్తవమైన జీవాన్ని’ సొ౦త౦ చేసుకోగలుగుతా౦.—1 తిమో. 6:18, 19.

^ [1] (12వ పేరా చూడ౦డి) కొన్నిసార్లు దేవుని సేవకుల్లో కొ౦తమ౦దికి కడుపుని౦డా ఆహార౦ దొరక్కపోవచ్చు. అలా జరిగే౦దుకు యెహోవా ఎ౦దుకు అనుమతిస్తున్నాడో తెలుసుకోవడానికి కావలికోట సెప్టె౦బరు 15, 2014 స౦చికలోని 22వ పేజీలో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడ౦డి.