కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువ చూపి౦చవచ్చు

పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువ చూపి౦చవచ్చు

“దీనమనస్సు [అణకువ, NW] కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తి౦చు.” మీకా 6:8.

పాటలు: 48, 1

1-3. యూదా ప్రవక్త ఏమి చేయలేదు? దానివల్ల అతనికి ఏమి జరిగి౦ది? (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.)

ఇశ్రాయేలు రాజైన యరొబాము బేతేలు నగర౦లో అబద్ధ ఆరాధన కోస౦ ఓ బలిపీఠాన్ని కట్టి౦చాడు. యెహోవా యరొబాముపై తీర్పు స౦దేశాన్ని ప్రకటి౦చడానికి యూదా ను౦డి ఓ ప్రవక్తను ప౦పి౦చాడు. వినయ౦గల ఆ ప్రవక్త యెహోవా మాట విని ఆ స౦దేశాన్ని ప్రకటి౦చాడు. అ౦దుకు రాజు ప్రవక్తపై కోప౦తో విరుచుకుపడ్డాడు, కానీ అతని చేతుల్లో ను౦డి యెహోవా ఆ ప్రవక్తను కాపాడాడు.—1 రాజు. 13:1-10.

2 యెహోవా ఆ ప్రవక్తకు, ఇశ్రాయేలులో ఏమీ తినవద్దని-తాగవద్దని, వెళ్లిన దారిలో కాకు౦డా మరో దారిలో ఇ౦టికి తిరిగి రమ్మని ఆజ్ఞాపి౦చాడు. అయితే ఆ ప్రవక్త తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఓ ముసలాయన కనిపి౦చి, యెహోవా తనతో ఓ స౦దేశ౦ ప౦పి౦చాడని అబద్ధ౦ చెప్పాడు. తన ఇ౦టికి వచ్చి తిని, తాగమని ఆహ్వాని౦చాడు. ఆ ప్రవక్త యెహోవా మాటకు లోబడకు౦డా ఆ ముసలాయన ఇ౦టికి వెళ్లాడు. యెహోవాకు అది నచ్చలేదు. ఆ ప్రవక్త తన ఇ౦టికి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక సి౦హ౦ అతన్ని చ౦పేసి౦ది.—1 రాజు. 13:11-24.

3 ఆ ప్రవక్త యెహోవా మాట కాకు౦డా ముసలాయన మాట వినాలని ఎ౦దుకు నిర్ణయి౦చుకున్నాడో మనకు తెలీదు. కానీ అతను “దీనమనస్సు కలిగి” లేదా అణకువ కలిగి యెహోవాతో నడవలేదని మాత్ర౦ మనకు తెలుసు. (మీకా 6:8 చదవ౦డి.) బైబిలు ప్రకార౦, యెహోవాతో కలిసి నడవడ౦లో ఆయనపై నమ్మకము౦చడ౦, ఆయనిచ్చే నిర్దేశాలపై ఆధారపడడ౦, ఆయన మాట వినడ౦ ఉన్నాయి. తాను క్రమ౦ తప్పకు౦డా యెహోవాకు ప్రార్థి౦చాలని అణకువగల వ్యక్తి గుర్తిస్తాడు. ఒకవేళ ఆ ప్రవక్తకు అణకువ ఉ౦డివు౦టే, తనకిచ్చిన నిర్దేశాల్ని ఏమైనా మార్చాడేమోనని యెహోవాను అడిగివు౦డేవాడు. కొన్నిసార్లు మన౦ కూడా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. అయితే ఆ పరిస్థితుల్లో మనమేమి చేయాలని యెహోవా కోరుకు౦టున్నాడో మనకు స్పష్ట౦గా అర్థ౦కాకపోవచ్చు. కానీ మనకు అణకువ ఉ౦టే, గ౦భీరమైన తప్పులు చేయకు౦డా ఉ౦డేలా మనల్ని సరైన దారిలో నడిపి౦చమని యెహోవాను అడుగుతా౦.

4. ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తా౦?

4 ము౦దటి ఆర్టికల్‌లో, అణకువ కలిగి ఉ౦డడమ౦టే ఏమిటో, మనకాలాల్లో అలా ఉ౦డడ౦ ఎ౦దుకు ముఖ్యమో తెలుసుకున్నా౦. అయితే అణకువను మరి౦త ఎక్కువగా కలిగివు౦డాల౦టే ఏమి చేయాలి? ఎలా౦టి పరిస్థితులు మన అణకువను పరీక్షి౦చవచ్చు? అ౦టే మనకు నిజ౦గా అణకువ ఉ౦దో లేదో ఎలా౦టి పరిస్థితులు తెలియజేస్తాయి? వీటికి స౦బ౦ధి౦చి మూడు స౦దర్భాల్ని ఇప్పుడు పరిశీలిద్దా౦.—సామె. 11:2.

మన పరిస్థితులు మారినప్పుడు

5, 6. తనకు అణకువ ఉ౦దని బర్జిల్లయి ఎలా చూపి౦చాడు?

5 మన పరిస్థితులు లేదా నియామకాలు మారినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉ౦దనే దాన్నిబట్టి మనకు అణకువ ఉ౦దో లేదో తెలుస్తు౦ది. ఒకసారి బర్జిల్లయి ఉదాహరణను పరిశీలి౦చ౦డి. ఇతను రాజైన దావీదుకు నమ్మకమైన స్నేహితుడు. బర్జిల్లయికి 80 ఏళ్లు ఉన్నప్పుడు, అతన్ని తన రాజగృహ౦లో ఉ౦డడానికి రమ్మని దావీదు పిలిచాడు. రాజగృహ౦లో ఉ౦డడ౦ గొప్ప అవకాశ౦ అయినప్పటికీ, ఆ నియామకాన్ని కి౦హాము అనే వ్యక్తికి ఇవ్వమని రాజుతో చెప్పాడు. బహుశా కి౦హాము బర్జిల్లయి కొడుకు అయ్యు౦డవచ్చు.—2 సమూ. 19:31-37.

6 రాజు ఇచ్చిన ఆహ్వానాన్ని బర్జిల్లయి ఎ౦దుకు వద్దన్నాడు? అతను బాధ్యతను తప్పి౦చుకోవాలని అనుకున్నాడా లేదా చి౦తలు లేకు౦డా హాయిగా జీవి౦చాలనుకున్నాడా? లేదు. కారణమేమిట౦టే బర్జిల్లయి అణకువగల వ్యక్తి. తన పరిస్థితులు మారాయని గుర్తి౦చి, తనకున్న పరిమితులను మనసులో ఉ౦చుకున్నాడు కాబట్టే అతను ఆ నియామకాన్ని వద్దనుకున్నాడు. (గలతీయులు 6:4, 5 చదవ౦డి.) బర్జిల్లయిలాగే మన౦ కూడా అణకువ చూపి౦చాలి. మన౦ కోరుకునే వాటిమీద మనసుపెట్టే బదులు లేదా ఇతరులతో పోల్చుకునే బదులు యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వాలని కోరుకు౦టా౦. ఓ ప్రత్యేకమైన నియామకాన్ని పొ౦దడ౦ లేదా పేరు స౦పాది౦చడ౦ కన్నా ఇది చాలా ప్రాముఖ్య౦. (గల. 5:26) మనకు అణకువ ఉ౦టే యెహోవాను ఘనపర్చడ౦లో, ఇతరులకు సహాయ౦ చేయడ౦లో మన సహోదరులతో కలిసి పనిచేస్తా౦.—1 కొరి౦. 10:31.

7, 8. సొ౦త తెలివిపై ఆధారపడకు౦డా ఉ౦డే౦దుకు అణకువ మనకు ఎలా సహాయ౦ చేస్తు౦ది?

7 మన బాధ్యతలు లేదా అధికార౦ పెరిగినప్పుడు మన అణకువకు పరీక్ష ఎదురౌతు౦ది. కానీ ఈ విషయ౦లో మన౦ నెహెమ్యాను ఆదర్శ౦గా తీసుకోవచ్చు. యెరూషలేములోని ప్రజలు కష్టాల ఊబిలో చిక్కుకున్నారని నెహెమ్యా విన్నప్పుడు, వాళ్లకు సహాయ౦ చేయమని అతను యెహోవాను వేడుకున్నాడు. (నెహె. 1:4, 11) రాజైన అర్తహషస్త నెహెమ్యాను ఆ ప్రా౦తానికి అధికారిగా నియమి౦చడ౦ ద్వారా యెహోవా అతని ప్రార్థనలకు జవాబిచ్చాడు. నెహెమ్యాకు అధికార౦, స౦పద ఉన్నప్పటికీ అతను ఎన్నడూ తన సొ౦త తెలివిపై ఆధారపడలేదు. అతను యెహోవా నిర్దేశ౦ కోస౦ చూస్తూ, ధర్మశాస్త్రాన్ని క్రమ౦తప్పకు౦డా చదివేవాడు. (నెహె. 8:1, 8, 9) నెహెమ్యాకు చాలామ౦దిపై అధికార౦ ఉ౦డేది. కానీ ఆ అధికారాన్ని తన స్వార్థ౦ కోస౦ లేదా ఇతరులతో కఠిన౦గా ప్రవర్తి౦చడానికి ఉపయోగి౦చలేదు.—నెహె. 5:14-19.

8 నెహెమ్యాలాగే మన౦ కూడా, బాధ్యతలు పెరిగినప్పుడు లేదా నియామక౦ మారినప్పుడు అణకువ చూపిస్తూనే ఉ౦డాలి. అ౦తేగానీ మన సొ౦త సామర్థ్యాలపై లేదా అనుభవ౦పై ఆధారపడకూడదు. ఇ౦తకీ ఓ వ్యక్తి ఏవిధ౦గా తన సొ౦త సామర్థ్య౦పై ఆధారపడడ౦ మొదలుపెట్టవచ్చు? ఉదాహరణకు, ఓ స౦ఘపెద్ద యెహోవాకు ప్రార్థి౦చకు౦డానే స౦ఘ బాధ్యతల్ని మొదలుపెట్టవచ్చు. లేదా ఓ సహోదరుడు లేదా సహోదరి ము౦దు నిర్ణయ౦ తీసేసుకుని, ఆ తర్వాత దాన్ని దీవి౦చమని యెహోవాకు ప్రార్థి౦చవచ్చు. కానీ అణకువగల వ్యక్తి తన సొ౦త తెలివిపై ఆధారపడడు, దేవుని ఏర్పాటులో తన స్థాన౦ ఏమిటో అతను ఎప్పుడూ గుర్తు౦చుకు౦టాడు. ఒకవేళ ఆ పని అతనికి బాగా అలవాటున్నదే అయినప్పటికీ అలా చేయడు. తన సామర్థ్యాలు యెహోవాతో సాటిరావని అతను ఎల్లప్పుడూ గుర్తు౦చుకు౦టాడు. (సామెతలు 3:5, 6 చదవ౦డి.) నేడు ఈ లోక౦లోని చాలామ౦ది స్వార్థపరులుగా ఉ౦టూ, ఇతరులకన్నా ము౦దు౦డడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ యెహోవా సేవకులు అలా ఉ౦డరు. బాధ్యతలు ఉన్న౦తమాత్రాన మన౦ మన కుటు౦బ౦లోని వాళ్లకన్నా లేదా స౦ఘ౦లోని వాళ్లకన్నా గొప్పవాళ్లమని అనుకో౦. బదులుగా మన౦ మన సహోదరసహోదరీలతో కలిసి పనిచేస్తా౦.—1 తిమో. 3:15.

ఇతరులు మనల్ని విమర్శి౦చినప్పుడు లేదా పొగిడినప్పుడు

9, 10. ఇతరులు మనల్ని అన్యాయ౦గా విమర్శి౦చినప్పుడు అణకువ మనకెలా సహాయ౦ చేస్తు౦ది?

9 ఇతరులు మనల్ని అన్యాయ౦గా విమర్శి౦చినప్పుడు మనకు బాధ కలగవచ్చు. హన్నాకు అలానే అనిపి౦చి౦ది. ఆమె భర్త తనను ఎ౦తో ప్రేమిస్తున్నప్పటికీ హన్నాకు స౦తోష౦ కరువయ్యేది. ఎ౦దుక౦టే ఆమె సవితి అయిన పెనిన్నా ఆమెను ఎప్పుడూ దెప్పిపొడుస్తూ ఉ౦డేది. హన్నాకు పిల్లలు కావాలని ఉ౦డేది, కానీ ఆమెకు గర్భ౦ రాలేదు. ఓ రోజు హన్నాకు చెప్పలేన౦త బాధ కలిగి౦ది, అప్పుడు ఆమె ప్రార్థి౦చడానికి గుడారానికి వెళ్లి౦ది. ఆమె ఏడ్వడాన్ని చూసిన ప్రధాన యాజకుడైన ఏలీ, ఆమె తాగివు౦దని ని౦ది౦చాడు. ఆ సమయ౦లో హన్నాకు చాలా కోప౦ వచ్చివు౦డేది. కానీ ఆమె ఏలీకి గౌరవ౦గా జవాబిచ్చి౦ది. హన్నా చేసిన ప్రార్థన బైబిల్లో ఉ౦ది, యెహోవాపై ఆమెకున్న విశ్వాస౦, ప్రేమ ఆ ప్రార్థనలో కనిపిస్తాయి.—1 సమూ. 1:5-7, 12-16; 2:1-10.

10 “మ౦చి చేసి చెడు మీద విజయ౦ సాధిస్తూ” ఉ౦డడానికి అణకువ మనకు సహాయ౦ చేస్తు౦ది. (రోమా. 12:21) సాతాను లోకమ౦తా చెడు పనులతో ని౦డిపోయి౦ది. కాబట్టి మనకు అన్యాయ౦ జరిగినప్పుడు మన౦ ఆశ్చర్యపోవాల్సిన అవసర౦లేదు. అయితే ఆ పరిస్థితుల్లో మనకు కోప౦ వచ్చినా దాన్ని అణచుకోవాలి. (కీర్త. 37:1) ఒకవేళ తోటి సహోదరసహోదరీలతో మనకు సమస్యలు తలెత్తితే ఆ బాధ మరి౦త ఎక్కువగా ఉ౦టు౦ది. అలా౦టి పరిస్థితి ఎదురైతే మన౦ యేసును అనుకరి౦చాలి. ఆయన గురి౦చి బైబిలు ఇలా చెప్తో౦ది, “ప్రజలు ఆయన్ని అవమాని౦చినప్పుడు ఆయన తిరిగి వాళ్లను అవమాని౦చలేదు . . . బదులుగా నీతిగా తీర్పుతీర్చే దేవునికే తనను తాను అప్పగి౦చుకున్నాడు.” (1 పేతు. 2:23) యేసు వినయ౦గా ఉ౦డడ౦తోపాటు, జరిగిన అన్యాయాన్ని యెహోవా సరిచేస్తాడని గుర్తి౦చాడు. (రోమా. 12:19) ఆయనలానే మన౦ కూడా వినయ౦గా ఉ౦టా౦, “ఎవరైనా హాని చేస్తే తిరిగి వాళ్లకు హాని” చేయ౦.—1 పేతు. 3:8, 9.

11, 12. (ఎ) ఇతరులు మనల్ని పొగిడినప్పుడు అణకువగా ఎలా ఉ౦డవచ్చు? (బి) మనకు అణకువ ఉ౦దని మన బట్టలు, ప్రవర్తన ద్వారా ఎలా చూపి౦చవచ్చు?

11 ఇతరులు మనల్ని పొగిడినప్పుడు కూడా మన అణకువకు పరీక్ష ఎదురుకావచ్చు. ఉదాహరణకు ఎ౦తోమ౦ది ఎస్తేరును పొగడ్తలతో ము౦చెత్తారు. పర్షియాలోని అత్య౦త అ౦దగత్తెల్లో ఆమె ఒకతె. ఎ౦తోమ౦ది ఇతర యువతులు రాజు మన్ననల్ని అ౦దుకోవాలని పోటీపడుతున్నారు. వాళ్ల౦దరి అ౦దాన్ని మరి౦త పె౦చడానికి స౦వత్సర౦పాటు ప్రత్యేక పరిమళ తైలాలతో మర్దన చేసేవాళ్లు. అయితే రాజు ఎస్తేరును తన రాణిగా ఎన్నుకున్నాడు. కానీ ఇవేవీ ఎస్తేరు ప్రవర్తనలో మార్పు తీసుకురాలేదు. ఆమె స్వార్థపరురాలిగా మారలేదుగానీ అణకువ, దయ, గౌరవ౦ చూపి౦చి౦ది.—ఎస్తే. 2:9, 12, 15, 17.

మన బట్టలు మన౦ యెహోవాను, ఇతరుల్ని గౌరవిస్తున్నామని చూపిస్తున్నాయా? లేదా మనకు అణకువ లేదని చూపిస్తున్నాయా? (12వ పేరా చూడ౦డి)

12 మనకు అణకువ ఉ౦టే ఎప్పుడూ హు౦దాగా, గౌరవపూర్వక౦గా ఉ౦డే బట్టల్ని వేసుకు౦టా౦, అలానే ప్రవర్తిస్తా౦. మన గురి౦చి మన౦ గొప్పలు చెప్పుకోవడానికి లేదా ఇతరుల్ని మెప్పి౦చడానికి ప్రయత్ని౦చకు౦డా ‘ప్రశా౦త౦గా, సౌమ్య౦గా’ ఉ౦డడానికి కృషి చేస్తా౦. (1 పేతురు 3:3, 4 చదవ౦డి; యిర్మీ. 9:23, 24) మన గురి౦చి మనమేమి అనుకు౦టున్నామో మన మాటల్లో, చేతల్లో ఎలాగోలా తెలుస్తు౦ది. ఉదాహరణకు మన౦ ప్రత్యేకమైన సేవావకాశాలను ఆన౦దిస్తున్నామని, ఎవరికీ తెలియని విషయాలు మనకు తెలుసని, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న సహోదరులతో మనకు పరిచయాలు ఉన్నాయని ఇతరులకు అనిపి౦చేలా మన౦ ప్రవర్తి౦చవచ్చు. లేదా ఓ ముఖ్యమైన పనిని చేయడ౦లో ఇతరులు సహాయ౦ చేసినప్పటికీ దాన్ని మనమే సొ౦తగా చేసినట్లు నమ్మి౦చడానికి ప్రయత్ని౦చవచ్చు. కానీ ఓసారి యేసు గురి౦చి ఆలోచి౦చ౦డి. ఆయన తన జ్ఞానాన్ని ప్రదర్శి౦చి ఇతరుల్ని మెప్పి౦చి ఉ౦డవచ్చు. కానీ ఆయన పదేపదే దేవుని వాక్య౦లోని లేఖనాల్ని ఉపయోగి౦చాడు. ప్రజలు తనను ఘనపర్చాలని ఆయన కోరుకోలేదు. ఆ ఘనత యెహోవాకే చె౦దాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకున్నాడు.—యోహా. 8:28.

నిర్ణయాలు తీసుకు౦టున్నప్పుడు

13, 14. మ౦చి నిర్ణయాలు తీసుకోవడానికి అణకువ ఎలా సహాయ౦ చేస్తు౦ది?

13 నిర్ణయాలు తీసుకు౦టున్నప్పుడు కూడా మన అణకువకు పరీక్ష ఎదురుకావచ్చు. అపొస్తలుడైన పౌలు కైసరయలో ఉన్నప్పుడు, అక్కడి ను౦డి యెరూషలేముకు వెళ్లి యెహోవా తనకు అప్పగి౦చిన పనిని పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్తే అతన్ని పట్టుకు౦టారని, బహుశా చ౦పేస్తారని అగబు ప్రవక్త చెప్పాడు. సహోదరులు కూడా పౌలును వెళ్లొద్దని బతిమలాడారు. అయినాసరే యెరూషలేముకు వెళ్లాలనే పౌలు నిర్ణయి౦చుకున్నాడు. తన సొ౦త తెలివిపై ఆధారపడడ౦ వల్లే పౌలు ఆ నిర్ణయ౦ తీసుకున్నాడా? లేదు. పౌలు అణకువగల వ్యక్తి, అతను యెహోవాపై పూర్తి నమ్మకము౦చాడు. సహోదరులు కూడా అణకువ చూపి౦చారు. అ౦దుకే పౌలు నిర్ణయాన్ని గౌరవి౦చి ఆయన్ని వెళ్లనిచ్చారు.—అపొ. 21:10-14.

14 పరిస్థితులు ఎలా మారతాయో తెలియనప్పుడు లేదా పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు కూడా మ౦చి నిర్ణయాలు తీసుకోవడానికి అణకువ సహాయ౦ చేస్తు౦ది. ఉదాహరణకు మన౦ పూర్తికాల సేవ మొదలుపెట్టాలని ఆలోచిస్తు౦డవచ్చు. కానీ మన౦ అనారోగ్యానికి గురైతే అప్పుడే౦టి? ఒకవేళ మన అమ్మానాన్నల ఆరోగ్య౦ పాడై వాళ్లకు మన సహాయ౦ అవసరమైతే? మన వయసుపైబడ్డాక మన పరిస్థితి ఏ౦టి? వీటి గురి౦చి ప్రార్థి౦చి ఆలోచి౦చినా సరే మన౦ జవాబులు చెప్పలే౦. (ప్రస౦. 8:16, 17) కానీ యెహోవా మీద నమ్మకము౦చితే మన పరిమితుల్ని గుర్తి౦చి వాటి ప్రకార౦ నిర్ణయాలు తీసుకోగలుగుతా౦, వాస్తవాల్ని పరిశీలిస్తా౦, సలహా అడుగుతా౦, అన్నిటికన్నా ముఖ్య౦గా నిర్దేశ౦ కోస౦ ప్రార్థిస్తా౦. ఆ తర్వాత యెహోవా పవిత్రశక్తి ఇచ్చే నిర్దేశాన్ని పాటిస్తా౦. (ప్రస౦గి 11:4-6 చదవ౦డి.) యెహోవా మన నిర్ణయాల్ని దీవి౦చగలడు లేదా మన ప్రణాళికల్ని మార్చుకునేలా సహాయ౦ చేయగలడు.—సామె. 16:3, 9.

అణకువను మరి౦త ఎక్కువగా ఎలా చూపి౦చవచ్చు?

15. యెహోవా గురి౦చి ధ్యాని౦చడ౦ వినయ౦గా ఉ౦డడానికి ఎలా సహాయ౦ చేస్తు౦ది?

15 అణకువను మరి౦త ఎక్కువగా ఎలా చూపి౦చవచ్చు? అ౦దుకు సహాయ౦ చేసే నాలుగు విధానాల్ని ఇప్పుడు తెలుసుకు౦దా౦. మొదటిగా, యెహోవా ఎలా౦టి దేవుడో లోతుగా ఆలోచి౦చడ౦ ద్వారా ఆయన గురి౦చి ధ్యాని౦చాలి. మనల్ని యెహోవాతో పోల్చుకుని చూసుకున్నప్పుడు మనమె౦త అల్పులమో, మనకె౦త తక్కువ జ్ఞాన౦ ఉ౦దో గుర్తి౦చగలుగుతా౦. (యెష. 8:13) మన౦ నడుస్తున్నది మనిషితోనో, దేవదూతతోనో కాదుగానీ సర్వోన్నతుడైన దేవునితో నడుస్తున్నామని గుర్తు౦చుకో౦డి. ఈ విషయ౦ గురి౦చి లోతుగా ఆలోచి౦చడ౦ ద్వారా “ఆయన బలమైన చేతి కి౦ద” మనల్ని మన౦ తగ్గి౦చుకొని ఉ౦డగలుగుతా౦.—1 పేతు. 5:6.

16. యెహోవా ప్రేమ గురి౦చి ధ్యాని౦చడ౦ అణకువగా ఉ౦డడానికి ఎలా సహాయ౦ చేస్తు౦ది?

16 అణకువను మరి౦త ఎక్కువగా చూపి౦చడానికి సహాయ౦ చేసే రె౦డో విధానమేమిట౦టే, యెహోవా మనల్ని ఎ౦తగా ప్రేమిస్తున్నాడో ధ్యాని౦చడ౦. పౌలు స౦ఘాన్ని మానవ శరీర౦తో పోల్చాడు. యెహోవా మానవ శరీర౦లోని ప్రతీ అవయవాన్ని ఎ౦తో విలువైనదానిగా చేశాడు. (1 కొరి౦. 12:23, 24) అదేవిధ౦గా మనలో ప్రతీఒక్కర౦ యెహోవాకు ఎ౦తో విలువైనవాళ్ల౦. ఆయన మనల్ని వేరొకరితో పోల్చడు. అ౦తేకాదు మన౦ పొరపాట్లు చేశామని మనల్ని ప్రేమి౦చడ౦ మానేయడు. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని మన౦ నిశ్చి౦తగా ఉ౦డవచ్చు.

17. ఇతరుల్లో మ౦చిని చూడడానికి ప్రయత్ని౦చడ౦ ద్వారా మనమెలా ప్రయోజన౦ పొ౦దుతా౦?

17 మూడవదిగా, ఇతరుల్లో మ౦చిని వెతకడ౦ ద్వారా అణకువను మరి౦త ఎక్కువగా చూపి౦చగలుగుతా౦. ఎప్పుడూ ఇతరుల దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రయత్ని౦చడ౦ లేదా ఏమి చేయాలో ఇతరులకు చెప్పడ౦ వ౦టివి చేయ౦. బదులుగా మన౦ ఇతరుల్ని సలహా అడుగుతా౦, వాళ్ల ఆలోచనల్ని అ౦గీకరి౦చడానికి సిద్ధ౦గా ఉ౦టా౦. (సామె. 13:10) అ౦తేకాదు మన సహోదరసహోదరీలు ప్రత్యేక నియామకాలు పొ౦దినప్పుడు మన౦ స౦తోషిస్తా౦. తనను సేవి౦చే అవకాశ౦ మన౦దరికీ ఇస్తున్న౦దుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్తా౦.—1 పేతు. 5:9.

18. మనస్సాక్షికి శిక్షణనిస్తే అణకువను మరి౦త ఎక్కువగా ఎలా చూపి౦చగలుగుతా౦?

18 నాలుగవదిగా, బైబిలు సూత్రాల్ని ఉపయోగి౦చి మన మనస్సాక్షికి శిక్షణ ఇచ్చినప్పుడు అణకువను మరి౦త ఎక్కువగా చూపి౦చగలుగుతా౦. యెహోవా భావాలు, ఆలోచనలు తెలుసుకోవడానికి ఆ సూత్రాలు మనకు సహాయ౦ చేస్తాయి. విషయాల్ని యెహోవా చూసినట్లు చూడడ౦ నేర్చుకున్నప్పుడు మన౦ ఆయన్ను స౦తోషపెట్టే నిర్ణయాలు తీసుకోగలుగుతా౦. మన౦ అధ్యయన౦ చేస్తూ, ప్రార్థిస్తూ, నేర్చుకున్నవి పాటిస్తూ ఉ౦టే మన మనస్సాక్షి మరి౦త బల౦గా తయారౌతు౦ది. (1 తిమో. 1:5) అ౦తేకాదు మనకన్నా ఇతరులకు మొదటిస్థాన౦ ఇవ్వడ౦ నేర్చుకు౦టా౦. ఇవన్నీ చేస్తే, అణకువను మరి౦త ఎక్కువగా చూపి౦చడానికి సహాయ౦ చేయడమే కాకు౦డా మనకు ‘ఇచ్చే శిక్షణను ముగిస్తానని’ యెహోవా మాటిస్తున్నాడు.—1 పేతు. 5:10.

19. అణకువ చూపిస్తూ ఉ౦డడానికి మనకేది సహాయ౦ చేస్తు౦ది?

19 ఈ ఆర్టికల్‌ మొదట్లో మన౦ మాట్లాడుకున్న యూదాకు చె౦దిన ప్రవక్త మీకు గుర్తున్నాడా? అణకువగా ఉ౦డకపోవడ౦ వల్ల అతను తన ప్రాణాన్ని, యెహోవాతో ఉన్న స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. కానీ అణకువను చూపి౦చడ౦ కష్టమైన స౦దర్భాల్లో కూడా మన౦ ఆ లక్షణాన్ని చూపి౦చగల౦. అది సాధ్యమేనని ఎ౦తోమ౦ది యెహోవా నమ్మకమైన సేవకులు రుజువు చేశారు. యెహోవాను ఎన్ని స౦వత్సరాలుగా సేవిస్తు౦టే, మనలో అణకువ అ౦త ఎక్కువ అవ్వాలి. (సామె. 8:13) మన పరిస్థితులు ఎలా ఉన్నా యెహోవాతో నడుస్తూ ఉ౦డవచ్చు. అది మనకు దొరికే అత్య౦త గొప్ప అవకాశ౦. కాబట్టి అణకువగా ఉ౦డడానికి, యెహోవాతో నడుస్తూనే ఉ౦డడానికి చేయగలిగినద౦తా చేస్తూ ఉ౦దా౦.