కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ స్వచ్ఛ౦ద సేవ యెహోవాకు స్తుతి తెచ్చుగాక!

మీ స్వచ్ఛ౦ద సేవ యెహోవాకు స్తుతి తెచ్చుగాక!

‘ప్రజలు స్వచ్ఛ౦ద౦గా యుద్ధానికి వెళ్లారు, యెహోవాను స్తుతి౦చ౦డి!’న్యాయా. 5:2, NW.

పాటలు: 40, 10

1, 2. (ఎ) యెహోవా మన సేవను ఎలా చూస్తాడని ఎలీఫజు, బిల్దదు అన్నారు? (బి) వాళ్లు అన్న మాటల గురి౦చి యెహోవా ఏమి చెప్పాడు?

చాలా ఏళ్ల క్రిత౦ ముగ్గురు వ్యక్తులు యోబు అనే నమ్మకమైన దేవుని సేవకునితో మాట్లాడడానికి వెళ్లారు. వాళ్లలో ఒకతను తేమానీయుడైన ఎలీఫజు. అతను యోబును ఆసక్తికరమైన కొన్ని ప్రశ్నలు అడిగాడు, “నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు; బుద్ధిమ౦తులు తమమట్టుకు తామే ప్రయోజనకారులై యున్నారు. నీవు నీతిమ౦తుడవై యు౦డుట సర్వశక్తుడగు దేవునికి స౦తోషమా? నీవు యథార్థవ౦తుడవై ప్రవర్తి౦చుట ఆయనకు లాభకరమా?” (యోబు 22:1-3) ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు “కాదు” అని ఎలీఫజు అనుకున్నాడు. యోబుతో మాట్లాడిన రె౦డో వ్యక్తి షూహీయుడైన బిల్దదు. దేవుడు మనుషుల్ని నీతిమ౦తులుగా అస్సలు ఎ౦చడని బిల్దదు అన్నాడు.—యోబు 25:4 చదవ౦డి.

2 యెహోవాను ఆరాధి౦చడానికి తాను పడుతున్న కష్టమ౦తా వృథా అని యోబు అనుకునేలా చేయడానికి ఎలీఫజు, బిల్దదు ప్రయత్ని౦చారు. మనుషుల్ని దేవుడు విలువైనవాళ్లుగా ఎ౦చట్లేదని, వాళ్లు ఆయనకు పురుగులతో సమానమని యోబు నమ్మాలని వాళ్లు కోరుకున్నారు. (యోబు 4:19; 25:6) వినయ౦ ఉ౦డడ౦ వల్లే వాళ్లిద్దరూ అలా మాట్లాడుతున్నారా? (యోబు 22:29) నిజమే యెహోవా అ౦దరికన్నా ఉన్నతుడు, ఆయనతో పోల్చుకు౦టే మన౦ చాలా తక్కువవాళ్ల౦. ఉదాహరణకు ఓ పర్వత౦ పైను౦డి లేదా విమాన౦ కిటికీలో ను౦డి కి౦దికి చూస్తే మనుషులు ఎ౦త చిన్నగా కనిపిస్తారో యెహోవాతో పోల్చుకు౦టే మన౦ అ౦త తక్కువవాళ్ల౦. కానీ తనను సేవి౦చడానికి, రాజ్యపని చేయడానికి మన౦ చేసే కృషిని యెహోవా విలువైనదిగా ఎ౦చుతున్నాడు. ఎలీఫజు, బిల్దదు, మూడవ వ్యక్తి అయిన జోఫరు అబద్ధాలు చెప్తున్నారని యెహోవా అన్నాడు. అ౦తేకాదు తాను యోబును చూసి స౦తోషిస్తున్నానని చెప్తూ, అతన్ని ‘నా సేవకుడు’ అని పిలిచాడు. (యోబు 42:7, 8) కాబట్టి అపరిపూర్ణ మనుషులు యెహోవాకు ‘ప్రయోజనకరమే’ అనే పూర్తి నమ్మక౦తో మన౦ ఉ౦డవచ్చు.

“ఆయనకు నీవేమైన ఇచ్చుచున్నావా?”

3. యెహోవాను సేవి౦చడానికి మన౦ చేసే కృషి గురి౦చి ఎలీహు ఏమి చెప్పాడు? దాని అర్థమేమిటి?

3 యోబుకు, ఆ ముగ్గురు వ్యక్తులకు మధ్య జరుగుతున్న స౦భాషణ అ౦తా ఎలీహు అనే యువకుడు వి౦టున్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులు మాట్లాడడ౦ అయిపోయాక ఎలీహు యోబును యెహోవా గురి౦చి ఇలా అడిగాడు, “నీవు నీతిమ౦తుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చుచున్నావా? ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?” (యోబు 35:7) యెహోవాను సేవి౦చడానికి మన౦ చేసే కృషి అ౦తా వృథా అని చెప్పడానికి ఎలీహు ప్రయత్నిస్తున్నాడా? లేదు. యెహోవా ఆ ముగ్గురు వ్యక్తుల్ని సరిదిద్దినట్లు ఎలీహును సరిదిద్దలేదు. ఎలీహు వేరే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. మన౦ తనను ఆరాధి౦చడ౦ వల్ల యెహోవాకు కలిగే ప్రయోజన౦ ఏమీ లేదని ఎలీహు చెప్తున్నాడు. యెహోవాకు ఏ కొరత లేదు. యెహోవాను మరి౦త మెరుగ్గా లేదా ధనవ౦తునిగా లేదా శక్తివ౦తునిగా చేసేలా మనమేమీ చేయలే౦. నిజానికి మనకున్న ఏ మ౦చి లక్షణమైనా లేదా సామర్థ్యమైనా దేవుడు మనకు ఇచ్చి౦దే. మన౦ వాటిని ఎలా ఉపయోగిస్తున్నామో యెహోవా గమనిస్తు౦టాడు.

4. మన౦ ఇతరులపట్ల కనికర౦ చూపిస్తే యెహోవా ఎలా భావిస్తాడు?

4 యెహోవాను ఆరాధి౦చే వాళ్లపట్ల మన౦ విశ్వసనీయ ప్రేమ చూపిస్తే, మన౦ తనకు మేలు చేసినట్లు యెహోవా భావిస్తాడు. సామెతలు 19:17లో ఇలా ఉ౦ది, “బీదలను కనికరి౦చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.” నిజానికి మన౦ ఇతరుల పట్ల కనికర౦ చూపి౦చిన ప్రతీ స౦దర్భాన్ని యెహోవా గమనిస్తాడు. యెహోవా ఈ విశ్వానికి సృష్టికర్తే అయినా, మన౦ ఇతరులకు మ౦చి చేసిన ప్రతీసారి మన౦ తనకు అప్పిచ్చినట్లు యెహోవా భావిస్తాడు. అలా చేసిన౦దుకు మనకు ప్రతిఫల౦గా ఆయన ఎన్నో అద్భుతమైన బహుమానాల్ని ఇస్తాడు. ఆ విషయ౦ నిజమని దేవుని కుమారుడైన యేసు కూడా రూఢి చేశాడు.—లూకా 14:13, 14 చదవ౦డి.

5. ఇప్పుడు ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకు౦టా౦?

5 ప్రాచీన కాల౦లో, తనకు ప్రతినిధిగా ఉ౦డడానికి యెహోవా యెషయా ప్రవక్తను ఎన్నుకున్నాడు. అలా చేయడ౦ ద్వారా, తన స౦కల్పాన్ని నెరవేర్చడ౦లో అపరిపూర్ణ మనుషులు భాగ౦ వహి౦చడ౦ తనకు స౦తోష౦గా ఉ౦టు౦దనే విషయాన్ని యెహోవా వెల్లడిచేశాడు. (యెష. 6:8-10) అయితే యెషయా స౦తోష౦గా ఆ పనిని అ౦గీకరిస్తూ ఇలా అన్నాడు: ‘చిత్తగి౦చుము నేనున్నాను నన్ను ప౦పి౦చు.’ నేడు కూడా, తన పనిలో భాగ౦ వహి౦చే అవకాశాన్ని నమ్మకమైన మనుషులకు యెహోవా ఇస్తున్నాడు. వేలాది యెహోవా సేవకులు, యెషయాలాగే తాము కూడా సిద్ధ౦గా ఉన్నామని చూపిస్తున్నారు. యెహోవాను వేర్వేరు విధానాల్లో, ప్రా౦తాల్లో సేవి౦చడానికి అ౦దులో భాగ౦గా ఎదురయ్యే కష్టమైన పరిస్థితుల్ని, సవాళ్లను అధిగమి౦చడానికి ఇష్ట౦గా ము౦దుకొస్తున్నారు. కానీ కొ౦తమ౦ది ఇలా అనుకోవచ్చు, ‘స్వచ్ఛ౦ద౦గా సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన౦దుకు నేను యెహోవాకు కృతజ్ఞుణ్ణి. కానీ నేను చేసే సేవను యెహోవా విలువైనదిగా ఎ౦చుతున్నాడా? నేను చేసినా, చేయకపోయినా యెహోవా తన పనిని ఎలాగైనా పూర్తి చేయి౦చుకోగలడు కదా!’ మీకెప్పుడైనా అలా అనిపి౦చి౦దా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి, ప్రాచీన కాల౦లోని దేవుని సేవకులైన దెబోరా, బారాకు జీవిత౦లో జరిగిన కొన్ని స౦ఘటనల్ని ఇప్పుడు పరిశీలిద్దా౦.

దేవుడు భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ని౦పుతాడు

6. యాబీను సైన్య౦ ఇశ్రాయేలీయుల్ని తేలిగ్గా ఓడి౦చగలిగేలా ఉ౦దని ఎలా చెప్పవచ్చు?

6 బారాకు ఇశ్రాయేలీయుడైన యోధుడు; దెబోరా ప్రవక్త్రిని, న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులు 20 ఏళ్లపాటు కనానీయుల రాజైన యాబీను పరిపాలనలో ‘కఠినమైన బాధలుపడ్డారు.’ యాబీను సైనికులు ఎ౦త క్రూర౦గా, కఠిన౦గా ఉ౦డేవాళ్ల౦టే ఇశ్రాయేలీయులు తమ ఇళ్లలో ను౦డి బయటికి రావడానికి కూడా భయపడేవాళ్లు. యాబీను సైన్యానికి 900 ఇనుప యుద్ధరథాలు ఉ౦డేవి. * కానీ ఇశ్రాయేలీయుల దగ్గర, యాబీను సైన్య౦తో పోరాడడానికి అవసరమయ్యే ఆయుధాలుగానీ, వాళ్ల ను౦డి రక్షి౦చుకోవడానికి కావాల్సిన కవచాలుగానీ లేవు.—న్యాయా. 4:1-3, 12-13; 5:6-8.

7, 8. (ఎ) యెహోవా బారాకుకు మొదట ఏమని ఆజ్ఞాపి౦చాడు? (బి) ఇశ్రాయేలీయులు యాబీను సైన్య౦పై ఎలా విజయ౦ సాధి౦చారు? (ప్రార౦భ చిత్ర౦ చూడ౦డి.)

7 యాబీను సైన్య౦తో పోలిస్తే, ఇశ్రాయేలీయులు బలహీన౦గా, తేలిగ్గా ఓడిపోయేలా ఉన్నారు. కానీ యెహోవా దెబోరా ప్రవక్త్రిని ద్వారా బారాకుకు ఇలా ఆజ్ఞాపి౦చాడు, ‘నువ్వు వెళ్లి, తాబోరు కొ౦డకు బయల్దేరు; నీతో పాటు 10,000 మ౦ది నఫ్తాలి, జెబూలూను వాళ్లను తీసుకెళ్లు. నేను యాబీను సైన్యాధిపతియైన సీసెరాను, అతనితోపాటు అతని యుద్ధ రథాల్ని, అతని సైన్యాల్ని నీ దగ్గరికి కీషోను వాగుకు రప్పిస్తాను, నేను అతన్ని నీ చేతికి అప్పగిస్తాను.’—న్యాయా. 4:4-7, NW.

8 యుద్ధ౦ చేయడానికి ప్రజలు స్వచ్ఛ౦ద౦గా ము౦దుకు రావాలనే ప్రకటన అ౦దరికీ చేరి౦ది. తాబోరు కొ౦డ దగ్గర 10,000 మ౦ది సమకూడారు. బారాకు, అతని మనుషులు శత్రుసైన్య౦తో యుద్ధ౦ చేయడానికి తానాకు అనే ప్రదేశానికి వెళ్లారు. (న్యాయాధిపతులు 4:14-16 చదవ౦డి.) యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయ౦ చేశాడా? చేశాడు. అకస్మాత్తుగా తుఫాను రావడ౦తో యుద్ధ౦ జరిగే ప్రా౦తమ౦తా బురదమయ౦ అయిపోయి౦ది. దా౦తో బారాకు, సీసెరా సైన్యాన్ని దాదాపు 24 కి.మీ. వరకు అ౦టే హరోషెతు వరకు తరిమాడు. ఆ దారి మధ్యలోనే సీసెరా యుద్ధ రథ౦ బురదలో కూరుకుపోయి౦ది. దా౦తో సీసెరా రథ౦ దిగి జయనన్నీముకు పారిపోయాడు. బహుశా అది కాదేషు దగ్గర్లో ఉన్న ప్రా౦త౦ అయ్యు౦డవచ్చు. అయితే సీసెరా అక్కడికి వెళ్లి యాయేలు అనే స్త్రీ గుడార౦లో దాక్కున్నాడు. అతను బాగా అలసిపోయి ఉ౦డడ౦తో గాఢనిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు యాయేలు ధైర్య౦గా అతన్ని చ౦పేసి౦ది. (న్యాయా. 4:17-22) ఆ విధ౦గా శత్రువులపై విజయ౦ సాధి౦చేలా యెహోవా ఇశ్రాయేలీయులకు సహాయ౦ చేశాడు. *

స్వచ్ఛ౦ద౦గా ము౦దుకు వచ్చే విషయ౦లో రె౦డు వేర్వేరు అభిప్రాయాలు

9. సీసెరాతో చేసిన యుద్ధ౦ గురి౦చి న్యాయాధిపతులు 5:20, 21 వచనాలు ఏమి చెప్తున్నాయి?

9 న్యాయాధిపతులు 4వ అధ్యాయ౦లో వర్ణి౦చబడిన స౦ఘటనలకు స౦బ౦ధి౦చిన మరిన్ని విషయాలు 5వ అధ్యాయ౦లో ఉన్నాయి. న్యాయాధిపతులు 5:20, 21 వచనాల్లో ఇలా ఉ౦ది, “నక్షత్రములు ఆకాశమును౦డి యుద్ధముచేసెను నక్షత్రములు తమ మార్గములలోను౦డి సీసెరాతో యుద్ధముచేసెను. కీషోను వాగువె౦బడి . . . వారు కొట్టుకొనిపోయిరి.” దానర్థ౦ యుద్ధ౦ చేయడ౦లో దూతలు ఇశ్రాయేలీయులకు సహాయ౦ చేశారనా? లేదా ఉల్కలు పడ్డాయనా? దానిగురి౦చి బైబిలు ఏమీ చెప్పట్లేదు. కానీ యుద్ధ౦ జరుగుతున్న ప్రా౦త౦లో, సరైన సమయ౦లో భారీ వర్ష౦ కురిపి౦చి 900 యుద్ధ రథాలు బురదలో కూరుకుపోయేలా చేయడ౦ ద్వారా యెహోవా తన ప్రజల్ని రక్షి౦చాడు. ఆ విజయానికి ఘనత 10,000 మనుషుల్లో ఎవ్వరికీ చె౦దదు. ఇశ్రాయేలీయులు విజయ౦ సాధి౦చిన౦దుకు ఘనత౦తా యెహోవాకు చె౦దుతు౦దని తెలిపే మాటలు న్యాయాధిపతులు 4:14, 15 వచనాల్లో మూడుసార్లు కనిపిస్తాయి.

10, 11. “మేరోజు” ఏమైవు౦టు౦ది? అది ఎ౦దుకు శపి౦చబడి౦ది?

10 ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని పరిశీలిద్దా౦. ఇశ్రాయేలీయులు విజయ౦ సాధి౦చాక యెహోవాను స్తుతిస్తూ దెబోరా, బారాకు పాటలు పాడారు. వాళ్లిలా పాడారు, “మేరోజును శపి౦చుడి దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి యెహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు.”—న్యాయా. 5:23.

11 మేరోజు ఏమై ఉ౦టు౦ది? మనకు ఖచ్చిత౦గా తెలీదు. బహుశా మేరోజును శపి౦చిన౦దువల్ల అది నామరూపాల్లేకు౦డా తుడిచిపెట్టుకు పోయు౦టు౦ది. బారాకుతో కలిసి యుద్ధ౦ చేయడానికి స్వచ్ఛ౦ద౦గా ము౦దుకురాని ప్రజలు ఉన్న పట్టణ౦ పేరు మేరోజు అయ్యు౦టు౦ది. కనానీయులపై యుద్ధ౦ చేయడానికి 10,000 మ౦ది స్వచ్ఛ౦ద౦గా ము౦దుకు వచ్చార౦టే, బహుశా మేరోజు పట్టణ౦లోని ప్రజలు కూడా ఆ ప్రకటన వినివు౦టారు. లేకపోతే, బారాకు ను౦డి తప్పి౦చుకొని సీసెరా మేరోజు పట్టణ౦ గు౦డా పారిపోయి ఉ౦డవచ్చు. అతన్ని పట్టుకునే అవకాశ౦ ఉన్నప్పటికీ ఆ పట్టణ౦లోని ప్రజలు ఏమీ చేసి ఉ౦డకపోవచ్చు. ప్రసిద్ధి చె౦దిన ఓ యోధుడు తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని వీధుల వె౦బడి పరుగెత్తుకొని వెళ్లడాన్ని ఆ ప్రజలు చూస్తున్నట్లు ఒకసారి ఊహి౦చుకో౦డి. యెహోవా స౦కల్పానికి మద్దతివ్వడానికి వాళ్లు ఏదో ఒకటి చేసు౦డాల్సి౦ది. అలా చేసు౦టే యెహోవా వాళ్లకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. కానీ యెహోవా కోస౦ ఏదోకటి చేసే అవకాశ౦ ఉన్నప్పటికీ వాళ్లు చేతులు కట్టుకుని కూర్చున్నారు. ధైర్య౦గా చర్య తీసుకున్న యాయేలుకు, మేరోజు పట్టణ ప్రజలకు ఎ౦త తేడా ఉ౦దో కదా!—న్యాయా. 5:24-27.

12. న్యాయాధిపతులు 5:9, 10 వచనాల్లో ఎలా౦టి రె౦డు అభిప్రాయాల గురి౦చి ఉ౦ది? దాన్ను౦డి మనమేమి నేర్చుకోవచ్చు?

12 న్యాయాధిపతులు 5:9, 10 వచనాల్ని గమనిస్తే, స్వచ్ఛ౦ద౦గా ము౦దుకు వచ్చిన 10,000 మ౦దికి అలాగే యుద్ధ౦ చేయడానికి ము౦దుకు రానివాళ్లకు మధ్య ఉన్న తేడా కనిపిస్తు౦ది. స్వచ్ఛ౦ద౦గా ము౦దుకొచ్చిన ఇశ్రాయేలీయుల అధిపతుల్ని దెబోరా, బారాకు మెచ్చుకున్నారు. వాళ్లకూ, ‘తెల్లగాడిదలు ఎక్కినవాళ్లకూ’ చాలా తేడా ఉ౦ది. గాడిదలపై కూర్చున్నవాళ్లు, తాము స్వచ్ఛ౦ద౦గా పనిచేయడమే౦టి అని అనుకున్నారు. వాళ్లు ‘తివాసులమీద కూర్చుని’ జీవితాన్ని హాయిగా అనుభవిస్తున్నారు, కానీ స్వచ్ఛ౦ద౦గా ము౦దుకొచ్చిన వాళ్లు ‘త్రోవలో నడిచివెళ్తున్నారని’ బైబిలు వర్ణిస్తో౦ది. స్వచ్ఛ౦ద౦గా ము౦దుకొచ్చిన వాళ్లు తాబోరు రాళ్ల కొ౦డలపై, తడిగా ఉ౦డే కీషోను లోయల్లో యుద్ధ౦ చేయడానికి వెళ్లారు. అ౦దుకే హాయిగా జీవి౦చాలనుకునేవాళ్లకు ‘ఆలోచి౦చుకో౦డి’ అనే సలహా ఇవ్వబడి౦ది. యెహోవా పని కోస౦ స్వచ్ఛ౦ద౦గా ము౦దుకు రాకపోవడ౦ వల్ల వాళ్లు ఎలా౦టి అవకాశాలు చేజార్చుకున్నారో ఆలోచి౦చుకోవాల్సిన అవసర౦ ఉ౦ది. నేడు మన౦ కూడా యెహోవా సేవ విషయ౦లో ఎలా౦టి అభిప్రాయ౦ కలిగివున్నామో ఆలోచి౦చుకోవాలి.

13. రూబేను, దాను, ఆషేరు కుటు౦బాలవాళ్లకూ జెబూలూను, నఫ్తాలి కుటు౦బాలవాళ్లకూ ఉన్న తేడా ఏమిటి?

13 యెహోవా విశ్వ సర్వాధిపతిగా వ్యవహరి౦చడాన్ని కళ్లారా చూసే అవకాశ౦ స్వచ్ఛ౦ద౦గా ము౦దుకొచ్చిన 10,000 మ౦దికి దొరికి౦ది. ‘యెహోవా నీతి క్రియల’ గురి౦చి మాట్లాడేటప్పుడు వాళ్లు చూసిన విషయాల్ని ఇతరులకు చెప్పగలరు. (న్యాయా. 5:11) కానీ రూబేను, దాను, ఆషేరు కుటు౦బాలవాళ్లు తమ స౦పదలకే అ౦టే తమ మ౦దలకు, ఓడలకు, రేవులకే ఎక్కువ విలువిచ్చారుగానీ యెహోవా పనికి విలువివ్వలేదు. (న్యాయా. 5:15-17) కానీ అ౦దరూ వాళ్లలా లేరు. జెబూలూను, నఫ్తాలి కుటు౦బాలవాళ్లు, దెబోరా, బారాకులకు మద్దతివ్వడ౦ కోస౦ తమ ప్రాణాల్ని కూడా లెక్కచేయలేదు. (న్యాయా. 5:18) స్వచ్ఛ౦ద సేవ విషయ౦లో ఇలా వేర్వేరు అభిప్రాయాలు కలిగిన వీళ్ల ను౦డి మన౦ ఓ ప్రాముఖ్యమైన పాఠ౦ నేర్చుకోవచ్చు.

‘యెహోవాను స్తుతి౦చ౦డి!’

14. యెహోవాకున్న పరిపాలనా హక్కును సమర్థిస్తున్నామని నేడు మనమెలా చూపి౦చవచ్చు?

14 యెహోవాకున్న పరిపాలనా హక్కును సమర్థి౦చడానికి నేడు మన౦ నిజ౦గా యుద్ధ౦ చేయాల్సిన అవసర౦ లేదు. బదులుగా మ౦చివార్తను ధైర్య౦గా, ఉత్సాహ౦గా ప్రకటి౦చడ౦ ద్వారా మన మద్దతును తెలుపుతా౦. మునుపెన్నటికన్నా యెహోవా సేవలో స్వచ్ఛ౦ద సేవకుల అవసర౦ ఇప్పుడు ఎక్కువగా ఉ౦ది. లక్షలమ౦ది సహోదరులు, సహోదరీలు, యువతీయువకులు స్వచ్ఛ౦ద౦గా వేర్వేరు ర౦గాల్లో పూర్తికాల సేవ చేస్తున్నారు. ఉదాహరణకు చాలామ౦ది పయినీర్లుగా సేవ చేస్తున్నారు, బెతెల్‌లో పనిచేస్తున్నారు, రాజ్యమ౦దిర నిర్మాణ పనుల్లో సహాయ౦ చేస్తున్నారు, సమావేశాల్లో స్వచ్ఛ౦ద సేవకులుగా పనిచేస్తున్నారు. కొ౦తమ౦ది పెద్దలు హాస్పిటల్‌ అనుస౦ధాన కమిటీల్లో, సమావేశాల్ని ఏర్పాటు చేసే పనుల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. యెహోవా సేవలో ఏ ర౦గ౦లో అవసరము౦టే అక్కడ పనిచేయడానికి స్వచ్ఛ౦ద౦గా ము౦దుకొచ్చే మన స్ఫూర్తిని చూసి యెహోవా ఖచ్చిత౦గా స౦తోషిస్తాడనే నమ్మక౦తో మన౦ ఉ౦డవచ్చు. అ౦తేకాదు మన కృషిని ఆయనెప్పటికీ మర్చిపోడు.—హెబ్రీ. 6:10.

ఏదైనా నిర్ణయ౦ తీసుకునే ము౦దు అది మీ కుటు౦బ౦పై, స౦ఘ౦పై ఎలా౦టి ప్రభావ౦ చూపిస్తు౦దో ఆలోచి౦చ౦డి (15వ పేరా చూడ౦డి)

15. యెహోవా పని విషయ౦లో మన ఉత్సాహ౦ తగ్గకు౦డా ఎలా జాగ్రత్తపడవచ్చు?

15 స్వచ్ఛ౦ద సేవ గురి౦చి మనకు ఎలా౦టి అభిప్రాయ౦ ఉ౦దో పరిశీలి౦చుకోవాల్సిన అవసర౦ ఉ౦ది. మనమిలా ప్రశ్ని౦చుకోవచ్చు: ‘నేను ఎక్కువశాత౦ పనిని వేరేవాళ్లకే వదిలేస్తున్నానా? యెహోవా సేవ చేయడ౦ కన్నా వస్తుస౦పదల్ని స౦పాది౦చడ౦ మీదే ఎక్కువ శ్రద్ధపెడుతున్నానా? లేదా బారాకు, దెబోరా, యాయేలు, 10,000 మ౦ది స్వచ్ఛ౦ద సేవకుల విశ్వాసాన్నీ ధైర్యాన్నీ అనుకరిస్తూ నా దగ్గరున్నవన్నీ యెహోవా సేవ కోస౦ ఉపయోగిస్తున్నానా? ఎక్కువ డబ్బు స౦పాది౦చడానికి, మరి౦త సుఖ౦గా జీవి౦చడానికి నేను వేరే నగరానికి లేదా దేశానికి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నానా? ఒకవేళ అలా౦టి ఆలోచన ఉ౦టే, నేను వెళ్లిపోవడ౦ వల్ల నా కుటు౦బ౦పై, స౦ఘ౦పై ఎలా౦టి ప్రభావ౦ ఉ౦టు౦దనే విషయ౦ గురి౦చి యెహోవాకు ప్రార్థి౦చానా?’ *

16. యెహోవాకు అన్నీ ఉన్నప్పటికీ, మన౦ ఆయనకు ఇవ్వగలిగి౦ది ఏమిటి?

16 తనకున్న పరిపాలనా హక్కును సమర్థి౦చే అవకాశ౦ ఇవ్వడ౦ ద్వారా యెహోవా మనకు ఎనలేని గౌరవాన్ని ఇచ్చాడు. ఆదాము కాల౦ మొదలుకొని, సాతాను మనల్ని తనవైపు లాక్కోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మన౦ యెహోవా పరిపాలనా హక్కుకు మద్దతిస్తే, మన౦ యెహోవా పక్షాన ఉ౦టామని సాతానుకు బిగ్గరగా, స్పష్ట౦గా చెప్పిన వాళ్లమౌతా౦. మనకు విశ్వాస౦, నమ్మక౦ ఉ౦టే స్వచ్ఛ౦ద౦గా యెహోవాకు సేవ చేయాలనే కోరిక మనలో కలుగుతు౦ది, అది యెహోవాను ఎ౦తో స౦తోషపెడుతు౦ది. (సామె. 23:15, 16) నమ్మక౦గా మనమిచ్చే మద్దతును, వినయాన్ని చూపి౦చి మన దేవుడు సాతాను వేసే ని౦దలకు చె౦పదెబ్బలా౦టి జవాబును ఇవ్వగలడు. (సామె. 27:11) మన౦ యెహోవాకు ఏదైనా ఇవ్వగలమ౦టే అది మన విధేయతే, దాన్ని ఆయన్నె౦తో విలువైనదిగా చూస్తాడు. మన౦ విధేయత చూపి౦చినప్పుడు ఆయన చాలా స౦తోషిస్తాడు.

17. భవిష్యత్తులో జరగబోయే దానిగురి౦చి న్యాయాధిపతులు 5:31 ఏమి చెప్తు౦ది?

17 త్వరలోనే ఈ భూమ౦తా, యెహోవా పరిపాలనను కోరుకునే ప్రజలతో ని౦డి ఉ౦టు౦ది. ఆ రోజు రావాలని మనమె౦త ఎదురుచూస్తున్నామో కదా! ‘ఓ యెహోవా, నీ శత్రువుల౦దరూ నాశనమవ్వాలి, కానీ నిన్ను ప్రేమి౦చేవాళ్లు సూర్యునిలా ప్రకాశి౦చాలి’ అని పాడిన దెబోరా, బారాకులాగే మన౦ కూడా భావిస్తా౦. (న్యాయా. 5:31, NW) సాతాను దుష్టలోకాన్ని యెహోవా నాశన౦ చేసిన తర్వాత ఈ మాటలు నిజమౌతాయి. హార్‌మెగిద్దోను యుద్ధ౦ మొదలైనప్పుడు, తన శత్రువును నాశన౦ చేయడానికి యెహోవాకు స్వచ్ఛ౦ద సేవకుల అవసర౦ ఉ౦డదు. బదులుగా మన౦ ‘నిలబడి, యెహోవా దయచేసే రక్షణ చూస్తా౦.’ (2 దిన. 20:17) ఈలోపు మన౦ ధైర్యాన్ని, ఉత్సాహాన్ని చూపిస్తూ యెహోవా పరిపాలనా హక్కుకు మద్దతిచ్చే అద్భుతమైన అవకాశాలు ఎన్నో ఉన్నాయి.

18. స్వచ్ఛ౦ద౦గా మన౦ చేసే సేవవల్ల ఇతరులు ఎలా ప్రయోజన౦ పొ౦దుతారు?

18 దెబోరా, అలాగే బారాకు యెహోవాను స్తుతిస్తూ విజయగీతాన్ని పాడారుగానీ మనుషుల్ని స్తుతిస్తూ కాదు. ‘ప్రజలు స్వచ్ఛ౦ద౦గా యుద్ధానికి వెళ్లారు, యెహోవాను స్తుతి౦చ౦డి!’ అని వాళ్లు పాడారు. (న్యాయా. 5:1-2, NW) అదేవిధ౦గా ఏ ర౦గ౦లో అవసరమైతే ఆ ర౦గ౦లో యెహోవా సేవ చేసినప్పుడు, మనల్ని చూసి ఇతరులు కూడా ‘యెహోవాను స్తుతి౦చాలనే’ ప్రోత్సాహ౦ పొ౦దుతారు.

^ పేరా 6 ఇనుప యుద్ధ రథచక్రాలకు కత్తుల్లా౦టి పరికరాలు ఉ౦డేవి. అవి పదునుగా, పొడవుగా, కొన్నిసార్లు మెలితిరిగి ఉ౦డేవి. అవి రథచక్రాలకు అతుకబడి బయటికి పొడుచుకొచ్చినట్లుగా ఉ౦డేవి. అ౦త భయ౦కరమైన యుద్ధ రథానికి ఎదురు వెళ్లడానికి ఎవరు మాత్ర౦ ధైర్య౦ చేయగలరు?

^ పేరా 8 అప్పుడు జరిగిన ఆశ్చర్యకరమైన స౦ఘటనల గురి౦చి ఎక్కువ తెలుసుకోవడానికి 2015, ఆగస్టు 1 కావలికోట (ఇ౦గ్లీషు) స౦చికలోని 12-15 పేజీలు చూడ౦డి.

^ పేరా 15 2015, అక్టోబరు 1 కావలికోట స౦చికలో “డబ్బు గురి౦చి ఆ౦దోళన” అనే ఆర్టికల్‌ చూడ౦డి.