అధ్యయన ఆర్టికల్ 12
మాట్లాడడానికి ఏది సరైన సమయం?
‘ప్రతీదానికి ఒక సమయం ఉంది . . . మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి.’—ప్రసం. 3:1, 7.
పాట 124 ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం
ఈ ఆర్టికల్‌లో . . . *
1. ప్రసంగి 3:1, 7 వచనాల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
మనలో కొంతమందికి ఎక్కువగా మాట్లాడడం ఇష్టం. ఇంకొంతమందికి మౌనంగా ఉండడం ఇష్టం. ఈ ఆర్టికల్ ముఖ్య లేఖనం చెప్తున్నట్టు, మనం కొన్ని సమయాల్లో మాట్లాడాలి, కొన్ని సమయాల్లో మౌనంగా ఉండాలి. (ప్రసంగి 3:1, 7 చదవండి.) అయితే, మన సహోదర సహోదరీల్లో కొంతమంది కొంచెం ఎక్కువగా మాట్లాడితే బావుంటుందని మనకు అనిపించవచ్చు. అలాగే కొంతమంది కాస్త తక్కువగా మాట్లాడితే బావుంటుందని అనిపించవచ్చు.
2. ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే విషయంలో ప్రమాణాల్ని పెట్టే హక్కు ఎవరికి ఉంది?
2 మాట్లాడే సామర్థ్యం యెహోవా ఇచ్చిన వరం. (నిర్గ. 4:10, 11; ప్రక. 4:11) ఈ వరాన్ని సరైన విధంగా ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడానికి ఆయన తన వాక్యం ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. మనం ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో అర్థం చేసుకోవడానికి సహాయం చేసే కొన్ని బైబిలు ఉదాహరణల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మన మాటలు విన్నప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుందో కూడా పరిశీలిస్తాం. ముందుగా, మనం ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకుందాం.
ఎప్పుడు మాట్లాడాలి?
3. రోమీయులు 10:14 ప్రకారం, ప్రకటించే విషయంలో మనం ఎలా ఉండాలి?
3 యెహోవా గురించి, ఆయన రాజ్యం గురించి మాట్లాడడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. (మత్త. 24:14; రోమీయులు 10:14 చదవండి.) అలా ఉండడం ద్వారా మనం యేసు ఆదర్శాన్ని పాటిస్తాం. యేసు భూమ్మీదికి రావడానికి గల ఒక ముఖ్య కారణం, ప్రజలకు తండ్రి గురించిన సత్యాన్ని చెప్పడం. (యోహా. 18:37) అయితే మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. యెహోవా గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు “సౌమ్యంగా, ప్రగాఢ గౌరవంతో” మాట్లాడాలి. అలాగే వినేవాళ్ల భావాల్ని, నమ్మకాల్ని పట్టించుకోవాలి. (1 పేతు. 3:15) అలా చేయడం ద్వారా మనం కేవలం మాట్లాడడమే కాదు, ఇతరులకు యెహోవా గురించి బోధిస్తాం, బహుశా వాళ్ల హృదయాన్ని చేరుకుంటాం.
4. సామెతలు 9:9 చెప్తున్నట్టు, మన మాటలు ఇతరులకు ఎలా సహాయం చేస్తాయి?
సామెతలు 9:9 చదవండి.) అయితే సలహా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ధైర్యం చూపించడం ఎందుకు ప్రాముఖ్యం? ఈ రెండు భిన్నమైన ఉదాహరణల్ని పరిశీలించండి: ఒక ఉదాహరణలో ఒక తండ్రి, తన కుమారుల్ని సరిదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడింది; మరో ఉదాహరణలో ఒక స్త్రీ, కాబోయే రాజుతో మాట్లాడి అతను తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పాల్సి వచ్చింది.
4 ఒక సహోదరునికి లేదా సహోదరికి సలహా అవసరమని గుర్తిస్తే, వాళ్లతో మాట్లాడడానికి సంఘ పెద్దలు వెనకాడకూడదు. అయితే ఆ సహోదరుడు లేదా సహోదరి ఇబ్బందిపడకుండా ఉండేలా పెద్దలు సరైన సమయాన్ని ఎంచుకుని మాట్లాడతారు. పెద్దలు వాళ్లతో ఒంటరిగా మాట్లాడే సమయం కోసం వేచిచూస్తారు. పెద్దలు ఎప్పుడూ ఎదుటివ్యక్తితో గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అదేసమయంలో, ఆ వ్యక్తి తెలివిగా నడుచుకోవడానికి సహాయపడే బైబిలు సూత్రాల్ని చూపిస్తారు. (5. ప్రధానయాజకుడైన ఏలీ ఏ సందర్భంలో మాట్లాడకుండా ఉన్నాడు?
5 ప్రధానయాజకుడైన ఏలీ తన ఇద్దరు కుమారుల్ని ఎంతో ప్రేమించాడు. అయితే వాళ్లు యెహోవాను గౌరవించేవాళ్లు కాదు. వాళ్లకు గుడారంలో యాజకులుగా సేవ చేసే గొప్ప బాధ్యత ఉంది. కానీ వాళ్లు తమ అధికారాన్ని తప్పుగా ఉపయోగిస్తూ, యెహోవాకు అర్పించిన బలుల పట్ల ఏమాత్రం గౌరవం చూపించలేదు, అంతేకాదు లైంగిక పాపానికి పాల్పడ్డారు. (1 సమూ. 2:12-17, 22) మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏలీ కుమారులకు మరణశిక్ష విధించాలి. కానీ ఏలీ చూసీచూడనట్టు ఉంటూ వాళ్లను చిన్నగా మందలించి, యాజక సేవలో కొనసాగనిచ్చాడు. (ద్వితీ. 21:18-21) ఏలీ స్పందించిన తీరును చూసి యెహోవాకు ఎలా అనిపించింది? ఆయన ఏలీతో ఇలా అన్నాడు: “నువ్వు నా కన్నా నీ కుమారుల్ని ఎందుకు ఎక్కువగా ఘనపరుస్తున్నావు?” యెహోవా ఆ ఇద్దరు దుష్టుల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు.—1 సమూ. 2:29, 34.
6. ఏలీ నుండి మనం ఏం నేర్చుకుంటాం?
6 మనం ఏలీ నుండి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంటాం. మన స్నేహితుడు లేదా బంధువు దేవుని నియమాన్ని మీరారని తెలిస్తే, మనం వాళ్లతో మాట్లాడాలి, యెహోవా ప్రమాణాల్ని గుర్తుచేయాలి. తర్వాత, యెహోవా ప్రతినిధుల నుండి వాళ్లు అవసరమైన సహాయాన్ని తీసుకునేలా చూడాలి. (యాకో. 5:14) మనం యెహోవా కన్నా మన స్నేహితుణ్ణి లేదా బంధువును ఎక్కువగా ఘనపరుస్తూ ఏలీలా ఉండాలని ఎన్నడూ అనుకోం. ఎవరినైనా సరిదిద్దాల్సిన పరిస్థితి వస్తే, వాళ్లతో మాట్లాడడానికి ధైర్యం కావాలి. అలా ధైర్యం చేసి మాట్లాడడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఏలీ ఉదాహరణకు, ఇశ్రాయేలీయురాలైన అబీగయీలు ఉదాహరణకు ఎంత తేడా ఉందో గమనించండి.
7. అబీగయీలు దావీదుతో ఎందుకు మాట్లాడింది?
1 సమూ. 25:5-8, 10-12, 14) దాంతో దావీదు, నాబాలు ఇంటిలోని ప్రతీ పురుషుణ్ణి చంపేయాలని నిర్ణయించుకున్నాడు. (1 సమూ. 25:13, 22) మరి ముంచుకొస్తున్న ఆ ప్రమాదాన్ని ఎలా ఆపాలి? ఇది మాట్లాడాల్సిన సమయం అని అబీగయీలు గుర్తించింది. ఆయుధాలు ధరించి ఆకలితో, కోపంగా వస్తున్న 400 మంది మనుషుల దగ్గరికి ధైర్యంగా వెళ్లి, దావీదుతో మాట్లాడింది.
7 అబీగయీలు నాబాలు భార్య. అతను చాలా ధనవంతుడు, భూస్వామి. దావీదు తన మనుషులతో పాటు రాజైన సౌలు నుండి పారిపోతున్నప్పుడు నాబాలు కాపరులతో కొంతకాలం ఉన్నాడు. దావీదు, అతని మనుషులు నాబాలు మందల్ని దొంగల బారినుండి కాపాడారు. మరి నాబాలు వాళ్ల పట్ల కృతజ్ఞత చూపించాడా? లేదు. దావీదు తన మనుషుల కోసం ఆహారం, నీళ్లు ఇవ్వమని అడిగినప్పుడు, నాబాలు కోపగించుకుని వాళ్లను అవమానిస్తూ గట్టిగా అరిచాడు. (8. అబీగయీలు ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకుంటాం?
8 అబీగయీలు దావీదును కలిసినప్పుడు ధైర్యంగా, మర్యాదగా, ఒప్పించే విధంగా మాట్లాడింది. ఆ సమస్యకు కారణం ఆమె కాకపోయినా, క్షమించమని దావీదును అడిగింది. దావీదుకున్న మంచి లక్షణాల్ని గుర్తుచేసింది, సహాయం కోసం యెహోవా మీద ఆధారపడింది. (1 సమూ. 25:24, 26, 28, 33, 34) ఎవరైనా తప్పు చేసే దిశగా వెళ్తున్నారని గమనిస్తే, వాళ్లతో మాట్లాడడానికి మనకు కూడా అబీగయీలులాగే ధైర్యం అవసరం. (కీర్త. 141:5) మనం మర్యాదగా మాట్లాడాలి, అదే సమయంలో భయపడకూడదు. మనం ప్రేమపూర్వకంగా అవసరమైన సలహా ఇచ్చినప్పుడు, నిజమైన స్నేహితులమని నిరూపించుకుంటాం.—సామె. 27:17.
9-10. ఇతరులకు సలహా ఇస్తున్నప్పుడు పెద్దలు ఏ విషయాల్ని గుర్తుంచుకోవాలి?
9 తప్పటడుగు వేస్తున్న సహోదర సహోదరీలతో మాట్లాడడానికి ముఖ్యంగా పెద్దలు ధైర్యం చూపించాలి. (గల. 6:1) తాము కూడా అపరిపూర్ణులమని, తమకు కూడా ఏదోకరోజు సలహా అవసరమని పెద్దలు వినయంగా గుర్తిస్తారు. అయితే ఆ కారణాన్ని బట్టి, క్రమశిక్షణ అవసరమైన వాళ్లను గద్దించడానికి పెద్దలు వెనకాడరు. (2 తిమో. 4:2; తీతు 1:9) ఎవరికైనా సలహా ఇస్తున్నప్పుడు, మాట్లాడే వరాన్ని ఉపయోగించి నైపుణ్యంగా, ఓపిగ్గా బోధిస్తారు. పెద్దలు తమ సహోదరుణ్ణి ప్రేమిస్తారు, ఆ ప్రేమ వల్ల వాళ్లు అతనికి సహాయం చేస్తారు. (సామె. 13:24) అయితే వాళ్లు ముఖ్యంగా యెహోవాను ఘనపర్చడం గురించే ఆలోచిస్తారు. కాబట్టి వాళ్లు యెహోవా ప్రమాణాలకు మద్దతిస్తూ, సంఘానికి హాని కలగకుండా చూసుకుంటారు.—అపొ. 20:28.
10 ఇప్పటివరకు మనం ఎప్పుడు మాట్లాడాలో పరిశీలించాం. అయితే కొన్ని సమయాల్లో మనం ఏమీ మాట్లాడకపోవడమే మంచిది. అలాంటి సమయాల్లో మనకు ఎలాంటి సవాళ్లు ఎదురౌతాయి?
ఎప్పుడు మౌనంగా ఉండాలి?
11. యాకోబు ఏ ఉదాహరణ ఉపయోగించాడు, అది ఎందుకు సరైనది?
11 మన మాటల్ని అదుపులో పెట్టుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఈ సవాలును వివరించడానికి బైబిలు రచయిత అయిన యాకోబు సరైన ఉదాహరణ ఉపయోగించాడు. ఆయన ఇలా అన్నాడు: “ఎవరైనా మాట్లాడే విషయంలో పొరపాటు చేయకపోతే అతను పరిపూర్ణుడు, అతను మొత్తం శరీరాన్ని అదుపులో ఉంచుకోగలడు. గుర్రాన్ని మాట వినేలా చేయడానికి దాని నోటికి కళ్లెం వేస్తాం, ఆ కళ్లెంతో మొత్తం గుర్రాన్నే నియంత్రిస్తాం.” (యాకో. 3:2, 3) కళ్లాన్ని గుర్రం తలకు, నోటికి పెడతారు. కళ్లాన్ని లాగడం ద్వారా గుర్రాన్ని నడిపేవ్యక్తి తాను అనుకున్న దారిలో దాన్ని తీసుకెళ్లగలడు లేదా ఆపగలడు. ఒకవేళ అతను ఆ కళ్లాన్ని గట్టిగా పట్టుకోకపోతే గుర్రం ఇష్టమొచ్చినట్టు పరుగెత్తే అవకాశం ఉంది. దానివల్ల గుర్రానికి, అతనికి హాని జరగవచ్చు. అదేవిధంగా మన మాటల్ని అదుపు చేసుకోలేకపోతే, చాలా నష్టం జరగవచ్చు. మన నాలుకను అదుపులో పెట్టుకుని, మాట్లాడకుండా ఉండాల్సిన కొన్ని సందర్భాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.
12. మనం ఏ సమయంలో నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడకుండా ఉండాలి?
12 ఒక సహోదరుడు లేదా సహోదరి దగ్గర
రహస్యంగా ఉంచాల్సిన సమాచారం ఉందని తెలిస్తే మీరేం చేస్తారు? ఉదాహరణకు, మన పనిపై నిషేధం ఉన్న దేశానికి చెందిన సహోదరుణ్ణి కలిస్తే, అక్కడ జరిగే మన పని గురించిన వివరాల్ని అడగాలని మీకనిపిస్తుందా? మీరు మంచి ఉద్దేశంతోనే అడగాలనుకోవచ్చు. మనం మన సహోదర సహోదరీల్ని ప్రేమిస్తాం, వాళ్లెలా ఉన్నారో తెలుసుకోవాలని అనుకుంటాం. వాళ్ల అవసరాలు ఏంటో తెలుసుకుని ప్రత్యేకంగా వాటి గురించి ప్రార్థించాలని అనుకుంటాం. కానీ ఈ సమయంలోనే, మన నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడకుండా ఉండాలి. రహస్యంగా ఉంచాల్సిన సమాచారం చెప్పమని మనం ఏ సహోదరుడినైనా ఒత్తిడి చేస్తే, అతని మీద, అలాగే విషయాన్ని రహస్యంగా ఉంచుతాడని అతనిపై నమ్మకం పెట్టుకున్న సహోదర సహోదరీల మీద ప్రేమ చూపించినట్టు అవ్వదు. నిషేధం ఉన్న దేశాల్లోని సహోదర సహోదరీలకు మనవల్ల మరిన్ని కష్టాలు రావాలని మనలో ఎవ్వరమూ కోరుకోం. అదేవిధంగా, అలాంటి దేశంలో సేవ చేస్తున్నవాళ్లు తమ పరిచర్య, ఇతర క్రైస్తవ కార్యకలాపాల గురించిన వివరాలు ఎవరికీ చెప్పాలనుకోరు.13. సామెతలు 11:13 చెప్తున్నట్టు పెద్దలు ఎలా ఉండాలి, ఎందుకు?
13 సామెతలు 11:13 వచనంలో ఉన్న సూత్రాన్ని, ముఖ్యంగా పెద్దలు పాటిస్తూ రహస్యాల్ని బయటికి చెప్పకూడదు. (చదవండి.) ప్రత్యేకించి పెళ్లయిన పెద్దలకు ఇది ఒక సవాలుగా ఉండవచ్చు. పెళ్లయినవాళ్లు తమ బంధాన్ని బలపర్చుకోవడానికి తరచూ మాట్లాడుకుంటూ, తమ మనసులోని ఆలోచనల్ని, భావాల్ని, ఆందోళనల్ని ఒకరితోఒకరు పంచుకుంటారు. అయితే సంఘంలోని వాళ్ల గురించి రహస్యంగా ఉంచాల్సిన విషయాల్ని తన భార్యకు చెప్పకూడదని ఒక పెద్ద గుర్తుంచుకుంటాడు. ఒకవేళ అతను వాటిని తన భార్యకు చెప్తే, సహోదర సహోదరీలకు తనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటాడు, తనకున్న మంచిపేరును పాడుచేసుకుంటాడు. సంఘంలో బాధ్యతలు ఉన్నవాళ్లకు “రెండు నాలుకల ధోరణి” లేదా మోసపూరిత మాటలు మాట్లాడే గుణం ఉండకూడదు. (1 తిమో. 3:8; అధస్సూచి) అంటే, వాళ్లు ఇతరుల్ని మోసం చేయకూడదు లేదా వేరేవాళ్ల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదు. తన భార్యను ప్రేమించే పెద్ద, ఆమెకు అవసరంలేని సమాచారాన్ని చెప్పి ఆమెను ఇబ్బందిపెట్టడు.
14. భర్త తనకున్న మంచిపేరును కాపాడుకోవడానికి భార్య ఎలా సహాయం చేయవచ్చు?
14 భర్త తనకున్న మంచిపేరును కాపాడుకోవడానికి భార్య సహాయం చేయవచ్చు. రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని చెప్పమని ఒత్తిడి చేయకుండా ఉండడం ద్వారా ఆమె అలా చేయవచ్చు. ఈ సలహాను పాటించడం ద్వారా భార్య తన భర్తకు మద్దతిస్తుంది, అంతేకాదు తన భర్తమీద నమ్మకం ఉంచిన వాళ్లపై గౌరవం చూపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవాను సంతోషపెడుతుంది. అలా సంఘ శాంతిని, ఐక్యతను కాపాడడానికి తన వంతు తాను కృషి చేస్తుంది.—రోమా. 14:19.
మన మాటలు విన్నప్పుడు యెహోవాకు ఎలా అనిపిస్తుంది?
15. యోబు ముగ్గురు సహచరుల మాటలు విన్నప్పుడు యెహోవా ఎలా స్పందించాడు, ఎందుకు?
15 ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనే విషయాల గురించి యోబు పుస్తకం నుండి ఎంతో నేర్చుకోవచ్చు. యోబుకు ఎన్నో పెద్దపెద్ద కష్టాలు వచ్చినప్పుడు ఆయన్ని ఓదార్చడానికి, సలహా ఇవ్వడానికి నలుగురు వ్యక్తులు వచ్చారు. వాళ్లు కొన్నిరోజుల పాటు మౌనంగా ఉన్నారు. అయితే వాళ్లలో ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనే ముగ్గురి మాటల్ని పరిశీలిస్తే వాళ్లు మౌనంగా ఉన్న సమయంలో యోబుకు ఎలా సహాయం చేయాలో ఆలోచించలేదని అర్థమౌతుంది. బదులుగా యోబు ఏదో తప్పు చేసివుంటాడని, దాన్ని ఎలా నిరూపించాలని వాళ్లు ఆలోచించారు. వాళ్లు చెప్పిన కొన్ని మాటలు నిజాలే అయినా యోబు గురించి, యెహోవా గురించి వాళ్లు చాలావరకు కఠినంగా మాట్లాడారు, అబద్ధాలు చెప్పారు. పైగా యోబు చెడ్డవాడని నిందించారు. (యోబు 32:1-3) మరి యెహోవా ఎలా స్పందించాడు? ఆ ముగ్గురిని యెహోవా తీవ్రంగా కోప్పడుతూ వాళ్లు తెలివితక్కువవాళ్లని అన్నాడు. అంతేకాదు, తమ తరఫున ప్రార్థన చేయమని యోబును వేడుకోమని వాళ్లకు చెప్పాడు.—యోబు 42:7-9.
16. ఎలీఫజు, బిల్దదు, జోఫరుల చెడ్డ ఆదర్శం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
మత్త. 7:1-5) బదులుగా మనం మాట్లాడే ముందు వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినాలి. అప్పుడే మనం వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతాం. (1 పేతు. 3:8) రెండవదిగా మనం మృదువుగా మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. (ఎఫె. 4:25) మూడవదిగా, మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు యెహోవా జాగ్రత్తగా వింటాడని గుర్తుంచుకోవాలి.
16 ఎలీఫజు, బిల్దదు, జోఫరుల చెడ్డ ఆదర్శం నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిగా, మనం మన సహోదరులకు తీర్పు తీర్చకూడదు. (17. మనం ఎలీహు ఉదాహరణ నుండి ఏం నేర్చుకోవచ్చు?
17 యోబు దగ్గరికి వచ్చిన నాలుగో వ్యక్తి పేరు ఎలీహు, అతను అబ్రాహాము బంధువు. యోబు, మిగతా ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు ఆయన విన్నాడు. ఆయన వాళ్ల మాటల్ని జాగ్రత్తగా విన్నాడు కాబట్టే యోబు తన ఆలోచనను సరిదిద్దుకునేలా మృదువుగా, నిజాయితీగా సలహా ఇవ్వగలిగాడు. (యోబు 33:1, 6, 17) ఎలీహు ముఖ్యంగా యెహోవాను ఘనపర్చడం గురించి ఆలోచించాడు; కానీ తనను ఘనపర్చుకోవడం గురించో, వేరేవాళ్లను ఘనపర్చడం గురించో ఆలోచించలేదు. (యోబు 32:21, 22; 37:23, 24) కొన్ని సమయాల్లో మౌనంగా ఉంటూ వినాలని ఎలీహు ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు. (యాకో. 1:19) సలహా ఇస్తున్నప్పుడు మనం ముఖ్యంగా యెహోవాను ఘనపర్చడం గురించే ఆలోచించాలి కానీ, మనల్ని మనం ఘనపర్చుకోకూడదు.
18. మాట్లాడే వరాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని ఎలా చూపించవచ్చు?
18 ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేవాటి విషయంలో బైబిలు సలహాల్ని పాటించడం ద్వారా మనం మాట్లాడే వరాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని చూపించవచ్చు. తెలివిగల రాజైన సొలొమోను దేవుని ప్రేరణతో ఇలా రాశాడు: “సరైన సమయంలో మాట్లాడిన మాట వెండి పళ్లెంలో ఉన్న బంగారు ఆపిల్ పండ్ల లాంటిది.” (సామె. 25:11) మనం వేరేవాళ్లు చెప్పేది జాగ్రత్తగా విన్నప్పుడు, మాట్లాడే ముందు ఆలోచించినప్పుడు మన మాటలు ఆ బంగారు ఆపిల్ పండ్లలా విలువైనవిగా, అందమైనవిగా ఉంటాయి. మనం తక్కువ మాట్లాడినా, ఎక్కువ మాట్లాడినా మన మాటలు ఇతరులను బలపరుస్తాయి, యెహోవా మనల్ని చూసి గర్వపడతాడు. (సామె. 23:15; ఎఫె. 4:29) మాట్లాడే వరాన్ని ఇచ్చిన యెహోవాకు కృతజ్ఞత చూపించడానికి ఇదే సరైన మార్గం!
పాట 82 “మీ వెలుగు ప్రకాశింపనివ్వండి”
^ పేరా 5 మనం ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడానికి సహాయపడే సూత్రాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. బైబిలు చెప్తున్న విషయాల్ని తెలుసుకుని, పాటించినప్పుడు మన మాటలు యెహోవాను సంతోషపెడతాయి.
^ పేరా 62 చిత్రాల వివరణ: ఒక సహోదరి మరో సహోదరికి తెలివైన సలహా ఇస్తోంది.
^ పేరా 64 చిత్రాల వివరణ: ఒక సహోదరుడు శుభ్రంగా ఉండే విషయంలో సలహాలు ఇస్తున్నాడు.
^ పేరా 66 చిత్రాల వివరణ: సరైన సమయంలో అబీగయీలు దావీదుతో మాట్లాడింది, దానివల్ల మంచి ఫలితం వచ్చింది.
^ పేరా 68 చిత్రాల వివరణ: ఒక జంట, నిషేధం ఉన్న దేశంలో మన పని గురించిన వివరాల్ని చెప్పట్లేదు.
^ పేరా 70 చిత్రాల వివరణ: సంఘానికి సంబంధించి రహస్యంగా ఉంచాల్సిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు వేరే ఎవ్వరూ వినకుండా ఒక సంఘ పెద్ద జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.