కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

గువ్వల్నే కాదు, పావురాల్ని కూడా దహనబలిగా అర్పించడానికి యెహోవా అనుమతించడం ఎందుకు మంచిదైంది?

ధర్మశాస్త్రం ప్రకారం గువ్వల్ని, పావురాల్ని రెండిటినీ యెహోవా దహనబలిగా అంగీకరించేవాడు. దహనబలుల గురించి ఇచ్చిన ఆజ్ఞల్లో, ఈ రెండు పక్షులు ఎప్పుడూ కలిపే ప్రస్తావించబడ్డాయి. అలాగే ఒకదానికి బదులు ఇంకోదాన్ని బలిగా అర్పించవచ్చు. (లేవీ. 1:14; 12:8; 14:30) ఆ రెండు పక్షుల్ని బలిగా ఇవ్వడానికి యెహోవా అనుమతించడం ఎందుకు మంచిదైంది? ఒక కారణమేంటంటే, గువ్వలు అన్నిసార్లూ దొరికేవి కావు. ఎందుకు?

గువ్వ

వెచ్చగా ఉండే నెలల్లో గువ్వలు ఇశ్రాయేలు దేశమంతటా ఉండేవి. అయితే ప్రతీ సంవత్సరం అక్టోబరులో, దక్షిణం వైపు వెచ్చగా ఉండే దేశాలకు అవి వలస వెళ్లేవి. తర్వాత, వసంత రుతువులో అవి తిరిగి ఇశ్రాయేలుకు వచ్చేవి. (పరమ. 2:11, 12; యిర్మీ. 8:7) కాబట్టి పూర్వం ఇశ్రాయేలీయులకు, చలికాలంలో గువ్వల్ని దహనబలిగా అర్పించడం కష్టమయ్యేది.

పావురం

కానీ పావురాలు సాధారణంగా వలస వెళ్లవు. కాబట్టి అవి సంవత్సరం పొడుగునా ఇశ్రాయేలులో ఉండేవి. పైగా వాటిని పెంచుకునేవాళ్లు. (యోహాను 2:14, 16 తో పోల్చండి.) బైబిల్‌ ప్లాంట్స్‌ అండ్‌ ఆనిమల్స్‌ పుస్తకం చెప్తున్నట్టు, “పాలస్తీనాలోని అన్ని పల్లెటూరుల్లో, పట్టణాల్లో పావురాల్ని పెంచుకునేవాళ్లు. ప్రతీ ఇంట్లో పావురాలు నివసించడానికి వాటికి ఒక గూడు లేదా ఇంటి గోడకు రంధ్రాలు ఉండేవి.”—యెషయా 60:8 తో పోల్చండి.

గూట్లో ఉన్న పావురం

ఇశ్రాయేలీయులకు సంవత్సరం పొడుగునా దొరికే పక్షుల్ని దహనబలిగా అర్పించడానికి యెహోవా అంగీకరించాడు. ఆ విధంగా ఆయన ప్రేమగల, అర్థంచేసుకునే దేవుడని నిరూపించుకున్నాడు.