అధ్యయన ఆర్టికల్ 48
‘మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయండి’
‘మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయండి.’—2 కొరిం. 8:11.
పాట 35 ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి’
ఈ ఆర్టికల్‌లో . . . *
1. యెహోవా మనకు ఏ స్వేచ్ఛ ఇచ్చాడు?
మనమెలా జీవించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను యెహోవా మనకు ఇచ్చాడు. మనం మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఆయనే నేర్పిస్తున్నాడు. అంతేకాదు, తనను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని చక్కగా అమలు చేసేలా ఆయన సహాయం చేస్తాడు. (కీర్త. 119:173) బైబిల్లో మనం నేర్చుకునే తెలివైన విషయాలను ఎంత ఎక్కువ పాటిస్తే, అంత మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం.—హెబ్రీ. 5:14.
2. మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ సవాలు ఎదురవ్వవచ్చు?
2 మనం మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ, మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం కష్టంగా ఉండవచ్చు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి: ఒక యువ సహోదరుడు బైబిలంతా చదవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని వారాలపాటు బానే చదివాడు కానీ ఆ తర్వాత ఆపేశాడు. ఒక సహోదరి క్రమ పయినీరుగా సేవ చేయాలని నిర్ణయించుకుంది. కానీ దాన్ని మొదలుపెట్టే తేదీని వాయిదా వేస్తూ ఉంది. ఒక సంఘంలోని పెద్దల సభ, ఎక్కువ కాపరి సందర్శనాలు చేయాలని నిర్ణయించుకుంది. కానీ చాలా నెలలు గడిచినా ఆ పనిని మొదలుపెట్టలేదు. వాళ్ల పరిస్థితులు వేరైనా, ఒక్క విషయం మాత్రం అందరిలో కనిపిస్తుంది. అదేంటంటే, వాళ్లు నిర్ణయాలు తీసుకున్నారు గానీ వాటిని పూర్తిగా అమలు చేయలేకపోయారు. మొదటి శతాబ్దంలోని కొరింథు సంఘంలో కూడా అలాంటి సమస్యే తలెత్తింది. వాళ్లనుండి మనం ఏం నేర్చుకోవచ్చో పరిశీలించండి.
3. కొరింథీయులు ఏ నిర్ణయం తీసుకున్నారు? కానీ ఏం జరిగింది?
3 దాదాపు క్రీ.శ. 55లో కొరింథీయులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. యెరూషలేములో అలాగే యూదయలో ఉన్న సహోదరసహోదరీలు కష్టాల్ని, పేదరికాన్ని అనుభవిస్తున్నారని; వాళ్లకు సహాయం 1 కొరిం. 16:1; 2 కొరిం. 8:6) అయితే కొన్ని నెలల తర్వాత, కొరింథీయులు ఇంకా డబ్బు సేకరించలేదని పౌలుకు తెలిసింది. దానివల్ల వేరే సంఘాలు ఇచ్చిన విరాళాలను యెరూషలేముకు తీసుకెళ్లే సమయానికి, కొరింథీయులు ఇవ్వాలనుకున్న బహుమానం సిద్ధంగా ఉండివుండకపోవచ్చు.—2 కొరిం. 9:4, 5.
చేయడానికి వేరే సంఘాలవాళ్లు డబ్బులు సేకరిస్తున్నారని కొరింథీయులకు తెలిసింది. వాళ్లు దయతో, ఉదారతతో ఆ సహోదరసహోదరీలకు సహాయం చేయాలని నిర్ణయించుకొని, ఆ పనిని ఎలా చేయాలో చెప్పమని అపొస్తలుడైన పౌలును సలహా అడిగారు. అప్పుడు, పౌలు ఆ సంఘానికి నిర్దేశాల్ని పంపించి, విరాళాల్ని సేకరించే పనిలో సహాయం చేయడానికి తీతును నియమించాడు. (4. రెండో కొరింథీయులు 8:7, 10, 11 వచనాల ప్రకారం, కొరింథీయులను పౌలు ఏమని ప్రోత్సహించాడు?
4 కొరింథీయులు మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ల బలమైన విశ్వాసాన్ని, ఉదారత చూపించాలనే వాళ్ల కోరికను పౌలు మెచ్చుకున్నాడు. కానీ వాళ్లు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయమని కూడా పౌలు ప్రోత్సహించాల్సి వచ్చింది. (2 కొరింథీయులు 8:7, 10, 11 చదవండి.) దీన్నిబట్టి, మంచి నిర్ణయాల్ని అమలు చేయడం నమ్మకమైన క్రైస్తవులకు కూడా కష్టంగా ఉండవచ్చని అర్థమౌతుంది.
5. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
5 కొరింథీయుల్లాగే, మనకు కూడా నిర్ణయాల్ని అమలు చేయడం కష్టంగా ఉండవచ్చు. ఎందుకు? ఎందుకంటే, మనం అపరిపూర్ణులం కాబట్టి పనుల్ని వాయిదా వేస్తుండవచ్చు. లేదా ఏదైనా అనుకోని సంఘటనలు జరగడం వల్ల మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం చేయడం కుదరకపోవచ్చు. (ప్రసం. 9:11; రోమా. 7:18) మనం గతంలో తీసుకున్న ఒక నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించుకుని, ఏమైనా మార్పులు చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి? మనం మొదలుపెట్టిన పనిని ఎలా పూర్తి చేయవచ్చు? వంటి ప్రశ్నల్ని ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
నిర్ణయం తీసుకోవడానికి ముందు
6. మన నిర్ణయాల్ని ఎప్పుడు మార్చుకోవాల్సి రావచ్చు?
6 కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్ని మనం ఎప్పటికీ మార్చుకోం. ఉదాహరణకు యెహోవా సేవ చేస్తామని, వివాహజతకు నమ్మకంగా ఉంటామని తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం. (మత్త. 16:24; 19:6) అయితే, ఇతర నిర్ణయాలు కాస్త మార్చుకోవాల్సి రావచ్చు. ఎందుకు? ఎందుకంటే పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. మరి వీలైనంత శ్రేష్ఠమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి?
7. మనం దేని కోసం ప్రార్థించాలి? ఎందుకు?
7 తెలివి కోసం ప్రార్థించండి. యెహోవా ప్రేరణతో యాకోబు ఇలా రాశాడు: ‘మీలో ఎవరికైనా తెలివి కొరవడితే అతను దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఆయన అందరికీ ఉదారంగా ఇచ్చే దేవుడు.’ (యాకో. 1:5) ఏదోక విషయంలో మనందరికి ‘తెలివి కొరవడుతుంది.’ కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు అలాగే ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చినప్పుడు యెహోవాపై ఆధారపడండి. అప్పుడు మీరు తెలివైన నిర్ణయం తీసుకునేలా యెహోవా సహాయం చేస్తాడు.
8. నిర్ణయం తీసుకునే ముందు ఏం చేయాలి?
8 లోతుగా పరిశోధన చేయండి. దేవుని వాక్యాన్ని, యెహోవా సంస్థ తయారుచేసిన ప్రచురణల్ని చదవండి, అలాగే మీకు మంచి సలహా ఇచ్చేవాళ్లతో మాట్లాడండి. (సామె. 20:18) వేరే ఉద్యోగంలో చేరడం, మరో ప్రాంతానికి వెళ్లడం, మిమ్మల్ని మీరు పోషించుకుంటూ యెహోవా సేవ ఎక్కువగా చేసేందుకు సహాయపడే చదువును ఎంపిక చేసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకునే ముందు అలా లోతుగా పరిశోధన చేయడం ప్రాముఖ్యం.
9. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మన ఉద్దేశాల్ని పరిశీలించుకోవడం ఎందుకు ప్రయోజనకరం?
9 మీ ఉద్దేశాల్ని పరిశీలించుకోండి. యెహోవా హృదయాన్ని పరిశీలిస్తాడు కాబట్టి మన ఉద్దేశాలు ఆయనకు ప్రాముఖ్యం. (1 సమూ. 16:7) మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, మన ఉద్దేశాలేంటో అర్థమౌతాయి. అయితే, ఆ ఉద్దేశాలు మన హృదయం నుండి వచ్చినవేనా లేదా వాటికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మన హృదయంలో నిజంగా ఏముందో పరిశీలించుకున్నప్పుడు మనం సరైనది చేయగలుగుతాం. ఒక నిర్ణయం వెనుక తప్పుడు ఉద్దేశం ఉంటే, భవిష్యత్తులో సమస్యలు వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మనకు కష్టంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక సహోదరుడు క్రమ పయినీరు అవ్వాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. కానీ కొంతకాలం తర్వాత, తాను చేరుకోవాల్సిన గంటల్ని చేరుకోలేకపోవచ్చు, దానివల్ల పరిచర్యను ఆనందించకపోవచ్చు. ఎందుకు? బహుశా అతను, యెహోవాను సంతోషపెట్టాలనే కోరికతోనే పయినీరు సేవ మొదలుపెట్టానని అనుకోవచ్చు. కానీ అతను తన తల్లిదండ్రుల్ని లేదా ఇంకెవ్వరినైనా సంతోషపెట్టడానికే పయినీరు సేవ మొదలుపెట్టి ఉండవచ్చు.
10. ఏదైనా అలవాటు మానుకోవాలంటే ఒకవ్యక్తికి ఏం ఉండాలి?
10 ఉదాహరణకు, ఒక బైబిలు విద్యార్థి సిగరెట్ మానేయాలని నిర్ణయించుకున్నాడు. అలా చేయడం కష్టమే అయినా, ఒకటి రెండు వారాలు సిగరెట్ తాగకుండా ఉండగలిగాడు గానీ ఆ తర్వాత మళ్లీ తాగడం మొదలుపెట్టాడు. అయితే, చివరికి అతను సిగరెట్ మానేశాడు! యెహోవా మీదున్న ప్రేమ, ఆయన్ని సంతోషపెట్టాలనే కోరిక వల్ల అతను ఆ అలవాటు మానుకోగలిగాడు.—కొలొ. 1:10; 3:23.
11. నిర్దిష్టమైన లక్ష్యాలు ఎందుకు ఉండాలి?
11 నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకోండి. మీరు నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుంటే, వాటిని చేరుకోవడం తేలికౌతుంది. ఉదాహరణకు, మీరు బైబిల్ని ఎక్కువసార్లు చదవాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. కానీ మీకు ఒక నిర్దిష్టమైన పట్టిక లేకపోతే, మీరు అనుకున్నది చేయలేకపోవచ్చు. * లేదా సంఘపెద్దలు ఎక్కువసార్లు కాపరి సందర్శనం చేయాలని నిర్ణయించుకోవచ్చు, కానీ కొన్నిరోజులు గడిచాక కూడా వాళ్లు దాన్ని చేయలేకపోయారు. వాళ్లు తమ నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటే, ఈ ప్రశ్నలు వేసుకోవచ్చు: “మేము కాపరి సందర్శనం చేస్తే ప్రయోజనం పొందే సహోదరసహోదరీల లిస్టు తయారు చేసుకున్నామా? వాళ్లను కలవడానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించామా?”
12. మనం ఏం చేయాల్సిన అవసరం రావచ్చు? ఎందుకు?
12 మీరు చేయగలిగినవి చేయండి. అనుకున్నవన్నీ చేసేంత సమయం, శక్తి, వనరులు మనలో ఎవ్వరికీ ఉండవు. కాబట్టి సహేతుకంగా ఉంటూ మీరు చేయగలిగినవి చేయండి. అవసరమైతే, మీ శక్తికి మించిన పని చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావచ్చు. (ప్రసం. 3:6) మీరు తీసుకున్న నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించుకొని, దాన్ని మార్చుకున్నారు, ఆ పని చేయగలనని మీకు అనిపించింది. అయితే, మీరు మొదలుపెట్టే పనిని పూర్తి చేయడానికి సహాయం చేసే ఐదు విషయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
నిర్ణయం తీసుకున్న తర్వాత
13. మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారం “ప్రవర్తించే శక్తిని” ఎలా పొందవచ్చు?
13 మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రవర్తించే శక్తి కోసం ప్రార్థించండి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారం “ప్రవర్తించే శక్తిని” దేవుడు మీకు ఇస్తాడు. (ఫిలి. 2:13) కాబట్టి పవిత్రశక్తిని ఇవ్వమని యెహోవాను అడగండి. మీరు అడిగింది ఆలస్యమైనట్టు అనిపించినా సరే ప్రార్థిస్తూనే ఉండండి. యేసు ఇలా చెప్పాడు, “అడుగుతూ ఉండండి, మీకు [పవిత్రశక్తి] ఇవ్వబడుతుంది.”—లూకా 11:9, 13.
14. మీ నిర్ణయాన్ని అమలుచేయడానికి సామెతలు 21:5లో ఉన్న సూత్రం ఎలా సహాయం చేస్తుంది?
14 ప్రణాళిక వేసుకోండి. (సామెతలు 21:5 చదవండి.) మీరు మొదలుపెట్టిన ఏదైనా పనిని పూర్తి చేయాలంటే, ప్రణాళిక వేసుకోవడంతో పాటు దాని ప్రకారం పని చేయడం కూడా అవసరం. అదేవిధంగా, మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, దాన్ని అమలుచేయడానికి ఏమేమి చేయాలని మీరు అనుకుంటున్నారో ఒక లిస్టు రాసుకోండి. పెద్దపెద్ద పనుల్ని చిన్నచిన్న పనులుగా విభాగిస్తే, మీరు ఎంత పని పూర్తి చేశారో తేలిగ్గా గుర్తించగలుగుతారు. పౌలు తమ దగ్గరకు వచ్చాక కొరింథీయులు విరాళాలు సేకరించే బదులు, “ప్రతీవారం మొదటి రోజున” కొంత డబ్బు తీసి పక్కకు పెట్టుకోమని ఆయన వాళ్లను ప్రోత్సహించాడు. (1 కొరిం. 16:2) మీరు కూడా పెద్దపెద్ద పనుల్ని చిన్నచిన్న పనులుగా విభాగిస్తే మీ పనిని సులువుగా పూర్తి చేయగలుగుతారు.
15. ప్రణాళిక వేసుకున్నాక ఏం చేయాలి?
15 మీ ప్రణాళికను రాసి పెట్టుకుంటే, దాన్ని 1 కొరిం. 14:40) ఉదాహరణకు, పెద్దల సభ తాము తీసుకున్న నిర్ణయాలన్నీ రాయడానికి ఒక పెద్దను నియమించాలని నిర్దేశించబడింది. ఆ నిర్ణయాలతోపాటు, ఆ పని ఎవరు చేయాలో, ఎప్పటిలోగా చేయాలో కూడా ఆయన రాయాలి. అలా రాసి పెట్టుకుంటే, వాళ్లు తీసుకున్న నిర్ణయం ప్రకారం పనిచేయడం తేలికౌతుంది. (1 కొరిం. 9:26) మీ రోజూవారి జీవితంలో కూడా మీరు అదే చేయవచ్చు. ఉదాహరణకు, రోజూ ఏమేం చేయాలో ఒక లిస్టు రాసుకోవచ్చు, దాంట్లో ఏది ముందు చేయాలనుకుంటున్నారో దాన్ని అన్నిటికన్నా పైన రాసిపెట్టుకోండి. అలా చేయడం వల్ల మీరు మొదలుపెట్టిన పనిని సులభంగా పూర్తి చేయడం మాత్రమే కాదు, తక్కువ సమయంలో ఎక్కువ చేయగలుగుతారు.
పాటించడం తేలికౌతుంది. (16. మీ నిర్ణయాన్ని అమలు చేయాలంటే ఏం అవసరం? రోమీయులు 12:11 ఆ విషయాన్ని ఎలా నొక్కిచెప్తుంది?
16 కష్టపడండి. మీ ప్రణాళికను పాటించడానికి, మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది. (రోమీయులు 12:11 చదవండి.) తిమోతి మంచి బోధకుడు అవ్వాలంటే, ఆ పనిలో ‘నిమగ్నమవ్వాలని,’ “పట్టుదల” చూపించాలని పౌలు చెప్పాడు. యెహోవా సేవలో మనం చేయాలనుకున్న ఏ పని విషయంలోనైనా ఆ సలహా పాటించవచ్చు.—1 తిమో. 4:13, 16.
17. మీ నిర్ణయాన్ని అమలుచేయడానికి ఎఫెసీయులు 5:15, 16 వచనాల్ని ఎలా పాటించవచ్చు?
17 మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. (ఎఫెసీయులు 5:15, 16 చదవండి.) మీ నిర్ణయాన్ని అమలుచేయడానికి ఒక సమయం పెట్టుకోండి, దానికి కట్టుబడి ఉండండి. పని మొదలుపెట్టడానికి అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురు చూడకండి; ఎందుకంటే మీరు ఎదురుచూసే ఆ పరిస్థితులు ఎప్పుడూ రాకపోవచ్చు. (ప్రసం. 11:4) తక్కువ ప్రాముఖ్యమైన పనులు మీ సమయాన్ని, శక్తిని హరించివేయకుండా జాగ్రత్తపడండి. (ఫిలి. 1:10) వీలైతే, మీరు చేస్తున్న పనికి అంతరాయం కలగని సమయాన్ని ఎంచుకోండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని ఇతరులకు చెప్పండి. బహుశా ఆ సమయంలో మీ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయండి. ఈ-మెయిల్స్‌ని లేదా సోషల్ మీడియాను వేరే సమయంలో చూసుకోండి. *
18-19. అడ్డంకులు వచ్చినా పట్టుదలగా ముందుకు సాగడానికి మీకేది సహాయం చేస్తుంది?
18 ఫలితాల మీద మనసుపెట్టండి. మీ నిర్ణయానికి వచ్చే ఫలితం గమ్యం లాంటిది. మీరు ఆ గమ్యాన్ని చేరుకోవాలని బలంగా కోరుకుంటే, మార్గమధ్యలో ఏమైనా అంతరాయం వచ్చినా మీరు వేరే దారిలోనైనా అక్కడికి వెళ్తారు. అదేవిధంగా, మన నిర్ణయాలకు వచ్చే ఫలితాల మీద మనసుపెడితే, అడ్డంకులు వచ్చినా సరే పట్టుదలగా ముందుకు సాగుతాం.—గల. 6:9.
19 మంచి నిర్ణయాలు తీసుకోవడం కష్టం, వాటిని అమలుచేయడం కూడా అంత తేలిక కాదు. కానీ మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి కావాల్సిన తెలివిని, శక్తిని యెహోవా ఇస్తాడు.
పాట 65 ముందుకు సాగిపోదాం!
^ పేరా 5 మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని బట్టి ఎప్పుడైనా బాధపడ్డారా? లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం మీకు కొన్నిసార్లు కష్టంగా ఉందా? అయితే ఆ సవాళ్లను అధిగమించడానికి, మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
^ పేరా 11 బైబిలు క్రమంగా చదివేలా మంచి ప్రణాళిక వేసుకోవడానికి jw.orgలో అందుబాటులో ఉన్న “బైబిలు పఠనం కోసం పట్టిక” చూడండి.
^ పేరా 17 సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించి మరింత సమాచారం కోసం, w06 8/1 8-10 పేజీల్లో ఉన్న “దాన్ని ఆదాచేయలేరు కాబట్టి సద్వినియోగం చేసుకోండి” అనే ఆర్టికల్ చూడండి.