కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

సరైన కారణాలు లేకుండా పెళ్లికాని ఒక పురుషుడు, ఒక స్త్రీ కలిసి రాత్రంతా గడిపితే, న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేసేంత పెద్ద తప్పు చేసినట్లా?

అవును, సరైన కారణాలు లేకుండా వాళ్లిద్దరూ మాత్రమే కలిసి రాత్రంతా గడిపితే, వాళ్లు లైంగిక పాపం చేశారనడానికి అదొక బలమైన ఆధారం. కాబట్టి సరైన కారణాలు లేకుండా అలాచేస్తే, న్యాయనిర్ణయ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది.—1 కొరిం. 6:18.

న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేయాలా వద్దా అని నిర్ణయించడానికి పెద్దలసభ ప్రతీ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఉదాహరణకు: వాళ్లిద్దరూ డేటింగ్‌ చేస్తున్నారా? గతంలో వాళ్లిద్దరి ప్రవర్తనను బట్టి పెద్దలు లేఖనాధార సలహా ఇచ్చారా? ఆరోజు రాత్రి ఎందుకు కలిసి ఉండాల్సివచ్చింది? వాళ్లు ముందే పథకం వేసుకున్నారా? వాళ్లు ఆ పరిస్థితిని తప్పించుకునే అవకాశం ఉందా? లేదా ఏదైనా అనుకోని సంఘటన వల్లో, అత్యవసర పరిస్థితి వల్లో అలా ఉండాల్సి వచ్చిందా? (ప్రసం. 9:11) వాళ్లు ఎక్కడ నిద్రపోయారు? వంటివి పెద్దలసభ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని సందర్భాల్లో పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి పెద్దలు ఇతర విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి రావచ్చు.

వాస్తవాలన్నీ పరిశీలించాక పెద్దలసభ న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేయాలో వద్దో నిర్ణయిస్తుంది.