కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు మాటల అర్థం

మీకు విశ్వాసం ఉందా?

మీకు విశ్వాసం ఉందా?

దేవున్ని సంతోషపెట్టాలంటే మనకు విశ్వాసం ఉండాలి. అయితే, బైబిలు ఇలా చెప్తుంది, “విశ్వాసం అందరికీ లేదు.” (2 థెస్స. 3:2) అపొస్తలుడైన పౌలు ఈ మాటల్ని చెప్తున్నప్పుడు, తనకు “హానిచేసే దుష్టుల” గురించి మాట్లాడాడు. కానీ విశ్వాసం గురించి ఆయన చెప్పిన మాట చాలామందికి వర్తిస్తుంది. కొంతమంది సృష్టికర్త ఉన్నాడనే స్పష్టమైన రుజువుల్ని పట్టించుకోరు. (రోమా. 1:20) ఇంకొంతమందేమో, మనందర్నీ నడిపించే శక్తి ఏదో ఉందని నమ్ముతారు. కానీ యెహోవాను సంతోషపెట్టాలంటే అలాంటి నమ్మకాలు ఉంటే సరిపోదు.

యెహోవా ఉన్నాడని, బలమైన విశ్వాసం ఉన్నవాళ్లకు ఆయన “ప్రతిఫలం” ఇచ్చే దేవుడని మనం నమ్మాలి. (హెబ్రీ. 11:6) విశ్వాసం పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఒకటి. ఒక వ్యక్తికి పవిత్రశక్తి కావాలంటే యెహోవాను అడగాలి. (లూకా 11:9, 10, 13) అలాగే పవిత్రశక్తి కావాలంటే, దేవుడు ప్రేరేపించి రాయించిన బైబిల్ని చదవడం ముఖ్యం. ఆ తర్వాత, చదివిన దానిగురించి ఆలోచించాలి, నేర్చుకున్నవి పాటించాలి. అలా చేయడం వల్ల, మనకు విశ్వాసం ఉందని చూపించేలా బ్రతకడానికి పవిత్రశక్తి మన మీద పనిచేసేలా అనుమతిస్తాం.