కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు ఆరాధనలో సిలువను ఎందుకు ఉపయోగించరు?

యెహోవాసాక్షులు ఆరాధనలో సిలువను ఎందుకు ఉపయోగించరు?

సిలువ క్రైస్తవత్వానికి గుర్తింపు చిహ్నమని చాలామంది అనుకుంటారు. యెహోవాసాక్షులమైన మేము క్రైస్తవులమే అయినా ఆరాధనలో సిలువను ఉపయోగించం. ఎందుకు?

ఒక కారణమేమిటంటే, యేసు సిలువ మీద కాదుగానీ ఒక మామూలు కొయ్య మీద చనిపోయాడని బైబిలు చెబుతుంది. అంతేకాదు, “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి” అని క్రైస్తవులను బైబిలు గట్టిగా హెచ్చరిస్తుంది. అంటే, ఆరాధనలో సిలువను ఉపయోగించకూడదని దానర్థం.—1 కొరింథీయులు 10:14; 1 యోహాను 5:21.

మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని యేసు చెప్పాడని గమనించండి. (యోహాను 13:34, 35) అలా, సిలువో ఇంకేదో కాదుగానీ నిస్వార్థ ప్రేమే తన నిజ అనుచరులకు గుర్తింపు చిహ్నంగా ఉంటుందని యేసు చెప్పాడు.