కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తూ రక్షణ సంపాదించుకోవాలని అనుకుంటున్నారా?

యెహోవాసాక్షులు ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తూ రక్షణ సంపాదించుకోవాలని అనుకుంటున్నారా?

లేదు. నిజమే, మేము క్రమం తప్పకుండా ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తాం, అయితే రక్షణ ఆ పనికి ప్రతిఫలమని మేము అనుకోవట్లేదు. (ఎఫెసీయులు 2:8) ఎందుకని?

దీని గురించి ఒకసారి ఆలోచించండి: మంచి మనసున్న ఒకాయన ఫలానా తేదీన, ఫలానా చోటకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ఖరీదైన బహుమానం ఇస్తానని మాటిచ్చాడు. మీరు ఆయన మాటను నిజంగా నమ్మితే ఆయన చెప్పినట్టు చేయరా? తప్పకుండా చేస్తారు. అలాగే, దాని గురించి మీరు మీ ఇంట్లోవాళ్లకు, స్నేహితులకు కూడా చెబుతారు, ఎందుకంటే వాళ్లు కూడా ఆ బహుమానం పొందాలని మీరు కోరుకుంటారు. ఆయన చెప్పినట్లు చేసి మీరు ఆ బహుమతిని అందుకున్నంత మాత్రాన అది మీరు సంపాదించుకున్నది అవదు. అది బహుమతి, అంతే.

అలాగే, తాను చెప్పినట్టు చేసే వాళ్లందరికీ శాశ్వత జీవం ఇస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని యెహోవాసాక్షులు నమ్ముతారు. (రోమీయులు 6:23) చావే లేని అలాంటి జీవితం అందరికీ దక్కాలన్నదే మా కోరిక, అందుకే మా నమ్మకం గురించి అందరికీ చెప్పడానికి కృషిచేస్తాం. అయితే, మేము ప్రకటనా పని చేస్తున్నాం కాబట్టి మాకు రక్షణ దొరికి తీరుతుందని మేము అనుకోం. (రోమీయులు 1:17; 3:28) నిజానికి దేవుడిచ్చే ఆ అద్భుతమైన ఆశీర్వాదం పొందడానికి సరిపడా యోగ్యతను ఏమి చేసినా కూడా మనిషి సంపాదించుకోలేడు. ‘మనం నీతిని అనుసరించి చేసిన క్రియల వల్ల కాక, తన కనికరం వల్లే ఆయన మనల్ని రక్షించాడు.’—తీతు 3:5.