కంటెంట్‌కు వెళ్లు

బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?

బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?

యెహోవాసాక్షులు ప్రతిపాదించే బైబిలు అధ్యయన కార్యక్రమం చాలా ప్రశ్నలకు జవాబులనిస్తుంది, వాటిలో కొన్ని ఇవి:

  • దేవుడు ఎవరు?

  • దేవునికి నా మీద నిజంగా శ్రద్ధ ఉందా?

  • మా దాంపత్య జీవితం మెరుగవ్వాలంటే నేను ఏమి చేయాలి?

  • జీవితంలో నాకు సంతోషం ఎలా దొరుకుతుంది?

మేము నిర్వహించే బైబిలు అధ్యయన కార్యక్రమం గురించి ప్రజలు తరచూ అడిగే ప్రశ్నలకు జవాబులను కింద చూడొచ్చు.

అధ్యయన కోర్సు ఎలా ఉంటుంది? “దేవుడు” లేదా “వివాహం” వంటి అంశాలను ఎంపికచేసుకుని, వాటికి సంబంధించిన వివిధ లేఖనాలను చూస్తాం. ఆ లేఖనాల మధ్య ఉన్న పోలికలను పరిశీలిస్తూ ఆయా అంశాల గురించి బైబిలు ఏమి చెబుతుందో గ్రహిస్తాం. ఈ విధంగా బైబిలు నుండే జవాబులను కనుక్కొంటాం.

మేము బైబిలు అధ్యయనం చేయడానికి, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకం ఉపయోగిస్తాం. దేవుడు, యేసు, మన భవిష్యత్తు వంటివాటి గురించి, ఇంకా ఇతర విషయాల గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో ఆ పుస్తకంలో స్పష్టంగా వివరించబడింది.

బైబిలు అధ్యయనానికి ఎంత ఖర్చు అవుతుంది? అధ్యయనం ఉచితం. అధ్యయన పుస్తకాలకు వెల ఉండదు.

అధ్యయన నిడివి ఎంత? చాలామంది తమతో బైబిలు అధ్యయనం చేయడానికి ప్రతీవారం ఇంచుమించు ఒక గంట కేటాయిస్తారు. ఇది అందరికీ ఒకేలా ఉండదు. మీరు కేటాయించగలిగే సమయాన్నిబట్టి అది ఉంటుంది.

బైబిలు అధ్యయనం కావాలని నేను అడిగినప్పుడు ఏమి జరుగుతుంది? బైబిలు అధ్యయనం కావాలని మీరు కోరితే, యెహోవాసాక్షుల్లో ఒకరు మీరు చెప్పిన సమయానికి, మీరు చెప్పిన స్థలానికి వచ్చి మిమ్మల్ని కలుస్తారు. అతను లేదా ఆమె మేము బైబిలు అధ్యయనం ఎలా నిర్వహిస్తామో కొన్ని నిమిషాలు చూపిస్తారు. మీకు నచ్చితే అధ్యయనం కొనసాగించవచ్చు.

నేను బైబిలు అధ్యయనం అంగీకరిస్తే తప్పకుండా యెహోవాసాక్షిని అవ్వాలనేమైనా ఉందా? లేదు. యెహోవాసాక్షులు బైబిలు గురించి ప్రజలకు బోధించడానికి సంతోషిస్తారు, కానీ మేము ఎప్పుడూ మా మతంలో కలవమని ఎవ్వరినీ బలవంతం చేయం. దేన్ని నమ్మాలో నిర్ణయించుకునే హక్కు ఆమెకు లేదా అతనికి ఉందని గుర్తిస్తూ బైబిలు ఏమి చెబుతుందో గౌరవపూర్వకంగా వివరిస్తాం.—1 పేతురు 3:15.