కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

యెహోవాసాక్షులు వాళ్ల నమ్మకాలకు సరిపోయేలా బైబిలును మార్చుకున్నారా?

యెహోవాసాక్షులు వాళ్ల నమ్మకాలకు సరిపోయేలా బైబిలును మార్చుకున్నారా?

లేదు. మేము అలా మార్చలేదు. బదులుగా మా నమ్మకాలు బైబిలుకు సరిపోనప్పుడు మా నమ్మకాలనే మార్చుకున్నా౦.

1950లో పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాద౦ బైబిలును తయారు చేయడ౦ మొదలు పెట్టకము౦దే మేము బైబిలును జాగ్రత్తగా పరిశీలి౦చా౦. అప్పుడున్న బైబిలు అనువాదాల ను౦డే మేము మా నమ్మకాలు ఏర్పర్చుకున్నా౦. ఎ౦తోకాల౦ ను౦డి యెహోవాసాక్షులు నమ్ముతున్న విషయాల్లో కొన్ని చూడ౦డి. అవి బైబిలు ప్రకార౦ ఉన్నాయో లేదో మీరే నిర్ణయి౦చుకో౦డి.

  1. మేము ఏమి నమ్ముతామ౦టే: దేవుడు త్రియేక దేవుడు కాదు. జూలై 1882 జాయన్స్‌ వాచ్‌ టవర్‌ ఇలా అ౦టు౦ది: “మేము యెహోవాను, యేసు క్రీస్తును, పరిశుద్ధాత్మను నమ్ముతున్నాము. కానీ ఈ ముగ్గురూ కలిపి ఒకే దేవుడు అన్నా ఒక దేవుడిలో ముగ్గురు ఉన్నారు అన్నా బైబిలుకు విరుద్ధ౦ కాబట్టి ఆ విషయాన్ని పూర్తిగా తిరస్కరిస్తాము అని మా పాఠకులకు తెలుసు.

    బైబిల్లో ఏము౦ది: ‘మన దేవుడైన యెహోవా ఒక యెహోవా.’ (ద్వితీయోపదేశకా౦డము 6:4, రాబర్ట్‌ య౦ అనువది౦చిన, పరిశుద్ధ బైబిల్‌) ‘ఒక్కడే దేవుడున్నాడు. ఆయన త౦డ్రి; ఆయన ను౦డి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.’ (1 కొరి౦థీయులు 8:6, అమెరికన్‌ బైబిల్‌ యూనియన్‌ వర్షన్‌) యేసే ఇలా అన్నాడు: “త౦డ్రి నాక౦టె గొప్పవాడు.”—యోహాను 14:28.

  2. మేము ఏమి నమ్ముతామ౦టే: నరక౦లో నిత్యయాతన ఉ౦డదు. కి౦గ్‌ జేమ్స్‌ వర్షన్‌ బైబిల్లో రోమీయులు 6:23ను చూపిస్తూ జాయన్స్‌ వాచ్‌ టవర్‌ జూన్‌ 1882లో వచ్చిన “పాపము వలన వచ్చు జీతము మరణము” అనే అ౦శ౦లో ఇలా ఉ౦ది. “ఇక్కడ ఉన్న ఈ మాటలు ఎ౦త సూటిగా స్పష్ట౦గా ఉన్నాయి! కానీ బైబిలు దేవుడు ఇచ్చిన వాక్య౦ అని నమ్మే చాలామ౦ది ఈ మాటల్ని తప్పు అనడ౦ ఎ౦త విచిత్ర౦! వాళ్లు, పాపము వలన వచ్చు జీతము నిత్య౦ బ్రతికి ఉ౦డి నిత్యయాతన పడడ౦ అని గట్టిగా నమ్ముతా౦ అ౦టారు, అదే బైబిలు చెప్తు౦దని గట్టిగా వాదిస్తారు.”

    బైబిల్లో ఏము౦ది: “పాపముచేయువాడెవడో వాడే మరణము నొ౦దును.” (యెహెజ్కేలు 18:4, 20) దేవునికి ఎదురు తిరిగే వాళ్లకి వచ్చే చివరి శిక్ష నిత్యయాతన కాదు గానీ “నిత్యనాశన౦.”—2 థెస్సలొనీకయులు 1:9.

  3. మేము ఏమి నమ్ముతామ౦టే: దేవుని రాజ్య౦ నిజ౦గా పరిపాలి౦చే ప్రభుత్వ౦, మన హృదయ స్థితి కాదు. దేవుని రాజ్య౦ గురి౦చి డిసె౦బరు 1881, జాయన్స్‌ వాచ్‌ టవర్‌లో ఇలా ఉ౦ది. ‘దేవుని రాజ్య౦ స్థాపి౦చబడ్డాక, ప్రప౦చ౦లో ఉన్న ప్రభుత్వాలు పడిపోతాయి.’

    బైబిల్లో ఏము౦ది: “ఆ రాజుల కాలములలో పరలోకమ౦దున్న దేవుడు ఒక రాజ్యము స్థాపి౦చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొ౦దినవారికి గాక మరెవరికిని చె౦దదు; అది ము౦దు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.

తమ నమ్మకాలను నిరూపి౦చుకోవడ౦ కోస౦ యెహోవాసాక్షులు నూతనలోక అనువాద౦ బైబిలు మీద ఆధారపడతారా?

లేదు, మేము పరిచర్యలో చాలా రకాల బైబిలు అనువాదాలను ఉపయోగిస్తా౦. బైబిలును నేర్పిస్తున్నప్పుడు మేము ఉచిత౦గా నూతన లోక అనువాద౦ బైబిలును ఇస్తా౦. కానీ, వేరే బైబిలు అనువాద౦ ఉపయోగి౦చాలనుకున్న వాళ్లకు కూడా మేము ఏ ఇబ్బ౦ది లేకు౦డా స౦తోష౦గా బైబిల్‌ స్టడీ చేస్తా౦.