కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షుల పరిపాలక సభ అంటే ఏంటి?

యెహోవాసాక్షుల పరిపాలక సభ అంటే ఏంటి?

 పరిపాలక సభ పరిణతిగల క్రైస్తవులతో కూడిన ఒక చిన్న గుంపు. వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులకు నిర్దేశాన్ని ఇస్తారు. వాళ్లు రెండు విధాలుగా పనిచేస్తారు.

 మొదటి శతాబ్దంలో యెరూషలేములో ఉన్న అపొస్తలులు, పెద్దలు క్రైస్తవ సంఘమంతటి తరఫున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవాళ్లు. వాళ్లు పాటించిన పద్ధతినే పరిపాలక సభ సభ్యులు కూడా ఇప్పుడు పాటిస్తున్నారు. (అపొస్తలుల కార్యాలు 15:2) అప్పుడున్న నమ్మకమైన అపొస్తలులు, పెద్దలులాగే ఇప్పుడున్న పరిపాలక సభ సభ్యులు కూడా మా సంస్థకు నాయకులు కాదు. యెహోవా దేవుడు యేసుక్రీస్తును సంఘానికి నాయకునిగా నియమించాడని గుర్తిస్తూ వాళ్లు బైబిలు ఇస్తున్న నిర్దేశాన్ని పాటిస్తారు.—1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 5:23.

పరిపాలక సభలో ఎవరెవరు ఉన్నారు?

 పరిపాలక సభలో ఎవరెవరు ఉన్నారంటే: జూ. కెన్నెత్‌ కుక్‌, ఫ్లీగల్‌ గేజ్‌, సామ్యూల్‌ హెర్డ్‌, జెఫ్రీ జాక్సన్‌, స్టీఫెన్‌ లెట్‌, గెరిట్‌ లోష్‌, మార్క్‌ సాండర్సన్‌, డేవిడ్‌ స్ప్లేన్‌, విండర్‌ జెఫ్రీ. వీళ్లు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న వార్విక్‌లో మా ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేస్తారు.

పరిపాలక సభ ఒక పద్ధతి ప్రకారం ఎలా పనిచేస్తుంది?

 వేర్వేరు పనులను పర్యవేక్షించడానికి పరిపాలక సభ ఆరు కమిటీలను ఏర్పాటు చేసింది. పరిపాలక సభలోని ప్రతీ ఒక్కరు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కమిటీల్లో పనిచేస్తారు.

 •   కో-ఆర్డినేటర్స్‌ కమిటీ: న్యాయపరమైన విషయాలను చూసుకుంటుంది, విపత్తులు వచ్చినప్పుడు, తమ మత నమ్మకాల కారణంగా సాక్షులు హింసను ఎదుర్కొన్నప్పుడు అలాగే యెహోవాసాక్షులకు సంబంధించిన ఇతర ముఖ్యమైన విషయాల్లో కూడా సహాయం చేస్తుంది.

 •   పర్సోనెల్‌ కమిటీ: బెతెల్‌ కుటుంబసభ్యులకు కావాల్సిన ఏర్పాట్లను చూసుకుంటుంది.

 •   పబ్లిషింగ్‌ కమిటీ: బైబిలు ఆధారిత పుస్తకాలను తయారుచేసే పనిని, వాటిని వేర్వేరు దేశాలకు పంపించే పనిని, ఆరాధనా స్థలాలనూ అనువాద కార్యాలయాలనూ బ్రాంచి కార్యాలయాలనూ కట్టే పనిని చూసుకుంటుంది.

 •   సర్వీస్‌ కమిటీ: దేవుని ‘రాజ్య సువార్తను’ ప్రకటించే పనిని చూసుకుంటుంది.—మత్తయి 24:14.

 •   టీచింగ్‌ కమిటీ: కూటాలు, పాఠశాలలు, ఆడియో-వీడియో కార్యక్రమాల రూపంలో ఆధ్యాత్మిక ఆహారాన్ని తయారుచేసే పనిని చూసుకుంటుంది.

 •   రైటింగ్‌ కమిటీ: ముద్రిత రూపంలో అలాగే వెబ్‌సైట్‌ ద్వారా అందజేసే ఉపదేశాన్ని తయారుచేసే పనిని నిర్దేశిస్తుంది, అనువాద పనిని కూడా చూసుకుంటుంది.

 ఈ కమిటీల్లో పనిచేయడంతోపాటు, సంస్థకున్న అవసరాల గురించి మాట్లాడుకోవడానికి పరిపాలక సభలోని సహోదరులందరూ ప్రతీవారం ఒక రోజు కలుసుకుని ఓ కూటం జరుపుకుంటారు. ఇలా కలుసుకున్నప్పుడు, లేఖనాలు చెప్తున్న విషయాలను చర్చించుకుంటారు అలాగే పవిత్రశక్తి నడిపింపు కోసం చూస్తూ అందరూ ఒకే అభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడానికి కృషిచేస్తారు.—అపొస్తలుల కార్యాలు 15:25.

పరిపాలక సభ సభ్యులకు సహాయకులు ఎవరు?

 నమ్మకస్థులైన క్రైస్తవులు పరిపాలక సభ కమిటీలకు సహాయం చేస్తారు. (1 కొరింథీయులు 4:2) వాళ్లను ఏ కమిటీకైతే నియమిస్తారో ఆ కమిటీలో జరిగే పనిని చేయగల సామర్థ్యం, అనుభవం వాళ్లకు ఉంటుంది. ఆ కమిటీలోని వాళ్లు ప్రతీవారం జరుపుకునే కూటానికి వాళ్లు కూడా వెళ్తారు. వాళ్లు నిర్ణయాలు తీసుకోకపోయినా, పరిపాలక సభ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాళ్లకు ఉపయోగపడే సలహాలు, కావాల్సిన సమాచారాన్ని ఇస్తారు, తీసుకున్న నిర్ణయాలను పాటిస్తారు, అలా చేయడంవల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో కూడా గమనిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో ఉంటున్న మన సహోదరసహోదరీలను వెళ్లి కలవడం, వార్షిక కూటాలు లేదా గిలియడ్‌ గ్రాడ్యుయేషన్‌ వంటి కార్యక్రమాల్లో ప్రసంగాలు ఇవ్వడం వంటి నియామకాలు పరిపాలక సభ వాళ్లకు అప్పగిస్తుంది.

సహాయకులుగా పనిచేస్తున్న సహోదరులు

కమిటీ

పేరు

కో-ఆర్డినేటర్స్‌

 • జాన్‌ ఎక్రన్‌

 • గిల్లిస్‌ పాల్‌

 • స్నిడర్‌ ట్రాయ్‌

పర్సోనెల్‌

 • జెరల్డ్‌ గ్రిజల్‌

 • పాట్రిక్‌ లఫ్రాంకా

 • డానియెల్‌ మోల్చన్‌

 • మార్క్‌ స్కాట్‌

 • రాల్ఫ్‌ వాల్స్‌

పబ్లిషింగ్‌

 • రాబర్ట్‌ బట్లర్‌

 • హెరాల్డ్‌ కార్కెర్న్‌

 • గాజుస్‌ గ్లొక్కెంటిన్‌

 • డోనల్డ్‌ గొర్డన్‌

 • రాబర్ట్‌ లుసియోని

 • అలిక్స్‌ రీన్‌మ్యూలర్‌

 • డేవిడ్‌ సింక్లేర్‌

సర్వీస్‌

 • గ్యారీ బ్రో

 • జోయెల్‌ డెలింగర్‌

 • బెట్టీ జార్జ్‌

 • ఆంథొని గ్రిఫిన్‌

 • సేత్‌ హయాట్‌

 • జోడీ జిడేల్‌

 • క్రిస్టఫర్‌ మేవర్‌

 • జూ. బాల్టాసర్‌ పెర్లా

 • జేకబ్‌ రంప్‌

 • స్మిత్‌ జానతన్‌

 • జూ. విలియమ్‌ టర్నర్‌

 • జూ. లీయాంగ్‌ వీవర్‌

టీచింగ్‌

 • మెఖెల్‌ బ్యాంక్స్‌

 • రానల్డ్‌ కర్జన్‌

 • కెన్నెత్‌ ఫ్లోడీన్‌

 • విలియమ్‌ మాలన్‌ఫంట్‌

 • మార్క్‌ నూమర్‌

 • డేవిడ్‌ షేఫర్‌

రైటింగ్‌

 • నికోలస్‌ అలాడిస్‌

 • క్రిస్టెన్సేన్‌ పర్‌

 • రాబర్ట్‌ సిరాంకో

 • కెన్నెత్‌ గాడ్‌బర్న్‌

 • జేమ్స్‌ మాంట్స్‌

 • ఇసాక్‌ మారే

 • క్లీవ్‌ మార్టిన్‌

 • లియోనార్డ్‌ మయర్స్‌

 • జీన్‌ స్మాలీ

 • హెర్మానస్‌ వాన్‌ సెల్మ్‌