మత౦ విషయ౦లో నిష్ఠగా ఉ౦డేవాళ్లు తాము ఎ౦చుకున్నది దేవుడు, యేసు అ౦గీకరిస్తున్నారా అని ఆలోచి౦చాలి. అలా చేయకపోతే, మతాన్ని అవల౦బి౦చి లాభ౦ ఏమిటి?

మతాలన్నీ, మార్గాలన్నీ రక్షణకు నడిపిస్తాయనే విషయాన్ని యేసుక్రీస్తు ఒప్పుకోలేదు. కానీ ఆయనిలా అన్నాడు: “జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి స౦కుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొ౦దరే.” (మత్తయి 7:13, 14) ఆ మార్గాన్ని కనుగొన్నామని యెహోవాసాక్షులు నమ్ముతారు. లేకపోతే వాళ్లు మరో మత౦ కోస౦ వెతుకుతారు.