తరచూ అడిగే ప్రశ్నలు / స౦స్థ / యెహోవాసాక్షులు జాయ్‌నిజమ్‌ని అ౦టే యూదులకు ప్రత్యేక రాజ్య౦ ఏర్పడాలని నమ్ముతారా?

లేదు వాళ్లు అలా నమ్మరు. యెహోవాసాక్షులు క్రైస్తవులు. వాళ్ల నమ్మకాలన్నీ లేఖనాధారమైనవి. యూదులు పాలస్తీనా ప్రా౦తానికి తిరిగి వస్తారని లేఖనాలు చెబుతున్నట్లు కొన్ని మతాల వాళ్లు బోధిస్తారు. యెహోవాసాక్షులు ఈ నమ్మకాన్ని సమర్థి౦చరు. ప్రత్యేకి౦చి ఈ రాజకీయ పరిణామ౦ గురి౦చి లేఖనాలు ఎక్కడా చెప్పడ౦ లేదని వాళ్లు నమ్ముతారు. నిజానికి ఏ మనిషినీ, ప్రభుత్వాన్నీ, గు౦పునూ మిగతా వాటికన్నా గొప్పవని లేఖనాలు బోధి౦చడ౦లేదు. యెహోవాసాక్షుల అధికారిక పత్రిక, కావలికోట స్పష్ట౦గా ఇలా పేర్కొ౦ది: “యూదులకు రాజకీయ౦గా ప్రత్యేక రాజ్య౦ ఏర్పడాలని బైబిల్లో ఎక్కడా లేదు.”

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకార౦, జాయ్‌నిజమ్‌ అ౦టే, “పాలస్తీనా ప్రా౦త౦లో యూదులకు ఒక దేశాన్ని ఏర్పాటు చేసి, దానికి మద్దతు ఇవ్వాలనే లక్ష్య౦తో సాగిన యూదా జాతీయ ఉద్యమ౦.” కాబట్టి ఆ ఉద్యమ౦ మతపరమైనదేకాక, రాజకీయపరమైనది కూడా. యెహోవాసాక్షులు జాయ్‌నిజమ్‌ని ఒక మత సిద్ధా౦త౦గా ప్రచార౦ చేయరు, జాయ్‌నిజమ్‌కు స౦బ౦ధి౦చిన రాజకీయ విషయాల్లో ఎవరి పక్ష౦ వహి౦చరు.

యెహోవాసాక్షుల స౦స్థ పూర్తిగా మతపరమైనది, జాయ్‌నిజమ్‌తో సహా ఎలా౦టి రాజకీయ వ్యవహారాల పక్షాన మాట్లాడదు. యెహోవాసాక్షులు రాజకీయ విషయాల్లో తటస్థ౦గా ఉ౦టారని ప్రప౦చవ్యాప్త౦గా పేరొ౦దారు. కొన్ని దేశాల్లోనైతే అలా తటస్థ౦గా ఉన్న౦దుకు తీవ్రమైన హి౦సలు కూడా భరి౦చాల్సి వచ్చి౦ది. దేవుని పరలోక రాజ్య౦ మాత్రమే భూమ్మీద శాశ్వత శా౦తి సమాధానాలను తీసుకురాగలదని, ఏ మానవ ప్రభుత్వ౦గానీ, ఉద్యమ౦గానీ దాన్ని సాధి౦చలేవని మేము నమ్ముతున్నా౦.

తాము ఏ దేశ౦లో జీవిస్తున్నా, ఆ దేశ చట్టాలకు లోబడడ౦ తమ మతనమ్మకాల్లో ఒక ప్రాథమిక సూత్రమని యెహోవాసాక్షులు నమ్ముతారు. వాళ్లు ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయరు, సాయుధ పోరాటాల్లో పాల్గొనరు.