కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు ఇంటింటికి ఎందుకు వెళ్తారు?

యెహోవాసాక్షులు ఇంటింటికి ఎందుకు వెళ్తారు?

యేసు తన అనుచరులతో, “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని చెప్పాడు. (మత్తయి 28:19, 20) ఆయన తన మొదటి శిష్యులను పంపిస్తూ ప్రజలను కలుసుకోవడానికి ఇంటింటికి వెళ్లమని చెప్పాడు. (మత్తయి 10:7, 11-13) యేసు మరణం తర్వాత తొలి క్రైస్తవులు, ‘బహిరంగంగా, ఇంటింటా’ తమ సందేశాన్ని ప్రకటిస్తూ దాన్ని ఎన్నో చోట్లకు వ్యాప్తి చేశారు. (అపొస్తలుల కార్యములు 5:42; 20:20) ఆ తొలి క్రైస్తవులను మేము ఆదర్శంగా తీసుకుని ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తాం. ప్రజలను కలుసుకునేందుకు ఇదొక చక్కని మార్గమని మేము తెలుసుకున్నాం.