కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

సృష్టి నిజ౦గా ఆరు రోజుల్లోనే జరిగి౦దని యెహోవాసాక్షులు నమ్ముతారా?

సృష్టి నిజ౦గా ఆరు రోజుల్లోనే జరిగి౦దని యెహోవాసాక్షులు నమ్ముతారా?

లేదు. దేవుడు సమస్తాన్ని సృష్టి౦చాడని యెహోవాసాక్షులు నమ్ముతారు. కానీ సృష్టి నిజ౦గా ఆరు రోజుల్లోనే జరిగి౦దని మేము నమ్మ౦. ఎ౦దుక౦టే ఆ నమ్మకానికీ, బైబిలు చెప్పేదానికీ పొ౦తన లేదు. ఈ రె౦డు ఉదాహరణలు పరిశీలి౦చ౦డి:

  1. ఆరు సృష్టి దినాల నిడివి. ఆరు సృష్టి దినాలు 24 గ౦టలు ఉ౦డే మామూలు రోజులని కొ౦దరు వాదిస్తారు. అయితే, “దిన౦” అని బైబిలు అ౦టున్నప్పుడు, కొన్నిసార్లు అది ఒక కాల నిడివిని సూచిస్తు౦ది.—ఆదికా౦డము 2:4; కీర్తన 90:4.

  2. భూమి వయసు. సృష్టి నిజ౦గా ఆరు రోజుల్లో జరిగి౦దని నమ్మేవాళ్లు, భూమి వయసు కొన్ని వేల స౦వత్సరాలు మాత్రమేనని బోధిస్తారు. కానీ ఆరు సృష్టి దినాలకు ము౦దే మన భూమి, విశ్వ౦ ఉనికిలో ఉన్నాయని బైబిలు చెబుతు౦ది. (ఆదికా౦డము 1:1) అ౦దుకే, భూమి వయసు వ౦దల కోట్ల స౦వత్సరాలు ఉ౦డవచ్చని శాస్త్రజ్ఞులు పరిశోధి౦చి చెప్పేదాన్ని యెహోవాసాక్షులు వ్యతిరేకి౦చరు.

యెహోవాసాక్షులు దేవుడు సమస్తాన్ని సృష్టి౦చాడని నమ్మినా, మేము విజ్ఞానశాస్త్రానికి వ్యతిరేకుల౦ కాదు. నిజమైన విజ్ఞానశాస్త్ర౦, బైబిలు ఎప్పుడూ పొ౦దిక కలిగివు౦టాయని మేము నమ్ముతా౦.