కంటెంట్‌కు వెళ్లు

స్కూల్లో తోటివాళ్ల నుండి వచ్చే హింసను ఎదుర్కోవడానికి పిల్లలు సహాయం పొందారు

స్కూల్లో తోటివాళ్ల నుండి వచ్చే హింసను ఎదుర్కోవడానికి పిల్లలు సహాయం పొందారు

బ్రిటన్‌ దేశంలో ఉంటున్న పది సంవత్సరాల హ్యూగో ఈ మధ్యనే డయానా అవార్డును అందుకున్నాడు. స్కూల్లో హింసను ఎదుర్కోవడానికి తన తోటి పిల్లలకు సహాయం చేసినందుకు ఓ బ్రిటన్‌ చారిటీ హ్యూగోకు ఆ అవార్డు ఇచ్చింది.

హ్యూగో ఇలా అన్నాడు: “బీట్‌ ఎ బులీ విథౌట్‌ యూసింగ్‌ యువర్‌ ఫిస్ట్స్‌అనే వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ వీడియో వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. jw.org వెబ్‌సైట్‌లో ఉన్న ఆ వీడియో నుండి నేర్చుకున్న వాటి వల్లే నేను స్కూల్లో హింసను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను, వేరేవాళ్లకు చెప్పగలిగాను.”

“ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజు పిల్లలు స్కూల్లో హింస ఎదుర్కుంటూ ఉంటారు... కానీ... మీరు ఆ సమస్య నుండి బయటపడవచ్చు.” (‘బీట్‌ ఎ బులీ విథౌట్‌ యూసింగ్‌ యువర్‌ ఫిస్ట్స్‌’ వీడియో నుండి తీసిన మాటలు)

హ్యూగో మొదట ఆ వీడియోను తన టీచర్లకు చూపించాడు. వాళ్లకు అది చాలా నచ్చడంతో దాన్ని స్కూల్లో ఉన్న పిల్లలందరూ jw.org వెబ్‌సైట్‌ చూసే ఏర్పాటు చేశారు. ఎనిమిది నుండి పది సంవత్సరాల వయసున్న పిల్లల్లో చాలామంది jw.org వెబ్‌సైట్‌ను క్రమంగా చూస్తున్నారు. స్కూల్లో ఎదురయ్యే హింసను తట్టుకోవడమే కాకుండా నిజమైన ఫ్రెండ్స్‌ కావాలంటే ఏమి చేయాలో తెలుసుకోవడానికి కూడా ఆ వెబ్‌సైట్‌ సహాయం చేసిందని ఆ పిల్లలు చెప్పారు.

పిల్లలకు ఉపయోగపడే మంచి సమాచారం

బ్రిటన్‌లోని మరో స్కూల్లో చదువుతున్న ఎనిమిది సంవత్సరాల ఎలైజా కూడా ఇలాంటి హింసనే ఎదుర్కొన్నాడు. ఎలైజా తన కుటుంబంతో కలిసి ‘బీట్‌ ఎ బులీ’ వీడియోను చూశాడు. ఆ తర్వాత, తనను ఎవరైనా హింసించినప్పుడు ఏం చెప్పాలో, ఏం చేయాలో తన కుటుంబంతో కలిసి ప్రాక్టీసు చేశాడు. అలా ఆ సమస్యను ధైర్యంగా ఎదిరించడానికి కావాల్సిన సహాయం ఎలైజాకు దొరికింది. తర్వాత, ఎలైజా స్కూల్లో పని చేసే హెడ్‌ టీచర్‌ ఆ వీడియోను స్కూల్లో అందరికీ చూపించాడు.

ఈ సమస్య కేవలం బ్రిటన్‌లోనే కాదు ప్రపంచమంతటా ఉంది. ఈ వైట్‌బోర్డ్‌ వీడియో పిల్లలందరికీ సహాయం చేస్తుంది.

అమెరికాలో ఉన్న పది సంవత్సరాల ఐవీను తనతోపాటు చదువుకునే అమ్మాయి ఏడిపించేది. ఆ అమ్మాయిని చూసి ఐవీ చాలా భయపడేది. కానీ ‘బీట్‌ ఎ బులీ’ వీడియో చూశాక ఐవీ ధైర్యం తెచ్చుకుని ఆ అమ్మాయితో మాట్లాడింది. జరిగిన దాని గురించి టీచర్‌కు కూడా చెప్పి ఆమె సహాయం కూడా తీసుకుంది. దాంతో ఆ అమ్మాయి ఐవీకి సారీ చెప్పింది, ఇప్పుడు వాళ్లిద్దరు స్నేహితులు.

యువకులు, పిల్లలు సంతోషంగా ఉండాలని యెహోవాసాక్షులు కోరుకుంటారు. స్కూల్లో హింస వంటి ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవడానికి సహాయం చేసే సలహాలను మేము ఇక ముందు కూడా ప్రచురిస్తూ ఉంటాం.