కంటెంట్‌కు వెళ్లు

మీరు ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్పండి

మీరు ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్పండి

ఒన్‌గ్లీ బల్గేరియాలో ఉన్న ఒక యెహోవాసాక్షి. ఆమె ఒక యౌవన స్త్రీ అయిన జ్లాట్కతో బైబిలు స్టడీ చేస్తుంది. జ్లాట్క భర్త మాత్రం బైబిలు స్టడీ తీసుకోవడం లేదు. ఒన్‌గ్లీ ఇలా చెప్తుంది: “కుటుంబ జీవితం గురించి చర్చిస్తున్నప్పుడు, భార్యకు లేదా భర్తకు, పిల్లలకు వాళ్లను ప్రేమిస్తున్నామని చెప్పడం ఎంత ముఖ్యమో నేను నొక్కి చెప్పాను. జ్లాట్క నా వైపు బాధగా చూసింది; ఆమె తన భర్తకు గానీ, తొమ్మిది సంవత్సరాల తన కూతురికి గానీ వాళ్లను ప్రేమిస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు అని అంది!”

జ్లాట్క ఇలా వివరించింది, “వాళ్ల కోసం ఏమి చేయడానికైనా సిద్ధమే, కానీ నేను ఆ పదాలు మాత్రం చెప్పలేను.” ఆమె ఇంకా ఇలా చెప్తుంది, “నన్ను ప్రేమిస్తున్నానని మా అమ్మ నాకు ఎప్పుడూ చెప్పలేదు, మా అమ్మమ్మ కూడా మా అమ్మకు అలా చెప్పలేదు.” ఒన్‌గ్లీ జ్లాట్కకు యెహోవా యేసును ప్రేమిస్తున్నాడని అందరికీ వినిపించేలా బయటకు చెప్పాడని చూపించింది.

ఒన్‌గ్లీ ఇలా చెప్పింది: “రెండు రోజుల తర్వాత, జ్లాట్క సంతోషంగా నాతో యెహోవా సహాయం కోసం ప్రార్థన చేశానని చెప్పింది. ఆమె భర్త ఇంటికి రాగానే, భార్య భర్తను గౌరవించడం, ఆయనను ప్రేమించడం ఎంత ముఖ్యమో బైబిలు అధ్యయనంలో నేర్చుకున్నానని ఆయనకు చెప్పింది. ఆ తర్వాత, కొద్దిసేపు ఆగి, తను ఆయన్ను నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పింది! ఆమె కూతురు ఇంటికి రాగానే, ఆమెను కౌగిలించుకుని జ్లాట్క ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పింది.” జ్లాట్క నాకు ఇలా చెప్పింది: ‘నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను నా మనసులో ఉన్న విషయాలను బయటకు చెప్పలేకపోయాను, కానీ యెహోవా సహాయంతో, ఆఖరికి నా ప్రేమను మా కుటుంబానికి తెలియజేయగలిగాను.’

ఒన్‌గ్లీ తన చుట్టు పక్కల వాళ్లకు బైబిలు స్టడీలు చేస్తూ ఉంటుంది

ఒన్‌గ్లీ ఇంకా ఇలా చెప్పింది, “ఒక వారం తర్వాత నేను జ్లాట్క భర్తను కలిశాను, ఆయన నాతో ఇలా చెప్పాడు: ‘జ్లాట్క మీతో బైబిలు స్టడీ చేయకూడదని నాకు చాలామంది చెప్పారు, కానీ ఆమె బైబిలు స్టడీ మా కుటుంబానికి చాలా ప్రయోజనకరంగా ఉందని నేను నిస్సందేహంగా చెప్పగలను. మా మధ్య ఇప్పుడు ఎంతో అనురాగం, సంతోషం ఉన్నాయి.’”