కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

వాళ్లు ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ కనుగొన్నారు

వాళ్లు ‘ఎంతో విలువైన ముత్యాన్ని’ కనుగొన్నారు

 దేవుని రాజ్యం మనుషుల సమస్యలన్నిటినీ తీసేస్తుందని యేసు చెప్పాడు. (మత్తయి 6:10) దేవుని రాజ్యం గురించిన సత్యం ఎంత విలువైనదో వివరించడానికి, ఆయన మత్తయి 13:44-46 లో రెండు ఉదాహరణలు చెప్పాడు:

  •   ఒకతను పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు, అతనికి అనుకోకుండా ఒక దాచబడిన నిధి దొరుకుతుంది.

  •   ఒక వ్యాపారి మంచి ముత్యాల కోసం వెదుకుతూ ఉంటాడు, అతనికి ఎంతో విలువైన ముత్యం దొరుకుతుంది.

 ఆ ఇద్దరూ విలువైనదాన్ని సొంతం చేసుకోవడానికి, తమకు ఉన్నదంతా సంతోషంగా అమ్మేస్తారు. అదేవిధంగా, కొంతమంది దేవుని రాజ్యాన్ని ఎంత విలువైనదిగా ఎంచుతారంటే, దాని ఆశీర్వాదాలు పొందడం కోసం గొప్పగొప్ప త్యాగాలు చేస్తారు. (లూకా 18:29, 30) యేసు చెప్పిన ఉదాహరణల్లోని వ్యక్తుల్లాగే, మన కాలంలోని ఇద్దరు ఏం చేశారో ఈ వీడియోలో గమనించండి.