కంటెంట్‌కు వెళ్లు

బైబిలు విడాకులను అనుమతిస్తుందా?

బైబిలు విడాకులను అనుమతిస్తుందా?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిలు విడాకులను అనుమతిస్తుంది. అయితే, వివాహ బంధాన్ని తెంచుకోగల ఒకేఒక్క కారణాన్ని చెబుతూ యేసు ఇలా అన్నాడు: “మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు.”—మత్తయి 19:9.

 దురుద్దేశంతో, మోసం చేసి విడాకులు తీసుకుంటే దేవునికి నచ్చదు. సరైన కారణం లేకుండా తమ జతను వదిలేస్తే, ముఖ్యంగా వేరొకరిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో అలా చేస్తే, వాళ్లు యెహోవాకు లెక్క చెప్పాల్సి ఉంటుంది.—మలాకీ 2:13-16; మార్కు 10:9.