కంటెంట్‌కు వెళ్లు

హాలొవీన్‌ పండుగ ఎలా ప్రారంభమైంది?—దాని గురించి బైబిలు ఏమి చెప్తుంది?

హాలొవీన్‌ పండుగ ఎలా ప్రారంభమైంది?—దాని గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

హాలొవీన్‌ గురించి బైబిలు ప్రస్తావించట్లేదు. ఆ పండుగ ఎలా ప్రారంభమైందో, ఇప్పుడు దాన్ని ఎలా ఆచరిస్తున్నారో పరిశీలిస్తే, అది చనిపోయినవాళ్లకు, కనపడని ఆత్మలకు లేదా దయ్యాలకు సంబంధించిన అబద్ధ నమ్మకాలపై ఆధారపడినదని అర్థమౌతుంది.— “హాలొవీన్‌ చరిత్ర, ఆచారాలు” చూడండి.

బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “కర్ణపిశాచి నడుగువానినైను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైను మీ మధ్య ఉండనియ్యకూడదు.” (ద్వితీయోపదేశకాండము 18:10-12) హాలొవీన్‌ పండుగ చేయడంలో ఎలాంటి హాని లేదు అని కొంతమంది అంటారు. కానీ దానికి సంబంధించిన ఆచారాలు హానికరమైనవని బైబిలు చెప్తుంది. 1 కొరింథీయులు 10:20, 21 లో (విత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) బైబిలు ఇలా చెప్తుంది: “మీరు దయ్యాలతో వంతు తీసుకోవడం నాకిష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోది, పిశాచాల పాత్రలోది కూడా త్రాగలేరు.”

 హాలొవీన్‌ చరిత్ర, ఆచారాలు

  1. సమ్‌హేయిన్‌: హాలొవీన్‌ పండుగ, “దాదాపు 2000 సంపత్సరాల క్రితం సెల్టు జాతి ప్రజలు జరుపుకున్న ప్రాచీన అన్యమత పండుగ”కు సంబంధించినదని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెప్తుంది. ఆ పుస్తకం ఇంకా ఇలా చెప్తుంది, “ఈ పండుగ సమయంలో చనిపోయినవాళ్లు లేచి బ్రతికున్నవాళ్ల మధ్య నడుస్తారని ఆ ప్రజలు నమ్మేవాళ్లు. ఆ సమయంలో, బ్రతికున్నవాళ్లు చనిపోయినవాళ్లను కలుసుకునేవాళ్లు.” అయితే, చనిపోయినవారు “ఏమియు ఎరుగరు” అని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (ప్రసంగి 9:5) కాబట్టి, వాళ్లు బ్రతికున్నవాళ్లను కలవలేరు.

  2. బట్టలు, స్వట్లు, బెదిరించి పార్టీ అడగడం: హాలొవీన్‌—యాన్‌ అమెరికన్‌ హాలిడే, యాన్‌ అమెరికన్‌ హిస్టరీ అనే పుస్తకం ప్రకారం, హాలొవీన్‌ పండుగ సమయంలో సెల్టుల్లో కొంతమంది దయ్యాల్లాంటి బట్టలు వేసుకునేవాళ్లు. అలా వేసుకుంటే, తిరుగుతున్న ఆత్మలు వాళ్లను కూడా తమలాంటి దయ్యాలే అనుకొని వాళ్లను విడిచివెళ్లిపోయేవి. మరికొంతమంది, ఆత్మలను శాంతపర్చడానికి వాటికి స్వట్లు పంచిపెట్టేవాళ్లు. మధ్యయుగంనాటి యూరప్‌లో, క్యాథలిక్‌ మతనాయకులు ఇలాంటి అన్యమత ఆచారాలను చేయడం మొదలుపెట్టారు. వాళ్లు తమ అనుచరులను దయ్యాల్లాంటి బట్టలు వేసుకుని, ఇంటింటికి వెళ్లి చిన్న బహుమతులు అడగమని చెప్పేవాళ్లు. మరోవైపు, దేవుని ఆరాధనలో అబద్ధమత ఆచారాలను కలపడాన్ని బైబిలు ఖండిస్తుంది.—2 కొరింథీయులు 6:17.

  3. దయ్యాలు, పిశాచాలు, తోడేళ్లుగా మారే మనుషులు, మంత్రగత్తెలు, చనిపోయినవాళ్లు లేచి తిరగడం: ఇవన్నీ ఎంతోకాలంగా దురాత్మలతో సంబంధం కలిగివున్నాయి. (హాలొవీన్‌ ట్రివియా) మనం దురాత్మలతో పోరాడాలని బైబిలు స్పష్టంగా చెప్తుంది, అంతేకానీ వాటితో పండుగ చేసుకోమని కాదు.—ఎఫెసీయులు 6:12.

  4. హాలొవీన్‌ గుమ్మడికాయలు, లేదా జాకో లాంతర్లు: మధ్యయుగంనాటి బ్రిటన్‌లో, హాలొవీన్‌ పండుగ సమయంలో “కొంతమంది ఇంటింటికి వెళ్లి చనిపోయినవాళ్లకోసం ప్రార్థన చేసి, ఆహారం అడిగేవాళ్లు.” అలాగే తమతోపాటు “ఒక రకం దుంపతో చేసిన లాంతర్లను తీసుకెళ్లేవారు. ఆ దుంపలోని కొవ్వొత్తి, పాపవిమోచన లోకంలో చిక్కుకుపోయిన ఆత్మకు గుర్తుగా ఉండేది.” (హాలొవీన్‌—ఫ్రమ్‌ పాగన్‌ రిచువల్‌ టు పార్టీ నైట్‌) అయితే, దురాత్మలను వెళ్లగొట్టడానికి లాంతర్లను ఉపయోగించేవాళ్లని మరికొంతమంది అంటారు. 1800లలో ఉత్తర అమెరికాలో, దుంపల బదులు గుమ్మడికాయలను వాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ గుమ్మడికాయలు ఎక్కువగా దొరికేవి, అలాగే వాటితో లాంతర్లను చేయడం సులభంగా ఉండేది. ఆ ఆచారం అమర్త్యమైన ఆత్మ, పాపవిమోచన లోకం, చనిపోయినవాళ్లకోసం ప్రార్థనలు చేయడం వంటి నమ్మకాలపై ఆధారపడి ఉంది. కానీ, ఆ నమ్మకాలు బైబిల్లోవి కావు.—యెహెజ్కేలు 18:4.