కంటెంట్‌కు వెళ్లు

సాతాను మనుషుల్ని లోపర్చుకోగలడా?

సాతాను మనుషుల్ని లోపర్చుకోగలడా?

బైబిలు ఇచ్చే జవాబు

సాతాను, చెడ్డదూతలు మనుషుల్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నారంటే, “లోకమంతయు దుష్టుని యందున్నది” అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 5:19) మనుషుల్ని తప్పుదోవ పట్టించడానికి సాతాను ఉపయోగించే పద్ధతుల గరించి బైబిలు చెప్తుంది.

  • మోసం చేయడం. ‘అపవాది తంత్రాలను ఎదిరించండి’ అని బైబిలు క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తుంది. (ఎఫెసీయులు 6:11) మనుషుల్ని మోసం చేయడానికి సాతాను ఉపయోగించే ఓ మార్గం, తన అనుచరులు దేవుని సేవకులేనని ప్రజల్ని నమ్మించి మోసం చేయడం.​—2 కొరింథీయులు 11:13-15

  • మంత్రతంత్రాలు. కర్ణపిశాచాలను అడగడం, సోదె చెప్పడం, శకునాలు చూడడం, జ్యోతిష్యం వంటివాటిని ఉపయోగించి సాతాను ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. (ద్వితీయోపదేశకాండము 18:10-12) డ్రగ్స్‌ వాడడం, హిప్నాటిజమ్‌, మనసును ఖాళీగా ఉంచుకోవడానికి చేసే మెడిటేషన్‌ పద్ధతులు కూడా ఒక వ్యక్తి దయ్యాల అధీనంలోకి వెళ్లిపోయేలా చేస్తాయి.​—లూకా 11:24-26.

  • అబద్ధ మతం. కొన్ని మతాలు అబద్ధ సిద్ధాంతాలు బోధిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాయి, దేవున్ని అగౌరపరుస్తున్నాయి. (1 కొరింథీయులు 10:20) అలాంటి అబద్ధ నమ్మకాల్ని బైబిలు “దయ్యముల బోధ” అని పిలుస్తోంది.​—1 తిమోతి 4:1.

  • వశపర్చుకోవడం. చెడ్డదూతలు కొంతమంది వ్యక్తుల్ని లోపర్చుకున్న సంధర్భాల గురించి బైబిల్లో ఉంది. కొన్నిసార్లు ఆ వ్యక్తులు కంటిచూపు కోల్పోయారు, మూగవాళ్లయ్యారు లేదా తమను తాము గాయపర్చుకున్నారు.​—మత్తయి 12:22; మార్కు 5:2-5.

చెడ్డదూతల ప్రభావం నుండి ఎలా తప్పించుకోవచ్చు?

మీరు సాతానుకు లేదా చెడ్డదూతలకు భయపడి జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మీరు సాతానును ఎలా ఎదిరించవచ్చో బైబిలు తెలియజేస్తుంది:

  • సాతాను పన్నే పన్నాగాలను గుర్తించడం నేర్చుకోండి. అలాచేస్తే “సాతాను తంత్రములను” మనం ఎరిగివుంటాం.—2 కొరింథీయులు 2:11.

  • బైబిల్లోని విషయాలు తెలుసుకొని, వాటిని పాటించండి. అలా బైబిలు సూత్రాల్ని పాటిస్తే సాతాను ప్రభావం మీమీద పడకుండా ఉంటుంది.​—ఎఫెసీయులు 6:11-18.

  • దయ్యాలకు సంబంధించిన దేన్నైనా తీసేయండి. (అపొస్తలుల కార్యములు 19:19) మంత్రతంత్రాలకు సంబంధించిన సంగీతం, పుస్తకాలు, పత్రికలు, పోస్టర్లు, వీడియోలు వంటివాటిని వదిలించుకోండి.