కంటెంట్‌కు వెళ్లు

సాతానును దేవుడే సృష్టించాడా?

సాతానును దేవుడే సృష్టించాడా?

బైబిలు ఇచ్చే జవాబు

సాతానును దేవుడు సృష్టించలేదని బైబిలు చెబుతుంది. అయితే, ఆయన సృష్టించిన ఓ వ్యక్తి ఆ తర్వాత సాతానుగా మారాడు. దేవుని గురించి బైబిలు ఇలా చెబుతుంది: “ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:3-5) కాబట్టి, దేవుని కుమారుల్లో ఒకడైన అపవాది ఒకప్పుడు పరిపూర్ణుడు, నీతిమంతుడని మనం తెలుసుకోవచ్చు.

యోహాను 8:44లో, సాతాను “సత్యమందు నిలిచినవాడు కాడు” అని యేసుక్రీస్తు చెప్పాడు. ఈ మాటలు, సాతాను ఒకప్పుడు యథార్థంగా, నిందారహితునిగా ఉన్నాడని చూపిస్తున్నాయి.

యెహోవా సృష్టిలోని బుద్ధిసూక్ష్మతగల ఇతర ప్రాణుల్లాగే, సాతానుగా మారిన ఆ దేవదూతకు కూడా మంచి చెడులను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఉంది. అయితే, సాతాను దేవునికి వ్యతిరేకంగా ఉండాలనే ఎంపిక చేసుకుని, మొదటి మానవ దంపతులు కూడా తనతో చేతులు కలిపేలా వాళ్లను ప్రేరేపించాడు. అలా తనకుతాను, “వ్యతిరేకించేవాడు” అని అర్థాన్నిచ్చే సాతానుగా మారాడు.—ఆదికాండము 3:1-5; ప్రకటన 12:9.