కంటెంట్‌కు వెళ్లు

నా జీవితం నాకు నచ్చలేదు—మతంగానీ, దేవుడుగానీ లేదా బైబిలుగానీ ఈ విషయంలో నాకు సహాయం చేయగలవా?

నా జీవితం నాకు నచ్చలేదు—మతంగానీ, దేవుడుగానీ లేదా బైబిలుగానీ ఈ విషయంలో నాకు సహాయం చేయగలవా?

బైబిలు ఇచ్చే జవాబు

చేయగలవు. జ్ఞానానికి సంబంధించిన ఒక పురాతన పుస్తకమైన బైబిలు జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబిస్తుంది. అది మీ బాధను తగ్గించి సంతోషంగా జీవించేందుకు సహాయపడగలదు. కొన్ని ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబేమిటో పరిశీలించండి:

  1. సృష్టికర్త ఉన్నాడా?​ దేవుడు ‘సమస్తాన్ని సృష్టించాడు’ అని బైబిలు చెప్తుంది. (ప్రకటన 4:10, 11) కాబట్టి మనం సంతోషంగా, సంతృప్తిగా జీవించడానికి ఏమి అవసరమో ఆయనకు బాగా తెలుసు.

  2. దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా?​ దేవుడు మనషులకు దూరంగా ఉంటాడని బైబిలు చెప్పడం లేదుగానీ, “ఆయన మనలో ఎవరికీ దూరంగా లేడు” అని బైబిలు చెప్తుంది. (అపొస్తలుల కార్యములు 17:26, 27) మీ జీవితంలో జరిగే ప్రతీ విషయం పట్ల ఆయనకు ఆసక్తి ఉంది. అంతేకాదు మీరు జీవితంలో విజయం సాధించేందుకు ఆయన సహాయం చేయాలనుకుంటున్నాడు కూడా.—యెషయా 48:17, 18; 1 పేతురు 5:7.

  3. దేవుని గురించి తెలుసుకుంటే నా బాధ తగ్గుతుందా?​ దేవుడు మనల్ని ఆధ్యాత్మిక ఆకలితో సృష్టించాడు. అంటే మన జీవితానికున్న అర్థం ఏమిటో, జీవిత సంకల్పం ఏమిటో తెలుసుకోవాలనే బలమైన కోరికను మనలో పెట్టాడు. (మత్తయి 5:3) మన సృష్టికర్త గురించి తెలుసుకోవాలనుకోవడం, ఆయనతో మంచి సంబంధం ఏర్పర్చుకోవాలనుకోవడం ఇవన్నీ ఆ ఆధ్యాత్మిక ఆకలిలో భాగమే. తన గురించి తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్ని చూసి ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే బైబిలు ఇలా చెప్తుంది: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”—యాకోబు 4:8.

దేవునితో స్నేహం చేయడం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించడానికి, సంతోషంగా జీవించడానికి సహాయం చేసిందని లక్షలాదిమంది గ్రహించారు. దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల మీకు జీవితంలో సమస్యలే ఉండవని కాదు, బైబిల్లోని దేవుని జ్ఞానం ఈ కింది విషయాల్లో మీకు సహాయం చేస్తుంది:

బైబిల్ని ఉపయోగించే చాలా మతాలు నిజానికి అందులో ఉన్న బోధల్ని పాటించవు. కానీ నిజమైన మతం మాత్రం, బైబిలు బోధించే విషయాల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. దేవుని గురించి తెలుసుకోవడానికి అది మీకు సహాయం చేస్తుంది.