కంటెంట్‌కు వెళ్లు

లోకం ఎప్పుడు అంతమౌతుంది?

లోకం ఎప్పుడు అంతమౌతుంది?

బైబిలు ఇచ్చే జవాబు

లోకం ఎప్పుడు అంతమౌతుందో తెలుసుకోవాలంటే, ముందు బైబిల్లో “లోకం” అనే పదానికి అర్థమేంటో తెలుసుకోవాలి. “లోకం” అని తరచూ అనువదించబడిన కాస్మోస్‌ అనే గ్రీకు పదం, మొత్తం మానవ జాతిని, మరిముఖ్యంగా దేవునికీ ఆయన చిత్తానికీ వ్యతిరేకంగా ఉన్న మానవ జాతిని సూచిస్తుంది. (యోహాను 15:18, 19; 2 పేతురు 2:5) కానీ కొన్నిసార్లు మాత్రం, కాస్మోస్‌ అనే పదం మానవ వ్యవస్థను సూచించింది.—1 కొరింథీయులు 7:31; 1 యోహాను 2:15, 16. *

“లోకాంతం” అంటే ఏంటి?

“లోకాంతం” అనే మాట చాలా బైబిలు అనువాదాల్లో కనిపిస్తుంది. దాన్ని “వ్యవస్థ ముగింపు” లేదా “యుగసమాప్తి” అని కూడా అనువదించవచ్చు. (మత్తయి 24:3, ఇంగ్లీష్‌ స్టాండర్డ్‌ వర్షన్‌) “లోకాంతం” అనే మాట, భూమి అంతమవ్వడాన్నో మనుషులందరూ అంతమవ్వడాన్నో సూచించట్లేదు కానీ, మానవ వ్యవస్థ అంతమవ్వడాన్ని సూచిస్తుంది.—1 యోహాను 2:17.

మంచివాళ్లు ఈ భూమ్మీదే సంతోషంగా జీవిస్తారు, ‘చెడు చేసేవాళ్లు నాశనమౌతారు’ అని బైబిలు చెప్తుంది. (కీర్తన 37:9-11, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఆ నాశనం ‘మహాశ్రమల్లో’ జరుగుతుంది. మహాశ్రమలు హార్‌మెగిద్దోను యుద్ధంతో ముగుస్తాయి.—మత్తయి 24:21, 22; ప్రకటన 16:14, 16.

లోకం ఎప్పుడు అంతమౌతుంది?

“ఆ రోజు, ఆ గంట ఎప్పుడో ఏ మనిషికీ తెలియదు. పరలోక దేవదూతలకూ తెలియదు. కుమారునికి కూడా తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు” అని యేసు చెప్పాడు. (మత్తయి 24:36, 42, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అది మనం ఊహించని గడియలో, “అనుకొనని గడియలో” వస్తుందని కూడా ఆయన అన్నాడు.—మత్తయి 24:44.

ఆ రోజు, ఆ గంట ఎప్పుడో మనకు తెలియకపోయినా, లోకాంతానికి ముందు జరిగే సంఘటనలకు సంబంధించి యేసు ఒక “సూచన” ఇచ్చాడు. ఆ సూచనలో ఎన్నో అంశాలు ఉన్నాయి. (మత్తయి 24:3, 7-14) లోకాంతానికి ముందున్న ఆ కాలాన్నే బైబిలు “అంత్యకాలము,” “అంత్యకాలములు,” ‘అంత్యదినములు’ అని పిలుస్తుంది.—దానియేలు 12:4; గాడ్స్‌ వర్డ్‌ బైబిల్‌; 2 తిమోతి 3:1-5.

ఈ లోకం అంతమైపోయిన తర్వాత ఏదైనా మిగిలివుంటుందా?

అవును. లోకాంతం తర్వాత భూమి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే, ‘భూమి ఎన్నటికి కదలదు’ అని బైబిలు చెప్తుంది. (కీర్తన 104:5) అంతేకాదు, ‘నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు వాళ్లు దానిలో నిత్యం నివసిస్తారు’ అని బైబిలు చెప్తున్నట్లుగా, ఈ భూమంతా ప్రజలతో నిండి ఉంటుంది. (కీర్తన 37:29) ఈ భూమ్మీద ఎలాంటి పరిస్థితులు ఉండాలని దేవుడు మొదట కోరుకున్నాడో, అవన్నీ ఈ భూమ్మీద ఉంటాయి:

^ పేరా 3 కొన్ని బైబిళ్లలో ఎయాన్‌ అనే గ్రీకు పదాన్ని కూడా “లోకం” అని అనువదించారు. అలా అనువదించినప్పుడు, కాస్మోస్‌ లాగే, ఎయాన్‌ కూడా మానవ వ్యవస్థను సూచిస్తుంది.