కంటెంట్‌కు వెళ్లు

యేసు సర్వశక్తిగల దేవుడా?

యేసు సర్వశక్తిగల దేవుడా?

బైబిలు ఇచ్చే జవాబు

యేసు తాను “దేవునితో సమానునిగా” చేసుకున్నాడని వ్యతిరేకులు నిందించారు. (యోహాను 5:18; 10:30-33) తాను సర్వశక్తిగల దేవునితో సమానమని యేసు ఎప్పుడు చెప్పుకోలేదు. నిజానికి, “తండ్రి నాకంటే గొప్పవాడు” అని యేసు అన్నాడు.—యోహాను 14:28.

యేసు తొలి అనుచరులు కూడా, ఆయనను సర్వశక్తిగల దేవునితో సమానమైన వ్యక్తిగా చూడలేదు. ఉదాహరణకు, యేసు చనిపోయి లేచిన తర్వాత, ‘దేవుడు యేసును అధికముగా హెచ్చించాడు’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. అంటే, యేసు సర్వశక్తిగల దేవుడని పౌలు నమ్మలేదు అని అర్థమౌతుంది. ఒకవేళ యేసు సర్వశక్తిగల దేవుడైతే, ఆయనను దేవుడు ఎలా అధికముగా హెచ్చించగలడు?—ఫిలిప్పీయులు 2:11.