కంటెంట్‌కు వెళ్లు

యేసు కేవలం ఒక మంచి వ్యక్తేనా?

యేసు కేవలం ఒక మంచి వ్యక్తేనా?

బైబిలు ఇచ్చే జవాబు

యేసు కేవలం ఒక మంచి వ్యక్తి మాత్రమే కాదు. ఎంత కాదన్న, మానవ చరిత్రలో మనుషులపై అత్యంత ప్రభావం చూపించిన వ్యక్తి ఆయనేనని నిరూపితమైంది. ప్రఖ్యాత చరిత్రకారులు, రచయితలు ఆయన గురించి ఏమంటున్నారో గమనించండి:

“నజరేతువాడైన యేసు . . . చరిత్రలో చాలా పేరుగాంచిన వ్యక్తి.”—హెచ్‌. జీ. వెల్స్‌, ఇంగ్లీషు చరిత్రకారుడు.

“భూమ్మీద జీవించిన వాళ్లందరి కన్నా యేసు జీవితమే అత్యంత ప్రభావితం చేసేదిగా ఉంది. అంతేకాదు, మనుషులపై ఆ ప్రభావం రోజురోజుకీ పెరుగుతూనే వస్తుంది.”—కెనత్‌ స్కాట్‌ లాటూరెట్‌, అమెరికాకు చెందిన చరిత్రకారుడు, గ్రంథకర్త.

చరిత్రలో చాలామంది మంచి వ్యక్తులున్నా యేసే అత్యంత ప్రభావం చూపించగల వ్యక్తిగా ఎందుకున్నాడో బైబిలు చెప్తుంది. యేసు ఎవరని అనుకుంటున్నారో తన అత్యంత సన్నిహిత అనుచరులను ఆయన అడిగినప్పుడు, అందులో ఒకరు సరిగ్గా జవాబిచ్చారు: “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు.”—మత్తయి 16:16.