కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

ప్రేమికులు సహజీవనం చేయవచ్చా?

ప్రేమికులు సహజీవనం చేయవచ్చా?

బైబిలు ఇచ్చే జవాబు

జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు” అని బైబిలు స్పష్టంగా చెబుతుంది. (హెబ్రీయులు 13:4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ‘జారత్వం’ (గ్రీకులో పోర్నియా) అనే పదం, పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనడాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి, త్వరలో పెళ్లిచేసుకోబోతున్నా సరే, పెళ్లికాని వాళ్లు సహజీవనం చేయడం దేవుని దృష్టిలో తప్పు.

ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నా సరే పెళ్లి అయిన తర్వాతే వాళ్ల మధ్య సెక్స్‌ ఉండాలని దేవుడు చెబుతున్నాడు. దేవుని ప్రధాన లక్షణం ప్రేమ. ప్రేమించే సామర్థ్యంతో మనల్ని సృష్టించింది దేవుడే. (1 యోహాను 4:8) కాబట్టి, మంచి ఉద్దేశంతోనే దేవుడు, పెళ్లి చేసుకున్న వాళ్ల మధ్య మాత్రమే సెక్స్‌ని అనుమతిస్తున్నాడు.